న్యూస్ సినిమా

మళ్లీ బ్రేక్ తీసుకునే ఆలోచనలో పవన్..??

Share

దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ద్వారా మెగా అభిమానులను పలకరించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. దీంతో లాక్‌డౌన్‌ సమయంలో సినిమాలు ఒప్పుకుంటూ మంచి స్పీడ్ మీద ఉన్న పవన్ వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి షెడ్యూల్ వచ్చే గురువారం తో పూర్తి కానుంది.

Pawan Kalyan to feature in Telugu remake of Pink | Regional-cinema News – India TVఅయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ మళ్లీ బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దాదాపు వరుస సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్.. లాక్‌డౌన్‌ తర్వాత ఫుల్ బిజీ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవడం పట్ల రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే షూటింగ్ చేస్తున్న సమయంలో చిన్న గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ కి గాయం అనే వార్తల్లో వాస్తవం లేదని.. రాజకీయాల్లో ఫుల్ బిజీగా పోతున్నారని, తిరుపతి ఉప ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ బీజేపీ తో అనేక కార్యక్రమాలు పెట్టుకున్నట్లు అందువల్లే ఇరవై రోజుల పాటు గ్యాప్ తీసుకుంటున్నట్లు టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్ తో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు కూడా పవన్ తో సినిమాలు ఒప్పుకోవడం జరిగింది.


Share

Related posts

Governor : గ‌వ‌ర్న‌ర్ మేడం ఎంట్రీ ఇచ్చారు… న్యాయ‌వాది హ‌త్య ఎపిసోడ్‌లో కీల‌క ప‌రిణామం

sridhar

Raghurama krishnam Raju Bail: దేశాన్ని కుదిపేస్తున్న రఘురామకృష్ణంరాజు కాలి గాయాల మెడికల్ రిపోర్ట్..!!

P Sekhar

Tonsils: టాన్సిల్స్ కు తొందరపడి ఆపరేషన్ చేయించుకోకండి..!! ఈ చిట్కా పాటించండి చాలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar