న్యూస్ సినిమా

కార్తీక దీపం వంటలక్క షూటింగ్ బ్రేక్ లో చేస్తున్న పని ఇదా!!

కార్తీక దీపం వంటలక్క షూటింగ్ బ్రేక్ లో చేస్తున్న పని ఇదా!!
Share

ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతూ తెలుగు బుల్లితెరపై నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం సీరియల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియ‌ల్‌ కి ఎంతో ఆదరణ ఉంది అలాగే ఈ సీరియల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఈ సీరియల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. గతంలో త‌న మీద ప‌డ్డ నింద‌ను ప్రస్తుతం ఎలా అయినా చెరుపుకోవాలని దీప చూస్తుంటే మరోవైపు దీప‌, కార్తీక్‌ల‌ను శాశ్వ‌తంగా విడ‌దీసి తాను పెళ్లి చేసుకోవాలని మౌనిత ప్లాన్‌లు చేస్తుంది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీరియల్ పై చాలా మీమ్స్ తారసపడుతుంటాయి. 

కార్తీక దీపం వంటలక్క షూటింగ్ బ్రేక్ లో చేస్తున్న పని ఇదా!!

దీప అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్ ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు అటు మలయాళం మరియు ఇటు తెలుగు లో ఎంతో మంది  అభిమానులు ఉన్నారు. అయితే, ఆమె తన సోషల్ మీడియా లో అప్పుడప్పుడు తన షూటింగ్ విష‌యాల‌ను కూడా అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంటారు.

తాజాగా ప్రేమి విశ్వనాధ్ తన సోషల్ మీడియా లో ఒక వీడియోను షేర్ చేశారు. షూటింగ్ బ్రేక్ లో ఆ వీడియో ను తీసినట్టు స్పష్టం  అవుతుంది. అందులో దీప‌, సౌర్య‌(బేబి కృతిక‌)తో ఆడుకుంటోంది. ఆ వీడియో లో కృతిక డ్రాయింగ్ వేస్తుంటే దీప ఆమెకు స‌హాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఆ క‌ల‌ర్‌ల‌ను సౌర్య మొహం మీద గీస్తూ ఆడుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ వీడియోకు అల్లు అర్జున్ స‌రైనోడు సినిమా లోని ఒక పాట‌ను కూడా యాడ్ చేశారు. దీనికి అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సీరియ‌ల్‌లో ఆమెకు ఉన్న ఇద్దరు కూతుర్లలో ఒక కుమార్తెగా న‌టిస్తోన్న బేబి కృతిక‌తో ప్రేమి చాలా క్లోజ్ గా ఉంటారు.


Share

Related posts

AP Three Capitals: వికేంద్రీకరణ విషయంలో తగ్గేదెలే..! అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్..కోర్టు తీర్పుపై ఏమన్నారంటే..?

somaraju sharma

Bellamkonda Srinivas: భారీ వర్షాలకు బెల్లంకొండ ‘ఛత్రపతి’ విలేజ్ సెట్ డ్యామేజ్

Muraliak

టీడీపీ చేసిన తప్పే వైసీపీ పబ్లిక్ గా చేస్తోంది .. జగన్ దృష్టికి తీసుకెళ్లే దమ్ము ఎవ్వరికీ లేదా ? 

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar