NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 6 – బుధవారం – మార్గశిర మాసం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు పిల్లల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు స్నేహితుడు మీకు సహాయం చేయలేక మిమ్మల్ని మోసంసం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది, వారితో వాదోపవాదాలు తగాదాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ రోజు స్త్రీలు బాధ్యతగా పనులను చేపడితే బాగుంటుంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టకం పారాయణం, ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు సంతోషం పరుస్తాయి. ఇతరులకు సహాయం చేయడానికి తోడ్పడతారు. ఏ పని ఐన కష్టపడి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.  ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ రోజు స్త్రీలు డబ్బులు బాగా ఖర్చు పెడతారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా , అన్యోన్యంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టం  !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో గొడవ పడకుండా ఉండడం మంచిది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు నిజాయితీగా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మంచిది. ఈరోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, లేదంటే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు సమయానికి నిద్ర హారాలు మానకుండా ఉండటం మంచిది. ఈరోజు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఈరోజు మీ శక్తి తక్కువగా ఉంటుంది. అయిన వారిని, ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి చదవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఎంత కష్టమైన పనులు అయినా ఓర్పుగా సహనం వహించి పూర్తిచేస్తారు. ఈరోజు ప్రయాణాలు కలిసివస్తాయి. విహార యాత్రలు చేస్తారు. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న సమయంలో డబ్బులు చేతికి రావడం వల్ల సంతోషంగా ఉంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పిల్లల వలన మీకు సమస్యలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పుల బాధ పడే అవకాశం ఉంటుంది. ఈరోజు తొందరపడి ఎవరిని ఏమనకుండా ఉండటం మంచిది. ఈరోజు మీకున్న ద్వేషం వల్ల ఎదుటి వారి మీద గొడవలు పడే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల మనోవేదన పడతారు. ఈరోజు నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి నీటి సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల వలన మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడిదుడుకుల వల్ల తక్కువ లాభాలు కలుగుతాయి.

రెమిడీ:ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు బాగా కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటారు. ఈ రోజు అయిన వారికి, ఎదుటి వారికి సహాయం చేస్తారు. ఈరోజు నిజాయితీగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న కోపము, తొందరపాటుతనం ఈరోజు తగ్గిపోతాయి. ఈరోజు కుటుంబం కోసం ఏ సమస్యనైనా పోరాడుతారు. ఈరోజు స్థిరాస్తులు కలిసొస్తాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యాల నుంచి బయట పడతారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. వ్యాపారస్తులు ఈరోజు పరిస్థితులను బట్టి మారడం వల్ల లాభాలు కలిసొస్తాయి.

రెమిడీ: ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు నష్టం జరిగే అవకాశం ఉంది !

ఈరోజు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ పని మీరే చేసుకోవడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎదుటివారిని అర్థం చేసుకోవడం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనారోగ్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండటం మంచిది. ఈరోజు అయిన వారిని దూరం పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తాతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధైర్యంగా, సాహసంగా ముందుకు సాగుతారు. ఈరోజు క్రయవిక్రయాలకు అనుకూలమైన రోజు. ఈరోజు వాహనం కొనుగోలు చేస్తారు. ఈరోజు అందరితో ధర్మంగా, న్యాయంగా ఉండాలని పోరాడుతారు. ఈరోజు పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తాతారు. ఈరోజు ఉద్యోగస్తులు కార్యాలయంలో ఆలోచించి పని చేయడం వల్ల మంచి అవకాశాలను పొందుతారు. ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవడం వల్ల మంచి యూనివర్సిటీ సీటు సంపాదించుకుంటారు. ఈరోజు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆధ్యాత్మిక  చింతనతో ఉంటారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు ఎవరితో అయిన చిరాగ్గా మాట్లాడడం వల్ల అయిన వారిని దూరం చేసుకుంటారు. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఏ విషయంపైనా పట్టుదలగా ఉండకుండా ఉండడం మంచిది. ఈరోజు వాదోపవాదాలకు, గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు అందరితో మంచిగా మాట్లాడటం మంచిది. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు. ఈరోజు అత్యవసరమైన పనులలో విసుగు పడకుండా పూర్తి చేసుకోవడం మంచిది. ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువు కుంటే మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు స్వల్ప ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు !

ఈరోజు కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. ఈరోజు ఆర్థికాభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు చేపట్టిన పనులన్నీ సంతోషంగా పూర్తి చేస్తారు. ఈరోజు క్రొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈ రోజు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు విలువైన పత్రాల మీద లిఖితపూర్వకంగా చేయకపోవడం మంచిది. ఈరోజు ఎవరైనా మీతో బాగా మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వడం, ఎవరి నుంచి డబ్బులు తీసుకోకపోవడం మంచిది. ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కోపాన్ని, తొందరపాటు తనాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు ఎవరు ఏం చెప్పినా చదువు మీద దృష్టి నీ కేంద్రీకరించడం మంచిది. ఈరోజు స్త్రీలు కొత్త పరిచయాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు.

రెమిడీ:ఈరోజు లింగాష్టకం పారాయణం, శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -6- బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు సమయస్ఫూర్తిగా ఉంటారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు కుటుంబసభ్యులతో సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. గొడవలను తగ్గించుకుంటారు. ఈరోజు భార్య భర్తలు ఒకరికొకరు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రోజంతా సమయస్ఫూర్తిగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం లో బాగా కష్టపడి పనిచేసి ఉన్నతస్థాయి స్థానాలను పొందుతారు. ఈరోజు స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju