NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ బిగ్ స్టోరీ

పంజాబ్, హరియాణా రైతుల్లోనే కోపం ఎందుకు? : బీజేపీకి సంకటమే

                                  (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

లక్షలాది మంది రైతులు రోడ్లు ఎక్కరేందుకు??
పిల్లజల్లా తో సహా పోరుబాట పట్టారెందుకు??
ఢిల్లీ శివారులో ఆ శివతాండవం ఏంటి??
పోలీసులు ఎందుకు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు??
కేంద్ర ప్రభుత్వం వణుకుతోంది ఎందుకు??
అప్పటికి అప్పుడు మాన్ కి బాత్ లో మోడీ వ్యవసాయ ప్రవచనాలు ఎందుకు??
అమిత్ షా కోపం ఎవరి మీద??
దేశ రాజధాని తగలబడుతుందా??

ఇవన్నీ ఇప్పడు బుర్రలోకి వచ్చేసాయా? లేదు లేదు మీరేం చెబుతున్నారో మాకు అర్ధం కావడం లేదు అంటున్నారు అంటే…. మన తెలుగు మీడియా లక్షలాది రైతులు చేస్తున్న మహోద్యమాన్ని కనీసం పట్టించుకోకపోవడమే అని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనకు ఇక్కడి కుల, పార్టీల మీడియా చేస్తున్న తప్పు వాళ్ళ పెద్ద ఉద్యమం తాలూకా వాసనే రావడం లేదు అనేది గుర్తించాలి.

ఆ రాష్ట్రాలే ఎందుకు అంటే?

దేశమంతా ఏపీఎంసి బైపాస్ బిల్లుపై గొడవలేదు. కానీ ఆ రెండు రాష్ట్రాల రైతులే ఎందుకు ఎంతలా గొడవ చేస్తున్నారు. పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎగదోస్తుందా..?
అసలు ఎందుకీ వ్యతిరేకత అనేది చూస్తే..
** కేంద్రం రాజ్యసభలో మూజువాణి వోట్ ద్వారా నూతన వ్యవసాయ విధానం 2020 ను తీసుకువచ్చింది. దీన్నే క్లుప్తంగా ఎపిఎంసి బైపాస్ బిల్లు అని చెప్పుకుంటున్నాం. దీనిలో ప్రత్యేకంగా 3 విభిన్నమైన ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవే బిల్లుకు కీలకం. దీనిలో ఒక విషయం ఏమిటంటే ప్రభుత్వం నిర్వహించే అగ్రికల్చెర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల తగ్గింపు. క్రమంగా వీటి తొలగింపు. అంటే రైతు తన పంటని మంచి ధరకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించినపుడు స్థానిక మార్కెట్ కమిటీల అవసరం ఏముంది అనేది కేంద్రం ప్రశ్న..? గతంలో పంటను నేరుగా మార్కెట్ కమిటీ వద్దకు తీసుకువస్తే దానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకారం రైతు ఖాతాలోకి డబ్బు జమ అయ్యేది. అయితే రైతు ఇప్పుడు పంజాబ్లో పంట పండించి గోధుమలు బాగా డిమాండ్ ఉన్న అస్సాం ప్రాంతానికి వెళ్లి లేదా ఏదైనా కంపెనీతో జత కట్టి తన పంటను అమ్ముకునే సౌలభ్యం ఈ బిల్లు ద్వారా ఉన్నపుడు ఇంకా స్థానిక మార్కెట్ల కొనసాగింపు అనేది అర్ధం లేని వ్యవహారం అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

అయితే….

** దేశం మొత్తం మీద ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)ల్లో రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం పంట కొనుగోలు చేసేది సగటున 10 శాతం మాత్రమే… కానీ పంజాబ్‌లో ఇందుకు విరుద్ధంగా 90 శాతం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి. అక్కడి సారవంతమైన భూములలో పండిన పంటలో దాదాపు 90 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే బహిరంగ మార్కెట్లో ఈ రాష్ట్రాలకు చెందిన రైతులు అమ్మేది 10 శాతం మాత్రమే. మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరుగుతాయి. దీనివల్ల వారికీ పంట మీద పూర్తి భరోసా ఉంటుంది. ఏదైనా విపత్తులు వచ్చినా, పంటలో నష్టం వచ్చిన ప్రభుత్వం ఎదో ఒకటి చేసి ఆడుకుంటుంది అని ఎక్కువగా భావిస్తారు. నష్టపోయేందుకు రైతులు ఒప్పుకోరు.
** దేశం మొత్తంలో ఉన్న దాదాపు 6,000 ఏపిఎంసీలు ఉంటె 33 శాతం అంటే దాదాపు రెండువేల వరకు పంజాబీలోనే ఉన్నాయి. కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం పంజాబ్‌లోని రైతులు తమ మొత్తం పంటను బహిరంగ మార్కెట్లో, రాష్ట్రంలోని లేదా రాష్ట్రం బయట.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అయితే, ఏపీఎంసీ నుంచి బయటకి వెళిపోతే ప్రైవేటు వ్యాపారులు తమని దోచేసుకుంటారని సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటను అమ్ముకుంటేనే చిన్న రైతుకు భరోసా ఉంటుందని, వ్యవసాయం చేసేవారిలో 74 శాతం మంది నిరక్షరాస్యులు అని, వీరిని కార్పొరేట్ యాజమాన్యాలు మోసం చేస్తాయనేది వీరి ఆవేదన. దీని కారణంగానే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని రైతులు ఏపీఎంసీ బైపాస్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

రైతు ముందుకొస్తాడా

దేశంలో సగటు రైతు నెలవారీ ఆదాయం 6 , 500 . ఇందిరా గాంధీ తీసుకువచ్చిన జాతీయ భూ చట్టం తర్వాత చిన్న కమతాల రైతులే కనిపిస్తారు. దేశంలోని రైతుల్లో 86 శాతం మంది చిన్న కమతాల వారే. వీరికి బిల్లు వాళ్ళ తీరని నష్టం జరుగుతుంది అనే భావన అంతటా ఉంది. కార్పొరేట్ వ్యవస్థలు పల్లెల్లోకి రావడం వాళ్ళ కొత్త సమస్యలు వస్తాయి అనేది మరో భయం.
** కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతులకు పెద్ద దెబ్బ. ఈ పద్ధతిలో బహుళజాతి కంపెనీలు ఒక గ్రామంలో లేదా ఒక ప్రాంతంలో భూములన్నిటిని కాంట్రాక్ట్ కింద తీసుకోవచ్చు. అందులో ఏ పంటలు పండించాలనేది ఏకపక్షంగా నిర్ణయించవచ్చు. ఇదే జరిగితే రైతులు వెట్టి చాకిరీ కార్మికులు అవుతారనే భయం ఉంది.
** కేంద్రం దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కాంగ్రెస్ దీన్ని చేయిస్తుంది అనే కోణంలో కాకుండా రైతు దృష్టిలో చూసి చట్టంలో మార్పులు చేర్పులు చేయొచ్చు. రైతులు లేవదీస్తున్న అంశాలపై శాస్త్రీయ త చూసి వారి భయాలను తొలగిస్తేనే రైతుల ఆందోళన తగ్గుముఖం పడుతుంది. లేకుంటే ఏది దేశమంతటికి విస్తరిస్తే దీన్ని కంట్రోల్ చేయడం ఎవరి వాళ్ళ సాధ్యం కాదు అనేది బీజేపీ ప్రభుత్వ పెద్దలు గుర్తుఎరగాలి..

 

 

 

 

author avatar
Special Bureau

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N