Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. 2004లో బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన కాజల్.. లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది చందమామ మూవీతో తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హోదాను అందుకుంది. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన కూడా కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం కాజల్ చేతిలో సత్యబాబ, ఇండియన్ 2 మరియు ఉమా అనే మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో కథ నచ్చక లేదా డేట్స్ సర్దుబాటు కాక లేదా ఇతర కారణాల వల్ల కాజల్ ఎన్నో చిత్రాలను రిజెక్ట్ చేసింది. అయితే కాజల్ తెలుగులో వదులుకున్న చిత్రాల్లో మెజారిటీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది రెబెల్. టాలీవుడ్ లో ప్రభాస్, కాజల్ జంటగా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. కాజల్ ప్రభాస్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కోట్ అయింది.
ఈ నేపథ్యంలోనే రెబల్ మూవీలో ప్రభాస్ కు జోడిగా డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాజల్ ను సంప్రదించారు. కానీ అప్పటికే చేతినిండా సినిమాలు ఉండడంతో కాజల్ రెబెల్ ను రిజెక్ట్ చేసింది. దాంతో కాజల్ కు బదులుగా తమన్నాను తీసుకున్నారు. కట్ చేస్తే 2012లో విడుదలైన రెబల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే ప్రభాస్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ సాహో. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను అడగగా.. ఆమె నో చెప్పింది. దాంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేత స్పెషల్ సాంగ్ చేయించారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్ చిత్రంలో శ్రీయ పాత్ర కోసం మొదట కాజల్ ను అడిగారట. అయితే ఆ పాత్ర నచ్చకపోవడంతో కాజల్ రిజెక్ట్ చేసింది. 2017లో విడుదలైన పైసా వసూల్ సినిమా ఫ్లాప్ అయింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ కాజల్ అగర్వాల్. అయితే ఆమెకు స్టోరీ నచ్చకపోవడం వల్ల తిరస్కరించింది. టాలీవుడ్ లో కాజల్ వదులుకున్న మరొక అట్టర్ ఫ్లాప్ మూవీ ది ఘోస్ట్. నాగార్జున ఇందులో హీరో కాగా.. ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ గా వ్యవహరించారు. మొదట కాజల్ ను హీరోయిన్గా ఎంపిక చేసినప్పటికీ.. ఆ తర్వాత పర్సనల్ రిజల్ట్స్ వల్ల ఆమె ఈ సినిమా నుంచి వైదొలికింది. దాంతో కాజల్ స్థానంలో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు.