Vijay Deverakonda: అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత హిట్ ముఖమే చూడలేకపోయాడు. నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా వరుస చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటించాడు. కానీ ఈ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా 2022లో వచ్చిన లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన లైగర్ కోట్లలో నష్టాలను తీసుకొచ్చింది. గత ఏడాది ఖుషి మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా సమంత నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా యావరేజ్ గానే ఆడింది.
ఇక తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ తో వచ్చాడు. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ చిత్రం మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఫ్యామిలీ స్టార్ పై అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి.
తీరా చూస్తే సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం అభిమానులను కూడా మెప్పించలేకపోయింది. బలహీనమైన కథ, కథనం, పరశురామ్ టేకింగ్, పండని కామెడీ, వర్కోట్ కాని సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ స్టార్ మూవీకి పెద్ద మైనస్ అయ్యాయి. టాక్ అనుకూలంగా లేకపోవడంతో కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయమనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక వరుస పరాజయాల నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అటు తిరిగి ఇటు తిరిగి నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై పడుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాలం నుంచి లవ్ లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. డైరెక్ట్ గా చెప్పకపోయినా తమ రిలేషన్ పై విజయ్, రష్మిక ఎప్పటికప్పుడు హిట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే ప్రొఫెషన్ పరంగా వరుస విజయాలతో రష్మిక దూసుకుపోతోంది. కానీ విజయ్ ను మాత్రం ఫ్లాపుల రూపంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ పరాజయాలకు రష్మికనే కారణమంటూ తాజాగా రౌడీ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. రష్మిక విజయ్ కు ఏమాత్రం కలిసి రావడం లేదని.. విజయ్ కు రష్మిక అన్ లక్కీ అని సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు. రష్మిక ను వదిలేస్తేనే విజయ్ కెరీర్ ఊపందుకుంటుంది అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఫెయిల్యూర్స్ ను సంబంధమే లేని రష్మికపై రుద్దేస్తున్నారు.