Nagarjuna-NTR: సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా మల్టీస్టారర్ సినిమాలకు సక్సెస్ రేటు అనేది చాలా ఎక్కువ. అందుకే స్టార్ హీరోలైనా కూడా కథ నచ్చితే ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. టాలీవుడ్ లో చూసుకుంటే ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. మరెన్నో రాబోతున్నాయి. అలాగే కొన్ని క్రేజీ కాంబినేషన్లు అనుకోకుండా మిస్ కూడా అయ్యాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సైతం ఓ సూపర్ హిట్ మల్టీస్టార్ర్ మిస్ అయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు ఊపిరి.
వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అక్కినేని మన్మథుడు నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి హీరోలుగా నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. జయసుధ, ప్రకాష్ రాజ్, ఆలీ, తనికెళ్ల భరణి, కల్పన తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రియా శరన్, అనుష్క శెట్టి, అడివి శేష్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు. పివిపి సినిమా బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మించారు. 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ ది ఇంటచబుల్స్ కి ఊపిరి సినిమా రీమేక్. తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం 2016 మార్చి 25న విడుదలై మంచి విజయం సాధించింది.
రూ. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఊపిరి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 85 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కాళ్ళూ చేతులూ చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ కోటీశ్వరుడిగా నాగార్జున కనిపిస్తాడు. కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆ కోటీశ్వరుడి వద్ద పని చేసే యువకుడిగా కార్తి నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఊపిరి సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగార్జున-కార్తి యాక్టింగ్, తమన్నా గ్లామర్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే మరియు గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
టాక్ అనుకూలంగా ఉండటంతో ఊపిరి సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుని బిగ్ హిట్ గా నిలిచింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాలో కార్తి పోషించిన శ్రీను పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్. అసలు ఊపిరి కథ మొట్టమొదట ఎన్టీఆర్ వద్దకే వెళ్లింది. స్టోరీ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సూచన మేరకు వంశీ పైడిపల్లి నాగార్జున వద్దకు వెళ్లి స్క్రిప్ట్‌ను వివరించగా.. ఆయనకు కూడా బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే కాస్టింగ్, పోస్ట్ ప్రొడెక్షన్ పనులు కంప్లీట్ అయ్యి షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో నాన్నకు ప్రేమతో మూవీ చేస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్.. డేట్స్ సద్దుబాటు చేయలేక ఊపిరి ప్రాజెక్ట్ నుంచి తప్పని పరిస్థితుల్లో తప్పకున్నాడు. దాంతో ఎన్టీఆర్ ప్లేస్ లో కార్తిని దింపారు. తెలుగులో కార్తి చేసిన తొలి చిత్రం ఇదే. ఊపిరి మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో కార్తి భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కార్తి నటించే ప్రతి తమిళ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టారు.