Mohanlal: ప్రముఖ స్టార్ హీరో మోహన్ లాల్ ను సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ హీరో అయినప్పటికీ మోహన్ లాల్ ఇండియా వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. 1980లో మంజిల్ విరింజ పూక్కల్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఫాజిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా మోహన్ లాల్ నటించి మెప్పించారు.
మంజిల్ విరింజ పూక్కల్ మంచి విజయం సాధించడంతో మోహన్ లాల్ కు ప్రతినాయకుడి పాత్రలు క్యూ కట్టాయి. అలా 1983 నాటికి మోహన్‌లాల్ 25 కంటే ఎక్కువ చిత్రాల్లో విలన్ వేషాలు వేశారు. 1984లో వచ్చిన ఇక్కడే తుడంగున్ను మూవీ ద్వారా మోహన్ లాల్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 300కు పైగా చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు మలయాళం లోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా ఆయన పని చేశారు.
దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సహజమైన నటనా శైలితో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే మూడు నిర్మాణ సంస్థలు స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. మలయాళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేసి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. అంతేకాకుండా వ్యాపార రంగంలోనూ కింగ్ గా చక్రం తిప్పుతున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మోహన్ లాల్ కు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇతర ఫుడ్ బిజినెస్‌లను ఆయన రన్ చేస్తున్నారు.
మోహల్ లాల్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. మోహన్‌లాల్ తమిళ చిత్ర నిర్మాత కె. బాలాజీ కుమార్తె సుచిత్రను 1988లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ కాగా.. కుమార్తె విస్మయ మోహన్‌లాల్. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హృదయం లో నటించిన హీరో అరుణ్ మరెవరో కాదు ప్రణవ్ మోహన్‌లాలే. తండ్రి బాటలోనే ప్రణవ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి.. ఇప్పుడు హీరోగా సత్తా చాటేందుకు ప్రణవ్ కష్టపడుతున్నారు.
ఇక మోహన్ లాల్ కూతురు విస్మయ మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ అంటే ఆమెకు అమితమైన ఇష్టం. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో విస్మయకు 162 కె ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా విస్మయ తన బర్త్‌డే ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే `నా ప్రిన్సెస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ప్రేమ, ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ నాన్న` అంటూ మోహన్ లాల్ కూతురు ఫోటోను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో విస్మయను చూసి సినీ ప్రియులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. మోహల్ లాల్ కు ఇంత అందమైన కూతురు ఉందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. విస్మయ అందం ముందు హీరోయిన్లు కూడా సరిపోరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!