NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Game Changer Song Response: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమా నీ 5 నెలలుగా వురిస్తూ వచ్చిన జరగండి మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. ఇక తొలి 24 గంటల్లోనే మేకర్స్ ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్నారు. గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ ఫాన్స్ ఎప్పటినుంచో 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తుండడంతో వాళ్ల సహనం కోల్పోయారు. చివరికి మూవీ నుంచి ఒక పాట రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ కు 5 నెలల సమయం పట్టింది. గత ఏడాది దీపావళి సందర్భంగా వస్తుందనుకున్న పాట చెర్రీ బర్తడే కి రావడంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. ఇక ఎంతో ఊరించిన ఈ పాట చివరికి తుస్సు మనిపించింది.

Game Changer Song Response
Game Changer Song Response

తమన్ రొటీన్ మ్యూజిక్ ఈ మూవీలో కూడా కామన్ గా కనిపించింది. ఈ పాటకు శంకర్ అండ్ టీం పెట్టిన బడ్జెట్ కు తగిన న్యాయం చేయలేకపోయాడని చెప్పొచ్చు. ప్రభుదేవా మరియు ఇతర కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ మరియు కియారా స్టెప్స్ కూడా సో సో గానే అనిపించాయి. ఓవరాల్ గా ఈ పాట ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ పాటకు తొలి 24 గంటల్లోనే వచ్చిన యూస్ తోనే అర్థమయిపోయింది ఈ విషయం. బుధవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ అయిన ఈ పాటకు గురువారం ఉదయానికి వచ్చిన యూస్ 4.5 మిలియన్లు మాత్రమే. రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ కి యూస్ కి ఏమాత్రం సాపత్యం లేదు. గతంలో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన చరణ్ ప్రస్తుతం ఈ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటే తన ఫాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతారో అనేది కూడా ఆలోచించ లేకపోయారు.

ఇక ఈ పాటకి తెలుగులో రెస్పాన్స్ పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక హిందీ మరియు తమిళంలో అయితే మరీ ఘోరాతి ఘోరంగా ఈ పాటకు రెస్పాన్స్ దక్కింది. ఒక దాంట్లో మూడు లక్షలు మరొక దాంట్లో ఐదు లక్షల యూస్ తో సరి పెట్టేసింది ఈ మూవీ సాంగ్. ఇది నిజంగా చరణ్ కెరీర్ లోనే బిగ్ అపజయం అని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా చరణ్ సినిమాకి ఈ విధమైన రెస్పాన్స్ రావడం. ఇన్నాళ్లు శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా ప్రధానంగా ఉండేది. కానీ గేమ్ చేంజర్ కి మాత్రం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టకుండా తమల్ని ఎంచుకున్నాడు శంకర్. దీంతో ఈ సినిమా సాంగ్ బోల్తా పడింది.

Game Changer Song Response
Game Changer Song Response

ఈ మధ్యకాలంలో ప్రతి పెద్ద సినిమాకి కూడా ఎక్కువగా తమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. మొదట్లో తమన్ కి చాలా రేర్ గా అవకాశాలు వెళ్లేవి. అలా వచ్చిన అవకాశాలను మరింత పెంచుకునేందుకు పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పొలో అంటూ మేకల మందు లాగా వెళ్లిపోవడంతో తాను కూడా ఏదో ఇచ్చాములే అన్నట్లు మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్ అయిన గుంటూరు కారం దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ కాబోయే గేమ్ చేంజర్ వరకు తమన్ మ్యూజిక్ చాలా వరస్ట్ గా అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తమన్ పైనే ధ్యాస పెడుతున్నారు. ఇంకే మ్యూజిక్ డైరెక్టర్స్ లేనట్లు తమన్ పైనే అందరూ పడుతున్నారు. దీంతో తమన్ సైతం ఏదో ఒక మ్యూజిక్ ఇచ్చి పడేస్తూ తమ ఫ్యాన్స్ కి మండిస్తున్నాడు. ఇక తాజాగా ఇదే క్రమంలో చరణ్ ఫాన్స్ కి సైతం గట్టిగానే మండించాడు. వేరే లెవల్లో హైబ్స్ తీసుకెళ్లి నిరాశలు మిగిల్చాడు. ఏదేమైనా ఇది చరణ్ కెరీర్ లోనే పెద్ద మచ్చగా మిగులుతుందని చెప్పుకోవచ్చు.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri