Siren OTT Details: కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈయన నటించిన మూవీ ” సైరన్ “. మహానటి ద్వారా జూనియర్ సావిత్రిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ సైతం మనందరికీ సుపరిచితమే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ సైతం మెయిన్ ఫిమేల్ లీడ్రోలో పోషించింది. అదేవిధంగా ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటించింది. ఆమే అనుపమ. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీతో సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో నటించిన సంగతి చాలా తక్కువ మందికి గుర్తుంది. తన హాట్ హాట్ ఫోసులను టిల్లు మూవీ లో వలకబోసింది అనుపమ. ఇక ప్రస్తుతం అనుపమ కి వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు.
వరుస పెట్టి ఈగల్, టిల్లు స్క్వేర్, సైరన్ వంటి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక అనుపమ కూడా సైరన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. గతంలో అభిమన్యుడు, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోనీ భరద్వాజ్ తొలిసారి మెగా ఫోన్ పట్టి సైరన్ మూవీ ను రూపొందించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సంపాదించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సైతం రాబట్టింది. వారం రోజుల గ్యాప్ లో తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయింది. అలా తెలుగులో సైతం పాజిటివ్ టాక్ దక్కించుకుంది ఈ మూవీ. ఇక థియేటర్లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సైరన్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీ లో సైరన్ మూవీ ను స్ట్రీమింగ్ చేయనున్నారట. తమిళ్ తో పాటు తెలుగులోనూ సైరన్ స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లుడు కానుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి తెరకెక్కించిన సైరన్ మూవీ లో భారీ తారాగణం ఉంది. సముద్రఖనీ, యోగి బాబు, విజయ్ యువినా తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు వహించారు.
జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చగా సామ్ పిఎస్ బాడ్ డ్రాప్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. తన భర్త మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ తో పాటు రాజకీయ నాయకులపై సాధారణ అంబులెన్స్ డ్రైవర్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. మొత్తానికి అయితే 2024లో భారీ విజయాన్ని సంపాదించుకున్నారు ఈ మూవీ టీం. ఇక ఈ సినిమాలో ఒకపక్క కీర్తి సురేష్ మరియు మరో పక్క అనుపమ కూడా ఉండడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. అలా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి ఓటిటిలో ఈ మూవీ ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!