Joshua OTT Release: కొందరు డైరెక్షన్లో ఒక్కోసారి విఫలమవుతూ ఉంటారు. మరికొన్ని సమయాలలో సక్సెస్ అవుతూ కూడా ఉంటారు. అలా ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ మీనన్ బ్యాడ్ టైం నడుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం వరుస అట్టర్ ప్లాప్ లను వెలుగు చూస్తున్నాడు. ఘర్షణ, ఏ మాయ చేసావే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వంటి విజయవంతమైన సినిమాల తో సక్సెస్ అయిన ఈయన బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. 2015లో రిలీజ్ అయిన అజిత్ ఎన్నై అరిందాల్ అనంతరం గౌతమ్ మీనన్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తరువాత అతడు చేసిన సినిమాలేవి బాక్స్ ఆఫీస్ లో పెద్దగా నిలవలేకపోయాయి.
విక్రమ్‌తో అతడు చేసిన ధృవనక్షత్రం షూటింగ్ పూర్తయి ఐదేళ్లు గడిచిన ఇప్పటికి రిలీజ్ కు నోచుకోలేదు. తాజాగా అతడు దర్శకత్వం వహించిన తమిళ్ లో బడ్జెట్ మూవీ జాషువా కూడా డిజాస్టర్ అయింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మార్చ్ ఒకటిన థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీలో వరుణ్ మరియు రాహి హీరో, హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ సీక్వెళ్ళు బాగున్నా కథా, నటనలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేక పోయింది. ఇక థియేటర్లో రిలీజ్ అయ్యి నెల కూడా గడవక ముందే ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. గురువారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జాషువా ఓ కాంట్రాక్ట్ కిల్లర్. కుందవి అనే ఎన్ఆర్ఐ లాయర్ కు బాడీగార్డ్ గా పనిచేసే డీన్ ను కుదుర్చుకుంటాడు జాషువా. మెక్సికెన్ డ్రగ్ గ్యాంగ్ కుందనిని టార్గెట్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారీ నుంచి కుంతవీని జాషువా ఎలా కాపాడతాడు? జాషువాకు కుందికి ఇదివరకే పరిచయం ఉందా? అనే సంఘటనల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. నిజానికి ఈ మూవీని 2019లోనే అనౌన్స్ చేశాడు గౌతమ్. ఇక అనంతరం కోవిడ్ తో పాటు ఇతర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇక అన్ని అడ్డంకులు తప్పించుకుని మార్చి 1న ఈ మూవీ రిలీజ్ అయింది.
కానీ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ డిజాస్టర్ మూవీ కాస్త ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. మరి ఈ మూవీ ఓటిటిలో ఆయిన రెస్పాన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఓటిటిలో కూడా ఈ మూవీ మంచు రెస్పాన్స్ దక్కించుకోకపోతే గౌతమ్ మీనన్ కొంతకాలం పాటు డైరెక్షన్ కి గ్యాప్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు. వరుస డిజాస్టర్ లతో ఉన్న ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరోలు కూడా ఇష్టపడడం లేదు. కనుక కొంతకాలం గ్యాప్ ఇచ్చి మంచి కథను రూపొందించి సూపర్ హిట్ విజయం కొడితే మరోసారి ఫామ్ లోకి వస్తాడు గౌతమ్ మీనన్.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!