Alia Bhatt: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయంకృషి, సొంత ప్రతిభతో అలియా భట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా అలియా సౌత్ సినీ ప్రియులకు కూడా చేరువైంది. ఈ చిత్రంలో సీతగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న అలియా భట్ బర్త్‌డే నేడు.
దీంతో సినీ ప్రియులు, అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అలియా భట్ కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు పుట్టినరోజు సందర్భంగా.. అలియా భట్ ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి. ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లో అలియా భట్ ఒకరు. గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాల ద్వారా అలియా భట్ ఒక్కో చిత్రానికి రూ. 20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది.
అలాగే అనేక ప్రముఖ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.లేస్, ఫ్రూటీ, డ్యూరోఫ్లెక్స్, మాన్యవర్, మేక్ మై ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ వంటి టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ప్రతి ఏడాది కోట్లు సంపాదిస్తోంది. ఎడ్-ఎ-మమ్మను అనే దుస్తుల బ్రాండ్ ను రన్ చేస్తోంది. అలియా భట్‌కు సొంత ప్రొడెక్షన్ హౌస్ ఉంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియా బాంద్రాలో అలియా భట్ పేరిత ఓ లగ్జరీ హౌస్ ఉంది.
అలాగే లండర్ లోనూ ఈ బ్యూటీ సొంత ఇంటిని కలిగి ఉంది. రేంజ్ రోవర్ వోగ్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ వంటి లగ్జరీ కార్లు అలియా గ్యారేజ్ లో ఉన్నాయి. ఇక పలు నివేదికల ప్రకారం.. భర్త రణబీర్ కపూర్ కన్నా అలియా భట్ ఆస్తులే ఎక్కువని తెలుస్తోంది. అలియా భట్ నికర విలువ రూ. 520 కోట్లు కాగా.. రణబీర్ కపూర్ రూ. 365 కోట్లు ఉంటుందని అంటున్నారు. వీరిద్దరి ఆస్తులు కలిపితే రూ. 885 కోట్లు. కాగా, 2022లో అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం చేసుకున్నారు. 2023లో ఈ దంపతులకు రాహ అనే కుమార్తె జన్మించింది.