Ennenno Janmala Bandham ఆగస్టు 17 ఎపిసోడ్ 479: యష్ జైల్లో కూర్చుని ఇదంతా ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మాళవిక బయటికి వెళ్లి వస్తుంది ఎక్కడికి వెళ్లావు అని అభి అంటాడు. ఏంటి బయటికి వెళ్లొద్దా నీ బెదిరింపులు ఏంటి నువ్వేమన్నా నన్ను కొన్నావా బాండ్ పేపర్ మీద రాసుకున్నామా ఏంటి అని మాళవిక అంటుంది. కొన్నట్టే ఎందుకంటే నిన్ను కూర్చోబెట్టి మేపుతున్నాను నీకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాను అంతకుమించి చచ్చే నీకు జీవితాన్ని ఇచ్చాను అని అభి అంటాడు.

ఎవరికోసం నా కోసమా యశ్ మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను పాముల వాడుకుంటున్నావు నేను దొరికిపోతే నాకు కొత్తగా వచ్చే చావేమి లేదు నీకే చావు ముంచుకొస్తుంది సో నువ్వు నన్ను బెదిరించడం కాదు నువ్వు నాకు లొంగి ఉండడం నేర్చుకో అని మాళవిక అంటుంది. నేను నీకు లొంగి ఉండాలా అని అభిమన్యు అంటాడు. తప్పదు అభిమన్యు అని మాళవిక అంటుంది. ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి అమ్మో బ్రతికుండే చచ్చినట్టు నాటకం ఆడుతున్నారా జగన్నాటకం అంటే ఇదేనా అని కైలాష్ అంటాడు. కైలాష్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అభిమన్యు అంటాడు.

మీ మంచి కోసమే నేమో సమయం వస్తే నారదుడు ఎంటర్ అవుతాడు చూడు అలాగే అర్థమైంది నాకు బాగా అర్థమైంది మీలో మీరు ఆడుకుంటే నష్టం మీ ఇద్దరికే సో మీ ఇద్దరు మంచిగా ఉండి చేయి చేయి కలుపుకోండి అని కైలాష్ అంటాడు. కట్ చేస్తే అమ్మవారి గుడిలో వేద దీపాలను వెలిగిస్తుంది. ఆ గుడిలోకి మాళవికి ఒక నలుగురిని తీసుకుని వచ్చి వేదని చంపడానికి పెడుతుంది ఆ నలుగురిలో ఒక ఆవిడ వేదని చంపడానికి వేద దగ్గరికి వెళ్తుండగా ఆ గుడిలో ఒక అబ్బాయి ఆమెను గుద్దితే కత్తి కింద పడిపోతుంది ఆ కత్తి తీసుకుందామని ఆవిడ కిందికి వంగింది అది చూసిన వేద ఆవిడని లేపి ఆ కత్తి తీసి ఇచ్చి ఆవిడని పంపించేస్తుంది కానీ ఇంతలో ఆ నలుగురు వేదని చుట్టుముట్టి వేదని చంపడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తారు వారి నుంచి వేద తప్పించుకుంటుంది వాళ్ళు వేదని చంపడం వీలు కాదు అని భయపడి అక్కడ నుండి పారిపోతారు.

కట్ చేస్తే ఖుషి వచ్చి అమ్మ ఎందుకమ్మా నువ్వు కింద పడుకుంటున్నావు అని అడిగింది. ఎందుకో మంచం మీద పడుకోవాలి అనిపించట్లేదు అని వేద అంటుంది. ఓ డాడీ లేడనా అని ఖుషి అడిగింది. అవునమ్మా డాడీ అక్కడ కింద పడుకుంటున్నాడు అందుకే నేను కూడా కింద పడుకుంటున్నాను అని వేద అంటుంది. అయితే నేను కూడా నీ దగ్గరే పడుకుంటాను అని అంటుంది ఖుషి. సరే రా పడుకో అని ఖుషి ని పడుకోబెడుతుంది వేద. అమ్మ డాడీ కి ఫోన్ చెయ్ అమ్మ అక్కడ దోమలు ఉంటాయేమో దోమలు కుడితే ప్రమాదం అని ఖుషి అంటుంది. సరే అమ్మ నువ్వు ఇలా చెప్పావని నేను చెప్తాను నువ్వు ఇప్పుడు పడుకో అమ్మ చాలా లేట్ అయింది అని వేద ఖుషిని పడుకోబెట్టి వేద ఆలోచిస్తూ ఏడుస్తూ ఆ రాత్రంతా అలాగే ఉండిపోతుంది. కట్ చేస్తే కానిస్టేబుల్ తాళం తీసి బయలుదేరుదామా బాబు అని అంటాడు. సరే అని యష్ అంటాడు. మొదటిసారి ఈ గోడలు ప్రాణం పోసుకున్నాయి నీకు న్యాయమే జరగాలని అనుకుంటున్నాయి నీకు న్యాయమే జరుగుతుంది పదా బాబు అని కానిస్టేబుల్ యష్ ని తీసుకొ ని వెళ్ళిపోతాడు.

ఏంటి భయం వేస్తుందా అని యష్ ని ఏసీపీ అడుగుతుంది. మేడం ఒక డౌటు బైబిల్ ఖురాన్ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన గ్రంధాలు వయస్సు ఎంత ఇవన్నీ భూమి పుట్టినంత వయస్సు కానీ మనిషి వాటి ఆచారాలు సాంప్రదాయాలు వదిలేయట్లేదు కదా ఎందుకంటే ప్రజలందరి ప్రయోజనమే వాటి లక్ష్యం కాబట్టి వాటి మీద నమ్మకం లేకపోతే మన మీద మనకే నమ్మకం లేనట్టు మేడం అని యాష్ అంటాడు. ఒకవేళ అన్యాయమే గెలిస్తే ఏం చేస్తావు అని ఏసీపీ అంటుంది. మీరు చూస్తూ ఊరుకోగలరా తీర్పు చెప్పే న్యాయమూర్తి కూడా అన్యాయాన్ని న్యాయమని అనలేడు మేడం అని యష్ అంటాడు.

ఉరికంభం ఎక్కాల్సి వచ్చిన చట్టాన్ని నిలదీస్తున్నావా అని ఏసీపీ అంటుంది.మేడం చట్టాన్ని ఉరి తీయగలరా ఎవరైనా అని యష్ అంటారు. కట్ చేస్తే బావగారు యష్ అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో మనం వెళ్దామా అని అంటాడు సులోచన వాళ్ళ ఆయన. అందరూ కోర్టుకు బయలుదేరుతారు కానీ ఖుషి మాత్రం అక్కడ ఒంటరిగా కూర్చుంటుంది.ఏంటి ఖుషి ఒంటరిగా కూర్చుంది అని వేద ఖుషి దగ్గరికి వస్తుంది ఖుషి ఏంటి డల్ గా ఉన్నావ్ అని వేద అడిగింది. డాడీ నన్ను బయటికి తీసుకెళ్తాను అన్నారు కానీ రెండు రోజులుగా ఇంటికి రావడం లేదు డాడీ ఎక్కడికి వెళ్లారు అని నేను అడిగితే ఎవరూ సమాధానం చెప్పట్లేదు అని ఖుషి అంటుంది. నీకు చెప్పిన అర్థం కాదు ఖుషి డాడీ కొంచెం బిజీగా ఉన్నారు ఈరోజు ఈవినింగ్ డాడిని తప్పకుండా తీసుకొస్తాను సరేనా అని వేద అంటుంది.

నిజంగా తీసుకొస్తావా అమ్మ డాడీ ని చూడాలని ఉంది డాడీ నన్ను చూడకుండా ఎలా ఉన్నారు అని ఖుషి అంటుంది. మరి అదేం లేదు డాడీ ఎంత బిజీగా ఉన్నా ఈరోజు నేను ఈవినింగ్ తీసుకొని వస్తాను సరేనా అని వేద అంటుంది. మా అమ్మ చెబితే నిజంగానే చేస్తుంది అయితే రేపు నన్ను అన్నయ్యను బయటికి తీసుకెళ్తారు బలే బలే అని ఖుషి సంతోషపడుతుంది. సరే ఖుషి తల్లి నువ్వు వెళ్లి అన్నయ్యతో ఆడుకో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని వేద అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం.