NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Chandrayaan -3: చంద్రయాన్ – 3 లో కీలక ఘట్టం పూర్తి .. విడిపోయిన ల్యాండర్ ‘విక్రమ్’

Advertisements
Share

Chandrayaan -3: జాబిల్లిపై అడుగు పెట్టడమే లక్ష్యంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్ – 3 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. గురువారం ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. ఈ రోజు నుండి ల్యాండర్ విక్రమ్ చంద్రుడి చుట్టూ పరిభ్రమించనుంది. ఈ నెల 23న చంద్రుడి దక్షిణ దృవం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన విషయాన్ని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా విడిపోయిన తర్వాత ల్యాండ్ మాడ్యూల్ పంపిన సందేశాన్ని బెంగళూరులోని ఐఎస్టీఆర్సీ కేంద్రం అందుకుంది. “థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మేసేజ్ పంపినట్లు ఇస్రో ట్విట్టర్ లో ప్రకటించింది. ఎల్ఎం (ల్యాండర్ మాడ్యూల్) విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుండి వేరుపడిందని.. రేపు నిర్వహించే డిబూస్టింగ్ తర్వాత .. ల్యాండర్ మాడ్యూల్ మెల్లగా లోవర్ అర్బిట్ లోకి వెళ్తుందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డిబూస్టింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.

Advertisements

 

ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడిపోయిన తర్వాత లాండర్ ను డిబూస్ట్ (వేగాన్నితగ్గించే ప్రక్రియ) చేయనున్నారు. పెరిలున్ (చంద్రుడికి అత్యంత దగ్గరి ప్రదేశం)కు 30 కిలో మీటర్లు, అపోలూన్ (చంద్రుడికి దూరంగా ఉన్నప్రదేశం)కు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్షలో ల్యాండర్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్బిట్ లోకి ల్యాండర్ చేరుకున్న తర్వాత 23వ తేదీన సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించనున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన వెంటనే ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోను ల్యాండర్ తీయనుంది. రోవర్ తన పరిశోధన ప్రారంభిస్తుంది. చంద్రుడిపై దిగే ముందు లాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ నిట్ట నిలువుగా చంద్రుడు ఉపరితంపై దింపడమే చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ. దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తూ గమనాన్ని మారుస్తూ నిట్ట నిలువుగా చంద్రుడిపైకి దింపే దశ అత్యంత క్లిష్టమైనదిగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాధ్ ఇప్పటికే తెలిపారు.

Advertisements

చంద్రయాన్ – 3 ని జూలై 14న ఎల్వీఎం -3 – ఎం 4 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తొలి సారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదు సార్లు కక్షను పొడిగించారు. 5వ భూకక్ష్య పూర్తయిన తర్వాత .. జాబిల్లి దిశగా ప్రయాణానికి గానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుండి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు. బుధవారమే చంద్రయాన్ 3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించగా.. నేడు ప్రొపల్షన్ నుండి ల్యాండర్ విడిపోయింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.

Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద హైటెన్షన్ .. పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలు


Share
Advertisements

Related posts

విభజన చట్టం: టీడీపీ వాదనలో వైకాపా కౌంటర్ ఇదేనా?

CMR

Daily Horoscope ఆగష్టు 23rd ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

AP Esma Act: ఉద్యోగుల సమ్మె నిర్ణయానికి ప్రభుత్వ విరుగుడు ఇదే..? నేటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం..??

somaraju sharma