NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద హైటెన్షన్ .. పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలు

Advertisements
Share

Gangavaram Port: విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఆదాని గంగవరం పోర్టులో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనీ, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నేతలు పోర్టుకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోర్టుకు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.

Advertisements

 

పోర్టు ప్రధాన ద్వారానికి వంద మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటుకుని తమ కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. తోపులాటలో గాజువాక సీఐ కాలికి ముల్ల కంచె దిగగా, పది మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకి తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisements

Tirumala: బోనులో మరో చిరుత చిక్కింది


Share
Advertisements

Related posts

YS Viveka case: అవినాష్ రెడ్డికి మరో సారి నోటీసులు ఇచ్చిన సీబీఐ .. ఈ సారి తప్పక హాజరుకావాలంటూ..

somaraju sharma

Bale Leaves: అసిడిటీ నుంచి డయాబెటీస్ వరకు ఈ ఆకుతో చెక్..!

bharani jella

Pawan Kalyan: రేపు తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పర్యటన సాగెదిలా..

somaraju sharma