Sivakarthikeyan: మన సినిమా ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా సినిమాలు చేస్తేనే పాపులారిటీ దక్కుతుంది అని అనుకోవడం చాలా మూఢనమ్మకం. తాము నటించే పాత్రకి ఫుల్ ప్రెజెంట్ న్యాయం చేయడం ద్వారా వారి కి వారి పాత్రకి ఎంతో ప్రాధాన్యత దక్కుతుంది. అదేవిధంగా చేసింది చిన్న సినిమా అయినప్పటికీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు అయితే సూపర్ పాపులారిటీ దక్కుతుంది అని చెప్పొచ్చు. ఇక ఇలా చిన్నచిన్న సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో Sivakarthikeyan ఒకరు.
రేమో వంటి అద్భుతమైన సినిమాలను టాలీవుడ్ కి అందించిన ఈయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక నేడు శివ కార్తికేయన్ పుట్టినరోజు. 1985 ఫిబ్రవరి 17న జన్మించారు శివ కార్తికేయన్. ఇక శివ కార్తికేయన్ చదువుతున్న సమయంలోనే స్టాండర్డ్ కామెడీ మరియు ఇతర రంగాల్లో పాల్గొనేవాడు. ఇక అలా కొన్ని స్టాండర్డ్ కమెడియన్ షో చేస్తున్న సమయంలో డైరెక్టర్ అట్లీ మరియు శివ కార్తికేయన్ మంచి స్నేహితులు అయ్యారు. ఇక అట్లీ తీసిన షార్ట్ ఫిలిమ్స్ లో శివ కార్తికేయన్ని హీరోగా పెట్టాడు.
ఇక అనంతరం మెరీనా సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక అనంతరం త్రీ మూవీలో ధనుష్ పక్కన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. అదేవిధంగా వీరిద్దరి కాంబినేషన్ అంటే ఈతరం వారికి కూడా ఫేవరెట్ గా నిలిచింది. ఇక 2017లో సొంతంగా ఎస్.కె ప్రొడక్షన్స్ ని స్థాపించి ఓ సినిమాని నిర్మించారు. అదేవిధంగా అనంతరం కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాలో సైతం నటించాడు.
ఇక ఇటీవల రిలీజ్ అయిన డాక్టర్ మూవీ తో 100 కోట్ల క్లబ్లో చేరాడు శివ కార్తికేయన్. ఇక శివ కార్తికేయన్ నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ కథ పరంగా అయితే ఎక్కడ ఫీల్ కాడు. కథల ఎంపికలో చాలా స్టిట్ గా ఉంటాడు శివ కార్తికేయన్. ఇక ఈయన ఒక్క హీరో గానే కాదు నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేశాడు. ఇక నేడు శివ కార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సెలబ్రిటీలు ఈయనకి విషెస్ తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా ఎదిగిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.