NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

Krishna Mukunda Murari May 4 Episode 462

Krishna Mukunda Murari: కృష్ణ ప్రెగ్నెంట్ అనుకొని, భవానీ దేవి కృష్ణ కి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది నేను డాక్టర్ని అత్తయ్య చిన్న చిన్న పని చేసుకోవడంలో తప్పేముండదు అని అంటే నువ్వు డాక్టర్ అయితే అవ్వచ్చు నా కోడలు మాత్రం ఈ టైంలో అసలు పని చేయడానికి నేను ఒప్పుకోను మీరు నన్ను చాదస్తం అనుకోండి ఏదైనా అనుకోండి కానీ నువ్వు మాత్రం పని చేయడానికి వీలు లేదు కృష్ణ ముగ్గు నువ్వు వెయ్యడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. ఒక చిన్న పనే కదా పెద్దమ్మ చెయ్యనివ్వండి అని అంటాడు మురారి నీ భార్యని ప్రెగ్నెంట్ గా ఉంటే కష్టపెట్టడం నీకు ఎలా అనిపిస్తుందో కానీ నేనైతే మాత్రం చూస్తూ ఊరుకోలేను మురారి అని, నువ్వే పని చేయడానికి వీలు లేదు తినడం నిద్రపోవడం రెస్ట్ తీసుకోవడం మాత్రమే నీ పని అది కూడా పైన రూమ్లో కాదు కిందకు వచ్చేసేసి కింద రూమ్ లో ఉండండి అని చెప్తుంది దాంతో భవానీ దేవి చూపిస్తున్న ప్రేమకి కృష్ణ హ్యాపీ గా ఫీల్ అవుతుంది. ఇక భవానీ దేవి ముకుంద కి ఈరోజు ముగ్గు నువ్వే ఈ కృష్ణ చేతిలో ఉన్న గిన్నెను తీసుకొని ముకుంద చేతిలో పెడుతుంది. దాంతో ముకుందా ఈవిడ నిజంగానే ప్రెగ్నెంట్ అయినట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నారో వీళ్ళు ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే పరిస్థితి ఏంటో అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

ఇక ముకుందా ముగ్గు వేయడానికి బయటకు వెళ్తుంటే ఆదర్శ్ పిలుస్తాడు ఈయనకు అసలే నాకు చిరాగ్గా ఉందనుకుంటే ఈయన సోది వినాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది. చెప్పండి ఆదర్శ అని అంటుంది ముకుంద ఏం లేదు ఈవినింగ్ నువ్వు ఖాళీగానే ఉంటావా అని అడుగుతాడు ఇప్పుడు ఖాళీగా ఉన్నానంటే సోది వినమని చెప్తాడేమో అని మనసులో అనుకొని దేనికి అని అడుగుతుంది. సాయంత్రం మనం షాపింగ్ కి వెళ్దాం అని అంటాడు ఈయనకి బట్టలు నేను సెలెక్ట్ చేయాలా అని మనసులో అనుకొని, నాకు పెద్దగా బట్టలు సెలెక్ట్ చేయడం రాదు నాకు మగవాళ్లకు సెలక్ట్ చేయడం అసలే రాదు అని అంటుంది. నాకు కాదు ముకుందా నీకోసమే అని అంటాడు ఆదర్శ. నీకు మా అమ్మ కనిపించిన బట్టలే కానీ తర్వాత నువ్వంటూ బట్టలు కొనుక్కోలేదు కదా అవే బట్టలు మార్చి మార్చి వేసుకుంటున్నావు ఇంట్లో అందరూ కట్టించరు కట్టకుండా కడుతున్నారు. అలాంటిది నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అందుకోసమే నీకు బట్టలు కనిపెడదాం అనుకుంటున్నాను అని అంటాడు దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా జీవితంలో మురారి అనే వాడు లేకపోయి ఉన్నట్టు అయితే కచ్చితంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండే దాన్ని అని అనుకుంటుంది. ఏంటి ముకుందా షాపింగ్ కి వెళ్దామంటే ఏం మాట్లాడట్లేదు అని అంటే షాపింగ్ కి ఇప్పుడు ఎందుకు లేండి డబ్బులు దండగ అని అంటుంది. అవును మనం కోటి రూపాయలు పెట్టి చీర కొంటున్నామని అని నవ్వి ఆదర్శ్, మరేం పర్లేదు ముకుందా నీకు బట్టలు కొని పెట్టాలని నేను అనుకున్నాను నువ్వు వస్తున్నావు అంతే అని అంటాడు సరే ఆదర్శ గారు వెళ్దాం లేండి అని అంటుంది ఇక అదంతా కూడా భవాని దేవి వింటుంది ఆదర్శ ఆల్రెడీ ముకుందని ఇష్టపడుతున్న విషయం భవానికి తెలుసు దాంతో ఇప్పుడు ముకుంద కూడా షాపింగ్ కి వస్తానని చెప్పడంతో తన కి కూడా ఆదర్శ్ అంటే ఇష్టమని భవాని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

ఇక మరోవైపు కృష్ణ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వైదేహి కాల్ చేసి మీకు సరోగసి మదర్ దొరికేసింది మీరు హాస్పిటల్ కి వస్తే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేదురుగాని అని అంటుంది. ఒకసారిగా ఆ మాటకి కృష్ణ ఆనందంతో అవునా అని మీరు చెప్పేది నిజమేనా అని అంటే అవును మీకు సరోగసి మీద దొరికేసింది అని అంటుంది. సరే ఇప్పుడే హాస్పిటల్ కి వచ్చేస్తున్నామని ఫోన్ పెట్టేస్తుంది దాంతో కృష్ణ ఆనందంతో ఏసిపి సార్ అని గట్టిగా పిలుస్తుంది అప్పుడే అక్కడికి భవానీ దేవి వస్తుంది. ఏంటి తింగరి ఏం చేస్తున్నావు నీకోసం పాలు తీసుకొని వచ్చాను అని అంటుంది మీరు ఎందుకు అత్తయ్య పాలు తీసుకురావడం, చెప్తే నేనే వస్తాను కదా అని అంటుంది. నువ్వొస్తావని తెలిసే నేనే వచ్చాను అని అంటుంది కుంకుమపువ్వు కలిపిన పాలు తాగు పండంటి బిడ్డ పుడతాడు అని అంటుంది. మేము హాస్పిటల్ కి వెళ్లి వస్తాము అని అంటుంది హాస్పిటల్ కి దేనికి అని అంటుంది ఏం లేదు అత్తయ్య జనరల్ టెస్టులు ఉంటాయి కదా అవి చేయించుకుని వస్తాము అని అంటుంది అయితే నేను కూడా వస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అని అంటుంది దాంతో ఏం చెప్పాలో తెలియక, కృష్ణ అదికాదు అత్తయ్య మీరు ఎందుకు మేం వెళ్లి వస్తాం లేండి నాతోపాటు ఏసీబీ సార్ వస్తారు కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి మురారి వస్తాడు ఏంటి అని అడుగుతాడు హాస్పిటల్ కి వెళుతుందట కృష్ణ తోడుగా నేను వస్తానంటే వద్దంటుందిరా అని అంటే వెంటనే మురారి కూడా షాక్ అవుతాడు ఇప్పుడు హాస్పిటల్కి వస్తే నిజాలు అని తెలిసిపోతాయి పెద్దమ్మకి అని మనసులో అనుకొని వదిలే పెద్దమ్మ నేను వెళ్తున్నాను కదా తనకి తోడు జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను అని అంటాడు దానితో సరే అయితే జాగ్రత్తగా తీసుకెళ్తావు కదా అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి పెద్దమని కూడా తీసుకెళ్లొచ్చు కదరా అని అంటుంది. అమ్మ బయట ఎండలు ఎలా ఉన్నాయో చూస్తున్నావా అసలే పెద్దమ్మ సెన్సిటివ్ ఈ టైంలో బయటకు రావడం ఎందుకు? నేను తీసుకెళ్తాను కదా కృష్ణని జాగ్రత్తగా తీసుకెళ్లి మేము తీసుకొస్తాము అని అంటే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది. దాంతో భవానీ దేవి హాస్పిటల్ కి రావట్లేదని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు కారులో కృష్ణ పెద్దత్తయ్య నామీద చాలా కేరింగ్ చూపిస్తున్నారు అదంతా చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఏసీబీ సార్ ఒక్కొక్కసారి బాధని భరించడమే కాదు ప్రేమ ని భరించడం కూడా కష్టమే అని అంటుంది. నేను తల్లిని కాబోతున్నానని అత్తయ్య పెద్ద అత్తయ్య ఇద్దరు ఎన్నో అసలు పెట్టుకున్నారు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి నాకసలు అర్హత లేదు ఏసీపీ సార్ అని అంటుంది. నేను వాళ్ళని మోసం చేస్తున్నానని నాకు బాగా అర్థమవుతుంది అని అంటుంది ముందు మోసం చేస్తున్నాను అన్న మాటలు తీసే కృష్ణ అని అంటాడు మురారి. అబద్ధం వల్ల అన్యాయం జరిగితే మోసం చేసినట్లు గాని మనం చేసే దాంట్లో అసలు మోసమే లేదు అని అంటాడు. నాకే అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని కృష్ణ బాధపడుతుంది. నాకు అసలు అర్హత లేదా పిల్లల్ని కనడానికి అని అంటుంది అర్హత ఉంది కాబట్టి కదా సరోగసి ద్వారా పిల్లలు కనాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అసలు సరోగసిమదర్ ఎలా ఉంటుంది తన క్యారెక్టర్ ఏంటి తన మనస్తత్వం ఏంటి ఇవన్నీ గురించి మనం ఆలోచించాలి కృష్ణ అని అంటాడు మురారి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా కృష్ణ అని అంటాడు. దాహంగా ఉందని కొబ్బరిబోండం కోసం కారు ఆపుతాడు.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

మురారి దాహంగా ఉందని కారు ఆపి కొబ్బరి బొండాలు తీసుకొని కారు దగ్గరికి వచ్చేసరికి అక్కడ కారులో కృష్ణ ఉండదు. దానితో కృష్ణ ఎక్కడికి వెళ్లావు అని కారులో అంతా వెతుకుతాడు ఎక్కడా కనిపించదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కృష్ణ కనిపించదు. కృష్ణ ఎక్కడికి వెళ్లిందా అని చాలా సేపు పెద్దగా అరుస్తాడు. ఇక కృష్ణ కారులో నుంచి దిగి కస్తూరిఅనాధాశ్రమానికి వస్తుంది. పిల్లలు అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తుంది. మురారి కూడా కృష్ణుని వెతుక్కుంటూ అదే ఆశ్రమానికి వస్తాడు. అక్కడ కృష్ణని చూసి ఇక్కడే ఉంది కదా అని అనుకుంటాడు. కృష్ణ చెప్పకుండా వచ్చేస్తే నేను ఎంత కంగారు పడతానో తెలీదా అని అంటాడు పిల్లలు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో అని అంటుంది. మనం ఒక పాపని దత్తత తీసుకొని పెద్దత్త చేతిలో పెట్టి మీకు మనవరాలు వచ్చింది అని చెప్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అంటే కృష్ణ అని అంటాడు మురారి అవును ఆవిడ కోరిక తీరిపోతుంది కదా అని అంటుంది. నా చేతులతో తీసుకెళ్లి పాపని ఇస్తే ఆవిడ కోరిక తీరినట్టు అవుతుంది నాకు కూడా ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది కృష్ణ. మనకు కూడా పిల్లలు లేని లోటు తీరిపోతుంది కదా అని అంటే కృష్ణ నేను చెప్పేది విను అని అంటాడు మురారి . మీరు చెప్పాల్సిన తర్వాత చెబుతారు కానీ ముందు ఎవరిని దత్తత తీసుకోవాలో చెప్పండి అని అంటుంది. అక్కడే ఉన్న పాపని బాబుని చూస్తూ మీరు బాగున్నారా ఈ పాప బాగుందా అని అంటూ ఉంటుంది. అయినా ఒకలని తీసుకెళ్లడం ఏంటి ఎసిపి సార్ ఒకరు ఇద్దరు ముగ్గురును తీసుకెళ్లి పోదాం మనం ఎవరినైనా ఎంతమందినైనా బానే చూసుకుంటాం కదా, అసలు నువ్వు ఏది ఆలోచిస్తున్నావో నీకు అర్థం అవుతుందా కృష్ణ అని అంటాడు మురారి. అదికాదు ఏసిపి సార్ అని అంటే కృష్ణ పిల్లల గురించే నేను చెప్తుంది అని అంటాడు. నువ్వు చేసిన ఆలోచన చాలా బాగుంది కృష్ణ కానీ, పిల్లలు ఎందుకు దత్తకు తీసుకుంటున్నారు మీకు పిల్లలు పుట్టరా ఏంటి అని పెద్దమ్మ అడిగితే ఇప్పుడు నువ్వు ఏం చెప్తావ్ అని అంటాడు. అవును కదా అసలు నాకు ఈ ఆలోచన రాలేదు పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోయాను అని అంటుంది. అసలు ఏది కలిసి రావట్లేదు నేను అనుకున్నది జరగదు అంతా దురదృష్టమే అని అంటుంది. మళ్లీ పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నావ్ సరోగసి పూర్తయ్యే వరకు నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అది పూర్తయి మన బిడ్డ మన చేతికి వస్తే, అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అని అంటాడు. నేను మళ్ళీ వస్తాను మీరంతా వెళ్లి ఆడుకోండి అని పిల్లల్ని లోపలికి పంపిస్తుంది.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

ఇక కృష్ణా మురారి ఇద్దరు వైదేహి హాస్పిటల్ కి వస్తారు. ఫార్మాట్టీస్ అన్ని పూర్తి చేసి సంతకాలు చేస్తారు. ఇంతే కదా మేడం అని అడిగితే ఇంతే ఇంకా లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయినట్టే మీరు రేపు మార్నింగ్ వస్తే, సరోగసి మొదలుపెడదాం అని అంటుంది. కృష్ణ మీరు వాళ్ళని ఒప్పించి మంచి పని చేశారు మేడం అని అంటుంది. లేదంటే ఇప్పటికిప్పుడు సరోగసి మీద దొరికే వాళ్ళు కాదు అని అంటే మురారి కూడా అవును ఆరు నెలలు పట్టేదాన్ని మీరు చాలా తొందరగా అయిపో కొట్టారు చాలా థాంక్స్ అని అంటారు. మీరు ఒకసారి సరోగసి మదర్ ని నాకు చూపించండి అని అడుగుతుంది కృష్ణ. మీరు డాక్రా ఏంటి కూడా రూల్స్ మర్చిపోతున్నారు అని అంటుంది వైదేహి రూల్స్ కాదు డాక్టర్ కాదు నాకు తల్లి అవ్వాలన్న కోరిక ఉంది దాంతో నాకు ఆమెను చూడాలనిపిస్తుంది ఒకసారి చూపించండి అని అంటుంది. మురారి కూడా తను సరోగసి మదర్ ని చూడాలని చాలా ఆశపడుతుంది ఒకసారి చూపించండి అని అంటాడు. సార్ మీకు తెలియదు కాదు ఇప్పుడు మీరు సంతకాలు చేశారు ఆ పేపర్లో మీరు సర్వసి మదర్ ని చూడాలని అనుకోకూడదు అని రాసి ఉంటుంది అదంతా చదివే కదా సంతకం పెట్టారు అని అంటుంది వైదేహి. మీరు నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అంటుంది దాంతో మురారి సరే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను అని అంటాడు కృష్ణ ఒక్కసారి అని అడుగుతుంటే లేదు కృష్ణ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు పద వెళ్దాం అని అంటాడు. ఇక ఇద్దరు హాస్పిటల్ నుండి బయటకు వస్తూ ఉంటారు. ఎసిపి సార్ కొంచెం బలవంతం చేస్తే వైదేహి డాక్టర్ మనకి ఆ సరోగసి మదర్ ని చూపించేది కదా అని అంటుంది కృష్ణ. సాటి డాక్టర్ అని కూడా చూడకుండా ఆవిడ నాకు సరోగసి మద్దతు చూపించట్లేదు అని అంటుంది కృష్ణ. ఏం చేస్తాం కృష్ణ మన అవసరం కదా అని అంటాడు కానీ నేనైతే ఆవిడని చూడడం చాలా అవసరం మనం బంగారాన్ని బ్యాంకులో దాస్తే నెలకు వెళ్లి చూసుకుంటాం కదా ఇప్పుడు కూడా అంతే నా బంగారాన్ని దాని కడుపులో దాచి పెడుతున్నాను అలాంటప్పుడు నేను ఆమెను చూడకుండా ఉండటం చాలా కష్టం అని బాధపడుతుంది. కృష్ణ నేను నీకు ఎప్పుడూ మాటిచ్చాను ఆవిడ ఎవరో వాళ్ళు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను నీకు రెండు రోజుల్లో అవన్నీ నీ ముందు నిలబెడతాను నువ్వే దగ్గర ఉండి అవి చూసుకొని ఎలా చేస్తాను అని మాట ఇస్తాడు మురారి. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది అని అంటుంది కృష్ణ. నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు నేను ఇక్కడే ఉండి అసలు ఆవిడ ఎవరో ఏంటో కనుక్కుంటాను అని అంటాడు. కృష్ణా సరే సిపి సార్ మీ పనిలో మీరు ఉండండి నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది. ఇక మురారి పరిమళ నీ ఇంఫులెన్స్ వాడి ఇప్పుడు నేను ఆవిడ ఎవరో కనుక్కోవాల్సిందే అని అనుకోని ఫోన్ తీస్తాడు. ఇక కృష్ణ కార్ లో ఇంటికి వస్తే ఒకసారి సర్వసరి మదర్ ని చూసి ఉంటే బాగుండేది.మురారి మాట ఇచ్చారు కాబట్టి కనుక్కుంటారులే అని అనుకుంటుంది. తీరా ఆవిడ ఎవరో తెలుసా తర్వాత పెద్ద అత్తయ్య ఏమంటుందో ఆ బిడ్డని పెద్ద అత్తయ్యకి మంచి ఒపీనియన్ ఉంటుందో ఉండదు ఇవన్నీ ఎలా ఆలోచించాలో ఏంటో అని కృష్ణ ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

ఇక మురారి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు మీకు పరిమళ అంతా చెప్పింది కదా అని ఒక డాక్టర్ని అడిగితే అవును అంతా చెప్పింది మీరు కూర్చోండి మురారి మీరే కదా అని అంటే అవును రూల్స్ కి విరుద్ధంగా ఇలా చేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు కానీ నా భార్య కోరిక తీర్చడం కూడా నాకు అవసరం తన బిడ్డ ఎవరు కడుపులో పెరుగుతుందో తెలుసుకోవాలని నా భార్య కోరుకుంటుంది తనకి నేను మాటే ఇచ్చాను ఇలా రూల్స్ తప్పిన భార్య కోరిక నెరవేర్చడం కూడా కరెక్ట్ కాదు కానీ నాకు తప్పట్లేదు తన వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అని నేను మాటిస్తున్నాను అని అంటాడు. అయితే సాయంత్రం రండి నేను ఫైల్ తెప్పించి పెంచుతాను అని అంటుంది డాక్టర్ సాయంత్రం దాకా ఎందుకండి మీరు తలుచుకుంటే ఇప్పుడే తెప్పించగలరు అనుకుంటా అని అంటాడు సరే అయితే మీ భార్య ఫేస్ లో ఆనందం చూడడానికి మీరు చాలా తొందర పడుతున్నారే అని అంటుంది అవును అని అంటాడు.ఇక్కడే ఉండండి ఫైల్ తెప్పిస్తాను అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari May 4 Episode 462
Krishna Mukunda Murari May 4 Episode 462

రేపటి ఎపిసోడ్ లో, మురారి కి కృష్ణ ఫోన్ చేస్తుంది ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తింగరి అని అంటాడు మీరు అనుకోవడం కాదు ముందు వెళ్లిన పని ఏమైందో చెప్పండి అని అంటుంది. గురించి ఇప్పుడే చెప్పబోతున్నారు అని అంటాడు మురారి అప్పుడు ఎదురుగా ముకుంద వచ్చి నిలబడుతుంది దాంతో ఫోన్ పెట్టేస్తాడు మురారి. ఇప్పుడు మీరు సరోగసి మొదటి గురించి తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ముకుందా అడుగుతుంది. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నా భార్య కోరిక తీరడం కన్నా నాకు కావాల్సింది ఏముంది అని అంటాడు దాంతో ముకుంద మురారి తల మీద చెయ్యి పెట్టి మీ బిడ్డను మోస్తున్న సరోగసి మదర్ ఎవరు కాదు నేనే అని నిజం చెప్పేస్తుంది. దాంతో మురారి షాక్ అవుతాడు.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu