Madhuranagarilo September 15th Episode: ఒరేయ్ మనవడా అలాగే ఉండు రా నేనే నిన్ను రెడీ చేస్తాను అని వాళ్ళ తాతయ్య రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో రాధా మా నాన్నకి పరిచయం చేస్తాను రండి సార్ అని శ్యామ్ ని తీసుకువెళ్తుంది అక్కడికి వెళ్ళాక వాళ్ళ నాన్నగారు లేడు తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు పండు అని రాదా అంటుంది. తాతయ్య నన్ను రెడీ చేసానని సగం మాత్రమే రెడీ చేసి పనుందని ఇప్పుడే అటు వెళ్ళాడు అమ్మ అని పండు అంటాడు. సరే పండు నేను నిన్ను రెడీ చేస్తాను అని రాదా అంటుంది. వద్దు పండుని నేనే రెడీ చేస్తాను అని శ్యామ్ అంటాడు. సార్ మీరెందుకు సార్ నేను చేస్తానులే అని రాదా అంటుంది. అమ్మ నువ్వేమీ చేయొద్దు మా ఫ్రెండు నన్ను రెడీ చేస్తాడు అని పండు అంటాడు.

సరే మీరు మీరు రెడీ కండి అని బయటికి వచ్చి చూస్తే మధురవాళ్ళ ఇంటి ముందు ముగ్గు లేదు ఏంటి మేడం వాళ్ళ ఇంటి ముందు ముగ్గు లేదు నేను వేస్తే మేడం ఏమంటుంది అని రాధా ముగ్గు వేద్దామని మధురవాళ్ళ ఇంటికి వచ్చింది ఇంతలో ధనుంజయ్ బయటికి వచ్చి ఏంటి రాధా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఏమీ లేదు సార్ పండగ రోజు ఇంటి ముందు ముగ్గు లేకపోయేసరికి నేను వేద్దామని వచ్చాను అని రాదా అంటుంది. అవునా మధురాకి ఒంట్లో బాగోలేదమ్మా అందుకే వేయలేదు నీలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి ముగ్గు వేస్తానంటే ఎందుకు వద్దంటాను అని ధనంజయ్ అంటాడు. అంటే సార్ మీకు నా మీద కోపం లేదా అని రాదా అంటుంది. నీ మీద నాకు కోపం లేదమ్మా ఎందుకు అంటే నువ్వు ఆరోజు మాట్లాడిన మాటలు విన్నాక ఆ రోజే కోపం పోయింది మీ ఆంటీ ఇంకా సంయుక్త మాయలో ఉంది తను కూడా ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటుందిలే కానీ రాదా నువ్వు మా ఇంటికి కోడలు అయితే బాగుంటుంది కానీ మాకు అదృష్టం ఉందో లేదో అని ధనుంజయ్ వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే రాధా ముగ్గు వేస్తుంది. ఇంతలో సంయుక్త వచ్చి మా ఇంటి ముందు నువ్వు ముగ్గు వేస్తున్నావే ఏంటి అని అంటుంది. నువ్వు కాదు చెప్పాల్సింది మధుర మేడం అంటే నేను వెయ్యను అని రాదా అంటుంది. నేనే అంటున్నాను ఎందుకు వేస్తున్నావ్ చెప్పు అని మధుర అంటుంది. నేనే వెయ్యమన్నాను నీకు తలనొప్పిగా ఉంది అన్నావు కదా అందుకే రాదని వెయ్యమన్నాను అని ధనుంజయ్ అంటాడు. అయితే ఇప్పుడు సంయుక్త నువ్వు ముగ్గు వేయమ్మ అని మధుర అంటుంది. నువ్వు కూడా వెయ్ రాదా అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే పండు నువ్వు చిన్ని కృష్ణుడిలా ఎంత ముద్దొస్తున్నావురా నిన్ను రెడీ చేయడం అయిపోయింది ఒక నెమలి పించం పెడితే అయిపోతుంది నేను వెళ్లి రెడీ అయి వస్తాను రా అని శ్యామ్ వెళ్ళిపోతాడు శ్యామ్ వాళ్ళ ఇంటికి రాగానే ఇద్దరు ముగ్గు వేస్తూ ఉంటారు ఏంటి అబ్బా వాళ్ళ ఇద్దరు ముగ్గు వేస్తున్నారు అని ఆలోచిస్తాడు రాధా ఈ ముగ్గు నువ్వే సేవ చాలా బాగుంది అని శ్యామ్ అంటాడు.

అవును సార్ అని రాదా అంటుంది.ఆ ముగ్గు నువ్వే సేవ సంయుక్త చూస్తేనే అర్థమవుతుంది అని శ్యామ్ అంటాడు. శ్యామ్ ముగ్గుల గురించి నీకెందుకురా నువ్వు వెళ్లి రెడీ అయ్యిరా అని మధుర అంటుంది. సరేనమ్మా అని శ్యామ్ వెళ్లిపోతాడు.కట్ చేస్తే ఒరేయ్ మనవడా అప్పుడే రెడీ అయిపోయావా అని వాళ్ళ తాతయ్య అంటాడు. నేను రెడీ అవ్వలేదు తాతయ్య మా ఫ్రెండ్ తయారు చేశాడు అని పండు అంటాడు. సరేలే గాని అమ్మే కాడర అని వాళ్ళ తాతయ్య అంటాడు. ఏమో తెలియదు తాతయ్య పిలుచుకు వస్తాను ఉండు అని పండు బయటికి వచ్చి చూస్తాడు నాని వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేస్తుందా అని అక్కడికి వెళ్తాడు పండు. పండు ని చూసి ఎంత ముద్దుగా ఉన్నావురా ముద్దుగారే యశోదమ్మ ముంగిట ముత్యము వీడు అన్నట్టుగా ఎంత అందంగా ఉన్నాడండి వీడు ఒరేయ్ అక్కడే ఆగిపోయావే ఆ పాదాల మీద నడుచుకుంటూ రా అని మధుర అంటుంది. రాదా మీకు ఎంత ద్రోహం చేసినా వాడి మీద మీకు ఎంత ప్రేమ అత్తయ్య అని సంయుక్త అంటుంది.

దానితో మధురాకి కోపం వచ్చి ఒరేయ్ నువ్వేమీ వాటి మీద నడుచుకుంటూ రావద్దు మీ అమ్మ మీ ఇంటి దగ్గర పాదాలు వేసింది కదా వాటి మీద నడువు వెళ్లి అని మధుర అంటుంది. పండు నేను వస్తాను కానీ నువ్వు వెళ్ళు అని రాదా అంటుంది. మా రాధా పండు మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చూసావు కదా అని ధనంజయ్ అంటాడు. చూశాను సార్ ఆ సంయుక్త మాటలు విని మేడం నా మీద ఉన్న కోపం పండు మీద చూపిస్తుంది అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాదా.కట్ చేస్తే రాదా వాళ్ళ ఫ్రెండు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే సంయుక్త చూసి దీన్ని ఎలాగైనా బుట్టలో పడవేసుకోవాలి అని స్వప్న అని పిలుస్తుంది ఎమ్మెల్యే గారి అబ్బాయి నిన్ను చూసి ఇష్టపడ్డాడట నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు నువ్వేమంటావ్ బాగా ఆలోచించుకొని చెప్పు అని సంయుక్త స్వప్నతో అంటుంది

అంత మంచి సంబంధం దొరికితే ఏ ఆడపిల్ల అయినా ఏమంటుంది సరే అంటుంది అని స్వప్న అంటుంది. అయితే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టేనా అని సంయుక్త అంటుంది. నేను ఒప్పుకుంటే రాధ ఫ్రెండ్ ని ఎందుకు అవుతాను కాబట్టి నేను ఒప్పుకోను అని స్వప్న అంటుంది. శభాష్ స్వప్న నువ్వేమనుకున్నావ్ సంయుక్త నా ఫ్రెండ్ ని వలలో వేసుకొని నన్ను ఈ కాలనీ నుండి వెళ్ళకూడదామని నీ ప్లాన్ కదా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని వార్నింగ్ ఇస్తుంది రాదా. స్వప్న కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి నువ్వు వెళ్లి అక్కడ సహాయం చేయి నేను వెళ్లి రెడీ అయి వస్తాను అని రాదా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సరే రాధ అని స్వప్న వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అమ్మ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి రా వెళ్దాము అని శ్యామ్ అంటాడు. కొన్ని వేడుకలు చూస్తూ ఉంటే ఈ కృష్ణాష్టమి చేసుకోవాలని అనిపించట్లేదు రా అని మధుర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది