Bigg Boss 7 Today ఎపిసోడ్ 12: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు చూసిన గేమ్ ఒక ఎత్తు అయితే.. ఇకపై మీరు చూడబోయేది మరో ఎత్తు అవుతుంది. హౌజ్‌లో ఇప్పటికే అసలు ఆట మొదలైంది. హౌజ్ మేట్స్‌ని రౌండు టీమ్‌లుగా చేసి కొత్త టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రారంభించింది. ఒక టీమ్ పేరు రణధీర, మరొక టీమ్ పేరు మహాబలి. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, షకీలా, శోభాశెట్టి, శివాజీ, ప్రియాంక జైన్ ఉన్నారు. మహాబలి టీమ్‌లో గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, రతిక రోజ్, శుభశ్రీ, దామిని ఉన్నారు. అయితే హౌజ్ మేట్ సందీప్ సంచాలకుడిగా ఉన్నాడు. మొదటి టాస్క్ ‘ఫుల్ రాజా ఫుల్’. ఈ టాస్క్‌లో టీమ్ నుంచి నలుగురు పోటీకి రావాల్సి ఉంటుంది. మూడు ఛాన్సులు వస్తాయి. రెండు, మూడు సార్లు టార్గెట్ లైన్ దాటితే వాళ్లు ఒక ‘కీ’ని పొందవచ్చని బిగ్‌బాస్ టీమ్ చెప్పగా.. రణధీర టీమ్ ‘కీ’ గెలిచింది.

రెండవ గేమ్‌లో చేతులు, కాళ్లని వాడుతూ కలర్ నింపిన సర్కిల్‌పై నుంచి ముందుకెళ్లాలి. ఎవరైతే ఈ టాస్క్‌లో గెలుస్తారో వాళ్లకే కీ దొరుకుతుంది. ఈ గేమ్‌లోనూ రణధీర టీమ్ గెలుస్తుంది. ఈ టాస్క్‌లో రణధీర టీమ్ సాధించిన ‘కీ’ని దొంగిలించిన మహాబలి టీమ్ రాత్రంతా పడుకోకుండా ఉంటారు. అయితే శివాజీ వాళ్లని తెలివిగా డైవర్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో మహాబలి టీమ్‌కు చెందిన శుభస్త్రీ పవరస్త్రను దొంగలించి దాచేస్తుంది. ఇక గెలిచిన రణధీర టీమ్‌లో ఒక కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఇప్పటికే ఆట సందీప్ హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ కాగా.. మిగిలిన ఆరుగురిలో మరొక హౌజ్‌గా కన్ఫమ్ కానున్నారు.

రణధీర టీమ్ రెండో కీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలి టీమ్‌లో ఉన్న వారు మాయాస్త్ర ముక్కలను తీసుకుని రణధీర టీమ్‌లో ఉన్న వారికి ఇవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. రెండో అస్త్ర గెలుచుకున్న వారికి నాలుగు వారాల ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఎలిమినేషన్ నుంచి బయట పడతారని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ క్రమంలో మహాబలి టీమ్‌లో ఉన్న వారు నేను వెళ్తానంటే నేను వెళ్తానని గొడవపడ్డారు. ముఖ్యంగా మహాబలి టీమ్‌లో ఉన్న రతిక రోజ్ రెచ్చిపోయింది.

శోభా శెట్టి నుంచి శుభ శ్రీ మాయాస్త్ర భాగాన్ని తీసుకుని ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది. అమర్ దీప్ నుంచి పల్లవి ప్రశాంత్ మాయాస్త్రను తీసుకుని శివాజీకి ఇచ్చాడు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది. రణధీర టీమ్‌లో ఉన్న శివాజీకి ఎక్కువ మాయాస్త్ర భాగాలు ఇచ్చి ఆయనను విన్నర్ చేస్తానని రతిక రోజ్ చెప్తుంది. దానికి మహాబలి టీమ్ మెంబర్స్ ఒప్పుకోలేదు. మహాబలి టీమ్ కెప్టెన్‌గా ఉన్న దామినిపై రతిక రోజ్ రెచ్చిపోయింది. టీమ్ కోఆర్డినేషన్ లేదని, ఎవరూ మాట వినట్లేదని చెబుతోంది. నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా.. సైలెంట్‌గా ఉన్నానని రెచ్చిపోకు అంటూ దామినిపై రతిక రోజ్ ఫైర్ అయింది.
Bigg Boss 7 Telugu: టెలివిజన్ రంగంలో రికార్డు క్రియేట్ చేసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్..!!

అందరూ బఫూన్స్.. ఛండాలంగా అనిపిస్తోంది..
మహాబలి టీమ్ కోఆర్డినేషన్ లేదని, తన నిర్ణయాన్ని గౌరవించడం లేదని రతిక రోజ్ ఆరోపించింది. టీమ్ మేట్స్ తనపై అరుస్తున్నారని రతిక రోజ్ చెప్పింది. టీమ్ మేట్స్ అందరూ బఫూన్స్ అని, ఈ టీమ్‌లో ఉండటానికి ఛండాలంగా అనిపిస్తోందని రతిక రోజ్ దారుణంగా కామెంట్లు చేసింది. అలా కొద్ది సేపటి వరకు ఈ గొడవ సాగుతుంది. మహాబలి టీమ్ మేట్స్ నిర్ణయాన్ని గౌరవించాలని రతిక రోజ్‌కు చెప్తారు. అయినా రతిక రోజ్ మాట వినదు. దాంతో బిగ్‌బాసే ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడు. మహాబలి టీమ్ మెంబర్స్‌లో ఎవరినో ఒకరిని సెలక్ట్ చేసి వారి నుంచి మాయాస్త్రను తీసుకోవాలని రణధీర టీమ్‌కు చెబుతుంది. అలాగే రణధీర టీమ్‌లో ఎక్కువ మాయాస్త్రలు ఉన్న వారు.. తమ టీమ్‌లో మరొకరికి మాయాస్త్రను ఇవ్వాలని చెబుతోంది. ఈ క్రమంలో అమర్‌దీప్ గేమ్ ఎందుకు ఆడుతున్నామో తెలియడం లేదని, ఎవరికి వారు గేమ్ ఆడుతూ, రూల్స్ తెలియకుండా టీమ్ మొత్తాన్ని ఓడించారని ఆరోపించాడు. దాంతో వచ్చే ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.