Janaki Kalaganaledu సెప్టెంబర్ 15: పేదింట్లో పుట్టి తన స్వయం కృషితో పైకి ఎదిగిన అమ్మాయి ప్రియాంక జైన్. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ భామ మొదటగా సినిమాల్లోనే ఆరంగేట్రం చేసింది. 2015లో తమిళంలో ‘రంగి తరంగ’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే కన్నడలో ‘గోలిసోడా’ అనే సినిమా కూడా చేసింది. 2018లో ‘చల్తే చల్తే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టంది. ప్రియాంక జైన్ నటించిన చాలా సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియళ్లు చేస్తూ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ‘మౌనరాగం’ సీరియల్‌లో తనతోపాటు నటించిన శివకుమార్ అనే నటుడితో ప్రేమలో పడింది. ఈ తర్వాత ఇటీవలే ఆమె నటించిన ‘జానకి కలగనలేదు’ సీరియల్‌కు శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. ఈ సీరియల్‌లో ఆమె జానకీ పాత్రలో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించారు. తెలుగు సీరియళ్ల ద్వారానే ఆమె చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు. సీరియల్‌కు శుభం కార్డు పడటంతో ప్రియాంక జైన్ బిగ్‌బాస్ సీజన్-7 తెలుగులోకి అడుగుపెట్టింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ప్రియాంక జైన్ బిగ్‌బాస్ హౌజ్‌లోనూ తన చరిష్మా చూపిస్తోంది.

బిగ్‌బాస్ సీజన్-7 తొలి కంటెస్టెంట్‌గా..
బిగ్‌బాస్ సీజన్-7 తొలి కంటెస్టెంట్‌లో ప్రియాంక జైన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్‌లోకి వెళ్లిన ప్రియాంక జైన్ తొలి వారం నామినేషన్స్ మినహాయిస్తే.. ఆ తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ అంతా పర్వాలేదనిపిస్తుంది. ఉన్న వాళ్లతో పోలిస్తే.. ప్రియాంక జైన్ బాగానే ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కిచెన్‌లో కూడా కుస్తీలు పడుతోంది. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సీరియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమర్ దీప్, శోభాశెట్టితో గ్రూప్ ఫామ్ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి రాక ముందు.. ‘నా గురించి అందరికీ తెలియాలని అనుకున్నాను. నన్ను కేవలం సీరియళ్లలోనే చూసి ఉంటారు. మౌనరాగంలో అమ్ములుగా, జానకి కలగనలేదులో జానకిగా మాత్రమే చూసి ఉంటారు. నా గురించిన పర్సనల్‌గా ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్ హౌజ్‌లో నేనేంటో చూస్తారు. పొట్టి దాన్ని అయినా గట్టి దాన్ని’ అని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్ హౌజ్‌లో వాతావరణం బాగానే ఉందని అనిపించినా.. టాస్క్స్, నామినేషన్స్ వచ్చే సరికి వాతావరణం వాడివేడీగా మారుతోంది. ఒకరిపై ఒకరు చెబుతున్న కారణాలు, దానికి అవతల కంటెస్టెంట్లు ఇస్తున్న సమాధానాలు హౌజ్ మేట్స్ మధ్య గొడవలను పెంచుతోంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో వారం జరిగిన ఎలిమినేషన్స్‌లో హౌజ్ మేట్స్ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసినా.. ఓటింగ్స్‌లో అతనే టాప్‌లో నిలిచాడు. అయితే రెండో సారి జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ తమ కారణాలు వినిపిస్తున్నా అవి వినడానికి శివాజీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. అప్పుడు ప్రియాంక జైన్‌కు శివాజీకి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అప్పుడు ప్రియాంక జైన్‌లోనూ ఫైర్ ఉందని ఆడియన్స్‌కు తెలిసింది. సీనియర్ మోస్ట్ యాక్టర్‌ను కూడా కడిగి పడేసింది.

నామినేషన్స్‌లో ప్రియాంక.. శివాజీని పనుల్లో యాక్టివ్‌గా ఉండటం లేదని తన తప్పులను చెబుతుండగా.. నామినేట్ చేసి వెళ్లిపోమని శివాజీ నెగ్లెట్‌గా సమాధానం చెప్తాడు. దానికి ప్రియాంక జైన్.. మీరు ఎందుకు మాట వినరు. ఎవరైనా ఏదైనా చెప్తే ఎందుకు తీసుకోలేరు. ఏదైనా చెప్తే దానిపై సామెతలు చెప్పడం, హేళన చేయడం వంటివి చేస్తుంటారు. దానికి శివాజీ కూడా అమర్యాదగా మాట్లాడటంతో.. తనతో ఇలా మాట్లాడితే నచ్చదని గట్టిగా చెప్పింది. తాను హౌజ్‌లోకి గేమ్ ఆడటానికి వచ్చానని, బిగ్‌బాస్ హౌజ్‌లోకి ట్రిప్‌కి రాలేదని కామెంట్లు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. ప్రియాంక జైన్ కూడా బిగ్‌బాస్ గేమ్ ప్లాన్‌ను బాగా అర్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రియాంక జైన్‌కు బాగానే తెలుసు. పవరస్త్ర టాస్క్‌లోనూ రణధీర టీమ్‌లో ఉంటూ గైడ్‌లైన్స్ ఇచ్చింది. దాంతో రణధీర టీమ్ అన్ని టాస్క్‌లోనూ గెలిచింది. సేఫ్‌గా ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్న ప్రియాంక జైన్.. రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోని ఐపీఎస్ ఆఫీసర్‌గా గేమ్ ఆడుతోందని తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు.