NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 27 2023 Episode 531: శరత్ చంద్ర ఇచ్చిన బ్యాంకు చెక్ ని చింపి వేస్తున్న  గౌతమ్.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

Malli Nindu Jabili December 27 2023 Episode 531: మల్లి నిశరత్ మీరా గారు గౌతమ్ దగ్గరికి బయలుదేరుతారు.ఇంతలో వసుంధర వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు హడావుడిగా అని అంటుంది.గౌతమ్ దగ్గరికి వెళ్తున్నాం అని శరత్ అంటాడు.ఈ టైంలో వెళ్లి వాడి కోపానికి గురి అవ్వడం కంటే ఊరుకోవడం బెటర్ అని వసుంధర అంటుంది.కోప్పడతాడో తిడతాడు అని మనం ఇక్కడే ఉంటే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చే బంధువుల మై ఉండి మనకెందుకులే అని ఊరుకుంటామా అని శరత్ అంటాడు.అత్తయ్య అలాగనే గౌతమ్ని ఒంటరిగా వదిలేయలేము కదా అని అరవింద్ అంటాడు.నువ్వు కూడా వెళ్లొచ్చావా అని వసుంధర అరవింద్ ని అడుగుతుంది.అరవింద్ నువ్వు గౌతమ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే నీ మెడకు చుట్టుకుంటుంది మనం ఇప్పుడు గౌతమ్ ని పరామర్శించడానికి వెళ్తే ఆ మినిస్టర్ మనల్ని ఏమైనా చేస్తాడండి అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights
Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

బిడ్డలు నీటిలో మునిగిపోతుంటే మనకెందుకు అని ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటామా అమ్మగారు ఏదైతే అదే అయ్యింది నేను మల్లి ని చూడాలి అని మీరా అంటుంది. బిడ్డ రోడ్డున పడితే చూస్తూ ఒక తండ్రిగా ఏమీ చేయకుండా ఉండలేను గౌతమ్ కోప్పడితే కోప్పడని వెళ్లి తీరాలి అని శరత్ మీరా అని తీసుకొని బయలుదేరుతాడు.మాలిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అందరూ తప్పించుకుంటారు కానీ అది అరవింద్ మెడకే చుట్టుకుంటుంది అని వసుంధర అంటుంది.కట్ చేస్తే,గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.గౌతమ్ కాఫీ తాగు నాన్న అని కౌసల్య అంటుంది.ఇంతలో కోర్టు నుంచి లాయర్ గారు ఫోన్ చేస్తాడు గౌతమ్ కి గౌతమ్ మినిస్టర్ గారికి మీరు కట్టే 90 లక్షలు మీ పార్టనర్ కి కట్టే డబ్బులు అన్ని లెక్క చేస్తే మీరు ఉంటున్న ఇల్లును కూడా వేలం పాట వేయాల్సి ఉంటుంది కోర్టు ఆధీనంలోకి తీసుకోకముందే మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది లేదంటే  లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది అని లాయర్ అంటాడు.ఎవరు గౌతమ్ ఫోన్లో అని కౌసల్య అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights
Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

నేను ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు ని గవర్నమెంట్ సొంతం చేసుకుంటుంది అంట మన ఆస్తులని ఆమె నా అప్పు తీరదంట నేను మల్లి కి  గుండెల్లో గుడి కట్టుకున్నాను కానీ నన్ను నేలకు తొక్కేసింది అని గౌతమ్ అంటాడు. నువ్వు మల్లి నీ ఇంట్లోకి రానీయకుండా ఉంచాల్సిందే నాన్న ఇప్పుడు చూడు ఏమైపోయిందో అని కౌసల్య అంటుంది. నేను ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కితే నన్ను అన్ని మెట్లు దించేసింది అమ్మ ఆ మల్లి అని గౌతమ్ కోపంతో వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మిరా శరత్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి గౌతమ్ మందు తాగుతూ కనిపిస్తాడు శరత్ కి గౌతమ్ ని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయిపోతాడు. ఆగండి ఇంకా ఏం మిగిలిందని వచ్చారు పరామర్శించి ఇంక అవమానించడానికి వచ్చారా అని కౌసల్య అంటుంది.అలా అంటావేంటి చెల్లమ్మ బంధువులమై ఉండి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యంగా నాలుగు మాటలు చెప్పడానికి రాకూడదా అని శరత్ అంటాడు.నీ కూతురు మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఇంకా ఏం మిగిలింది మీరు సర్ది చెప్పడానికి అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights
Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

మీరా గౌతమ్ దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి బాబు కష్టంలో ఉన్నప్పుడు నిజం మీ కళ్ళకు కనపడదు మీరు బాధలో నుంచి బయటికి రావడానికి మందును తాగుతున్నారు కానీ అదే పనిగా అలవాటు అవుతుంది ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకండి బాబు అని మీరా అంటుంది. ఏం చేయమంటారు నీ కూతురు చేసిన మోసాన్ని తట్టుకోలేక మందుకి అలవాటైపోయాను బాధలని ఎలా మర్చిపోగలను అని గౌతమ్ అంటాడు. నా కూతురు తప్పు చేసిందని మీరు అంటున్నారు అది తప్పు చేయలేదని నిరూపించుకునే దాకా నైనా మీరు ఇలాంటి చెడు అలవాట్లు అలవాటు కాకండి బాబు మిమ్మల్ని ఎంతో గొప్పగా చూసిన నేను ఇలా చూడలేకపోతున్నాను అని మీరా అంటుంది. అమ్మ నా శత్రువులు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం చేస్తానో నాకే తెలీదు వీళ్ళని పంపించే అని గౌతమ్ అంటాడు. మర్యాదగా మీరు బయటికి నడవండి అని కౌసల్య కోపంగా అ0టుంది. గౌతమ్ నాకు ఒక కొడుకు ఉంటే ఇలాంటి కష్టమే వస్తే తనను రోడ్డు మీద వదిలేసి వెళ్ళను తనకి సపోర్టుగా నిలబడి తనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనేలా చేస్తాను నువ్వు నా కొడుకు లాంటి వాడివే అనుకొని నీకు వచ్చిన కష్టాన్ని తీరుస్తాను నువ్వు మినిస్టర్ ధర్మారావు గారికి చెల్లించే డబ్బుని నీ కంపెనీ పార్టనర్ కి ఇచ్చే డబ్బుని అంతా నేను సెటిల్ చేస్తానుఈ బ్యాంక్ చెక్కు తీసుకొని ఎంత కావాలంటే అంత రాసుకో  అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights
Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

ఇప్పుడు మీరు దీన్ని నన్ను తీసుకోమంటారు దీనివల్ల నా పేపర్ నా కంపెనీ ఆ పార్ట్నర్స్ అందరూ వెనక్కి వస్తారు మరి నాకు జరిగిన అవమానం ఎలా వెనక్కు వస్తుంది నీ కూతురు వల్ల పోయిన నా పరువు ఎలా తిరిగి వస్తుంది రాదు కదా ఇది తీసుకొచ్చి ఇవ్వదు కదా అని గౌతమ్ అంటాడు. బాబు గారు నిజానిజాలు తెలుసుకోకుండా లోకం నోటికి వచ్చింది అలా మాట్లాడుతారు బాబు గారు అని మీరా అంటుంది. ఎవరేమన్నా పట్టించుకోనట్టు నీకు అలవాటైనట్టు నాకు అలవాటు కాలేదు అని గౌతమ్ అంటాడు. మిస్టర్ శరత్ చంద్ర గారు మీరు ఎంతో గౌరవంగా వచ్చి నాకు బ్యాంక్ చెక్కు ఇస్తున్నారు తీసుకోకపోతే ఫీల్ అవుతారు అందుకే తీసుకుంటాను అని బ్యాంక్ చెక్కు తీసుకొని దాని వంక చూస్తూఉంటాడు గౌతమ్.తీసుకోవనుకున్నాను తీసుకున్నందుకు చాలా థాంక్స్ గౌతమ్ నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనక నేనుంటాను అని శరత్ అంటాడు. గౌతమ్ ఆ బ్యాంకు చెక్ ని చింపి విసిరేస్తాడు. ఏమైంది బాబు ఎందుకు ఇలా చేశారు అని మీరా అడుగుతుంది. నేను తీసుకుంటానని ఎలా అనుకున్నారు శరత్ చంద్ర గారు నేను ఈ చెక్కును గనుక తీసుకున్నట్లయితే నీ అల్లుని నా భార్య దగ్గర చనువుగా ఉండడానికి నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అని గౌతమ్ అంటాడు. ఆ మాటతో శరత్ కి ఎక్కడలేని కోపం వచ్చి గట్టిగా గౌతమ్ అని అంటాడు శరత్. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నీ అల్లుని నా భార్యని ఉంచుకోమనాలి అని గౌతమ్ నిర్మోహమాటంగా అంటాడు. గౌతమ్ బాబు మీకు దండం పెడతాను దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి అని మీరు అంటుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు గాని మళ్లీ గాని ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు అరవింద్ బాబు మల్లి మెడలో తాళికట్టుగాని పసి బిడ్డలా చూసుకున్నాడు అట్లాంటి మంచి బంధం వాళ్ళది దయచేసి అట్లాంటి మాటలు అనకండి అని మీరా అంటుంది. నువ్వు బాధలో చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నావ్ గౌతమ్ అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights
Malli Nindu Jabili Today Episode December 27 2023 Episode 531 Highlights

గాయపడిన వాని నేను గాయం చేసిన వారు మీరు నేను ఏమైనా అంటాను అని గౌతమ్ అంటాడు. పరిస్థితులు మమ్మల్ని శత్రువులుగా మార్చాయి కానీ మేము ఎలాంటి వాళ్ళమని మీకు తెలుసు అని శరత్ అంటాడు. ఇక చాలు మీరు ముందు బయటికి నడవండి అని గౌతమ్ కోపంగా అంటాడు. బాబు గారు పెద్ద మనసు చేసుకోండి బాబు గారు అని మీరా అంటుంది.మీలాగా ఒకరి ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి అంతా గొప్ప మనసు మాకు లేదు అని కౌసల్య అంటుంది. ఏంటి అమ్మగారు నేను ఒక ఆడదాన్ని జీవితం పాడు చేయడం కోసం ఆ ఇంట్లో అడుగు పెట్టాను అని మీరా అంటుంది. అమ్మ మాట మాట అనుకుంటే గోవ లు పెరుగుతాయి అని నీలిమ అంటుంది. మావయ్య మీరు ఇక్కడే ఉంటే ఇంకా గొడవ పెద్దదవుతుంది దయచేసి వెళ్ళిపోండి మామయ్య గాయం మీద మరో గాయం చేసినట్టు అవుతుంది ప్లీజ్ వెళ్ళండి అని మాలిని అంటుంది.నీ అల్లుడు వచ్చి నీ కూతుర్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు ఇద్దరు చట్టపట్టలేసుకొని ఎక్కడ తిరుగుతున్నారు అని కౌసల్య అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N