NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 11 2024 Episode 544: మల్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు కోపంతో తగలబెట్టిన వసుంధర..

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

Malli Nindu Jabili January 11 2024 Episode 544: ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు అని వసుంధర అడుగుతుంది. ఏమీ లేదు అని అరవింద్ చేతిలో డబ్బు పట్టుకుని దాయబోతాడు. ఏం చేస్తున్నావ్ అరవింద్ నీ చేతిలో డబ్బు కనిపెట్టి నేను ఊహించగలను ఆ డబ్బు మీరా కిచ్చి పంపించావు కదా వాడు తీసుకోనని మోహన కొట్టాడా అని వసుంధర అంటుంది. అది కాదు అత్తయ్య అని అరవింద్ అంటాడు. అరవింద్ వాడు పూటకు లేకపోయినా రోషం పౌరుషం ఉన్నవాడు తిండికి లేకపోయినా చస్తాడు కానీ మీలాగా మోసం చేసే వాళ్ళ డబ్బులు తీసుకొని తిని బ్రతకడు నా మేనల్లుడు అంత పట్టుదల వాడు నువ్వు డబ్బులు ఇస్తే వచ్చేది ప్రాబ్లం అక్కడ కాదు మన ఇంట్లో నీకు మాలినికి గొడవలు అవుతాయి అది గుర్తుపెట్టుకుని ఇంకోసారి డబ్బు అక్కడికి పంపించు పైగా మాలిని ఇప్పుడు కడుపుతో ఉంది తను టెన్షన్ పడకుండా చూసుకోవాల్సిన సమయం ఇది ఎందుకు ఇలా పిచ్చి పనులు చేసి మాలిని ని బాధ పెడతావు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights
Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

మీరా ఇంకా నీకు బుద్ధి రాలేదా నీ కూతురు జీవితం అలా అయిపోయిందని నా కూతురు జీవితం కూడా పాడు చేయాలనుకుంటున్నావా ఇంకా ఎంతకాలం మా ఇంట్లో ఉండి మమ్మల్ని బాధపడతారు అని వసుంధర అంటుంది.  మాలిని అమ్మ గారి జీవితాన్ని ఎందుకు పాడుచేస్తానమ్మ అని మీరా బాధపడుతుంది.మీరిద్దరూ ఇలాగే చేస్తే ఏదో ఒక రోజు గౌతమ్ కి నిజం తెలుస్తుంది మల్లి ని ఆయిత కూడా ఇంట్లో ఉండనివ్వడు దాన్ని అలా కూడా బ్రతకనివ్వరా అని వసుంధర కోపంగా అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ దగ్గరికి వచ్చి ఏమండీ నాకు కంగ్రాట్స్ చెప్పండి జాబ్ వచ్చింది అని అంటుంది. నీకు ఇంత తొందరగా జాబ్ ఎలా వచ్చిందో నీకు చెప్పనా అరవింద్ గాడు ఇప్పించాడు నీ కష్టం చూడలేక అందుకే నీకు తొందరగా జాబ్ వచ్చింది మా ముందు నటిస్తున్నావు కానీ మీ రిలేషన్ బయట నడిపిస్తూనే ఉన్నారు నీ మొదటి మొగుడు ఇప్పించాడు ఇంకా  వాడికి నీ మీద మోజు పోలేదు అందుకే ఇద్దరు రహస్యంగా తిరుగుతున్నారు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights
Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

ఎందుకండీ అలాంటి మాటలు మాట్లాడతారు ఇది నేను కష్టపడి సంపాదించుకున్న జాబ్ అని మల్లి అంటుంది. ఎందుకే నంగనాంచి మాటలు మాట్లాడతావ్ మీ బాగోతం అంతా మాకు తెలుసు ఎవరిని నమ్మించాలనుకుంటున్నావ్ అని కౌసల్య అంటుంది. అమ్మ వదినకు జాబ్ వచ్చింది మనల్ని పోషిస్తుంది అని కృతజ్ఞత కూడా లేకుండా అలా తిడతారు ఏంటి అని నీలిమ అంటుంది. ఇంతకుముందు దాన్ని మనం పోషించాం కదా దాన్ని తో పోలిస్తే అది మనల్ని పోషించడం ఎంత అది కృతజ్ఞత చూపించాల్సింది మన మీద దానిమీద మనం కాదు నువ్వు ఎందుకు దాన్ని వెనకేసుకొస్తున్నావ్ లోపలికి వెళ్ళు అని కౌసల్య అంటుంది. నువ్వేదో జాబ్ చేసి ఉద్ధరించి మమ్మల్ని బాగు చేస్తానని అనుకుంటున్నావు కదా చెయ్యి చూస్తాం ఏ పాటి ఉద్యోగం చేస్తావో అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights
Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

మల్లి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కూడా లేకుండా ఏడుస్తూ లోపలికి వెళుతుంది. కట్ చేస్తే, వసుంధర మల్లి సర్టిఫికెట్లన్నీ తగలబెట్టి నీకు ఉద్యోగం కావాలా నీ కుటుంబాన్ని పోషించుకొని నీ శత్రువుని పట్టుకొని నీ భర్త ముందు నిలబెట్టి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావా ఇప్పుడు చెయ్యవే జాబ్ అని వసుంధర కోపంతో అంటుంది.మీరా పక్కనే ఉండి అమ్మగారు ఎవరివో  పేపర్ల తగలబెడుతున్నారు అని చూస్తుంది. కట్ చేస్తే, ఏవండీ నేను మొదటిసారిగా జాబ్ కి వెళ్తున్నాను మీకు ఆనందం కలిగించక పోయినా సరే నన్ను ఆశీర్వదించండి ఇక ఈ జాబ్ చేసి మిమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుంటాను మన కష్టాలు తీరిపోయినట్టే అని మల్లి సంతోషంతో అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights
Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

ఎలా బ్రతికిన వాడిని ఏ స్థితికి వచ్చాను చూసి ఎగతాళి చేస్తున్నావా అంతా నీ వల్లనే కదా జరిగింది ఈ వీల్ చైర్ లో కూర్చుని ఏమీ చేయలేవురా నేను తెస్తే తిని బతికే పొజిషన్లో ఉన్నావని నన్ను వెక్కిరిస్తున్నావు కదూ అందుకే పదేపదే నా కళ్ళ ముందు తిరుగుతున్నావు కదా అని గౌతమ్ అంటాడు. లేదండి నేను అలా ఎప్పుడూ అనుకోలేదు మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోను జాబ్ కు వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పండి అని మల్లి అంటుంది. నువ్వు జాబ్ చేసి డబ్బులు ఇస్తే నేను ఎలా తింటాను అనుకుంటున్నావు నెవర్ నీ దయ దక్షిణాల మీద ఎప్పటికీ బ్రతకను అంతకన్నా చావడమే నయం అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights
Malli Nindu Jabili Today Episode January 11 2024 Episode  544 Highlights

ఏవండీ అలాంటి మాటలు మాట్లాడకండి నేను మీకు ఎందుకు తప్పుగా కనిపిస్తున్నానో నాకు తెలియదు కానీ మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకుంటున్నాను అనుకోండి అంతే ఇకమీదట జాబ్ చేస్తు నా శత్రువు ఎవరో కనిపెట్టి మీ ముందు ఉంచుతాను అప్పుడు మీరు నన్ను అనవసరంగా తిట్టానే అని బాధపడతారు అని మల్లి అంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను నిన్ను అసలు నా జీవితంలోనే నమ్మను అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, మల్లి అపాయింట్మెంట్ ఇచ్చిన దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఆఫీస్ ఉండదు ఏమీ ఉండదు కంగారు పడిపోయి ఒక టీ కొట్ట అతని అడుగుతుంది మల్లి. అమ్మ నువ్వు చూపించిన అడ్రస్ ఇదే కానీ ఇక్కడ న్యూస్ ఛానల్ ఆఫీస్ ఇక్కడ ఏమీ లేదమ్మా అని అతను అంటాడు. మల్లి అక్కడికి వెళ్లి అంతా వెతికినా ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చాను వాళ్లకి ఇప్పుడు నా సర్టిఫికెట్ ఏమైపోయాయి అని మల్లి అక్కడ అంతా వెతుకుతుంది కానీ సర్టిఫికెట్ దొరకవు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది మల్లి .. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N