NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam January 1st 2024 Episode 121: స్కూల్లో అరుంధతిని పట్టివ్వడానికి మనోహరి వేసిన ప్లాన్ ..

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

Nindu Noorella Saavasam January 1st 2024 Episode 121:  మనోహరి అంజు తల కింద మెత్త పెట్టి భయంతో పారిపోయి తన రూమ్లో వణుకుతూ కూర్చుంటుంది.అమ్మగారు ఫస్ట్ టైం ఆత్మని చూడలేదు కానీ అది భయపడితే ఎలా ఉంటుందో చూశాను అమ్మగారు అని నీలా భయంతో కంగారు పడుతూ ఉంటుంది.నిజంగా నేనే పిల్లల దగ్గరే అరుంధతి ఇంకా తిరుగుతూ ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఘోరాకి అరుంధతిని పట్టి ఇవ్వాలి అని మనోహరి ఆలోచిస్తుంది.కట్ చేస్తే,రామ్మూర్తి దగ్గుతూ వచ్చి ఇంట్లోకూర్చుంటాడు. ఇంతలో ఖాళీని కొడుతూ ఉంటుంది మంగళ. ఎందుకే వాని  కొడుతున్నావు అని రామ్మూర్తి
అంటాడు.చూడవయ్యా వీడేం పని చేశాడు పెళ్లి కానీ అమ్మాయి పేరు తన చేతి మీద రాసుకుంటే ఎలాగయ్యా రేపు పెళ్లి అయ్యే పిల్ల అని మంగళ అంటుంది మంగళ.ఎందుకురా వేయించుకున్నావ్ అని రామ్మూర్తి అడుగుతాడు. అక్క నాకు భాగమతి అంటే చచ్చేంత ఇష్టం అందుకే వేయించుకున్నాను నాకు కాబోయే భార్య పేరు ఎంచుకుంటే తప్పేంటి అక్క అని వాళ్ల తమ్ముడు అంటాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నీకు భాగమతికి ఎక్కడ కుదురుతుంది రా ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది ఇంకోసారి ఇలాంటి ఎదవ పని చేసావంటే నేనే చంపేస్తాను అని మంగళ వాళ్ల తమ్ముని కొట్టి ఇప్పుడే వెళ్లి ఆ పేరు తీసేయించుకొని రారా అని చెప్తుంది.

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights
Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

చూడండి ఎంతైనా అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి చేయాలి ఎప్పుడు అంటే అప్పుడు మనం భాగమతిని చూడలేం కదా అండి అప్పుడు మన ఇంటికి భాగమతి చుట్టం చూపుగా వచ్చి ఒకరోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుంది అందుకేనండి నేను మా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే మన ఇంట్లోనే ఉంటుందని అంటున్నాను అని మంగళ చెప్పేస్తుంది. రామ్మూర్తి ఏమి మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు. ఏంటి అక్క ఇది  ఎన్ని ప్లాన్లు వేసిన బావ నోట మాత్రం మాట రావట్లేదు అని వాళ్ళ తమ్ముడు అంటాడు. రేయ్ మీ బావ ఒప్పుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది రా ఒప్పిదం అది నువ్వు చేయాలి అని మంగళ అంటుంది. సరే అక్క  అని వల్ల తమ్ముడు అంటాడు. కట్ చేస్తే, పిల్లలందరూ స్కూల్ కి రెడీ అయి కిందికి వస్తారు. ఏంటి పిల్లలు ఇంత తొందరగా వచ్చేసారు ఇంకా టైం ఉంది కదా స్కూల్ కి అని భాగమతి అంటుంది. ఉంది మిస్సమ్మ కాని ముందుగా వెళ్తేనే కదా పిల్లలందరినీ ఓటు అమ్ములు కి వేయమని అడగొచ్చు అందుకే తొందరగా వెళ్తున్నాం అని అంజలి అంటుంది. అందరూ కలిసి బాగానే ప్లాన్ చేశారే అని శివరామ్ అంటాడు. అందరూ కాదు తాతయ్య నేనే ప్లాన్ వేసాను వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights
Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటావు కానీ చదువు ఒక్కటే నీకు రావ్వడం లేదు ఆ చదువు కూడా వస్తే ఎంత బాగుంటుంది అని నిర్మల అంటుంది. అయ్యో నాయనమ్మ నాకు అన్ని తెలివితేటలు ఇచ్చి చదువు కూడా ఇస్తే ఏం బాగుంటుంది అందుకే ఏ తెలివితేటలు లేని వీళ్లకు చదువునివ్వమని వేడుకోండి దేవుడిని అని అంజలి  అంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అంటాడు. డాడీ అమ్ములు కి ఓట్లు అడగడానికి వెళ్తున్నాము మమ్మల్ని ఆశీర్వదించండి అని అంజలి వాళ్ళ నాన్న పాదాలకి నమస్కారం చేస్తుంది. ఆల్ ద బెస్ట్ మీరే గెలవాలి అని అమరేంద్ర అంటాడు. ఇది మంచి సమయం మనం అరుంధతిని పట్టుకోవడానికి అని మనోహరి ఆలోచించి పిల్లలు మీ అమ్మ మీ వెంట ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు మీరే గెలుస్తారు అని అంటుంది మనోహరి. అలా అనగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. అంటే ఎప్పుడు అరుంధతి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా అమ్మ ప్రేమ తోడై వాళ్ళని గెలిపిస్తుంది అంటున్నాను అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights
Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

సరే పిల్లలు పదండి మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అమరేంద్ర పిల్లల్ని తీసుకొని కారు దగ్గరికి వెళ్తాడు. అందరూ కారేకి కూర్చుంటారు అంజలి ముందు సీట్లో కూర్చొని కొంచెం ప్లేసు అరుంధతి కోసం వదిలిపెడుతుంది. సరిగ్గా కూర్చోవచ్చు కదమ్మా ప్లేస్ నీకు సరిపోవట్లేదా అని అమరేంద్ర అంటాడు. అది కాదు నాన్న అమ్మ మాతో పాటు స్కూల్ కి వస్తే అమ్మకి ప్లేస్ ఉండాలి కదా అందుకనే పక్కకు జరిగి కూర్చున్నాను అని అంజలి అంటుంది. ఆ మాట వినగానే అమరేంద్ర కొంచెం ఎమోషన్ గా ఫీల్ అయ్యి కళ్ళు చెమ్మగిల్లిచ్చి పిల్లల్ని తీసుకుని స్కూల్ కి వెళ్తాడు. కట్ చేస్తే, నీలా ఘోర దగ్గరికి వెళ్లి అమ్మగారు మిమ్మల్ని స్కూల్ దగ్గరికి రమ్మంటుంది అక్కడికి వెళ్తే ఆత్మని బంధించొచ్చని చెప్పింది అని నీలా చెప్తుంది. స్వామి నువ్వు చెప్పినట్టే నాకు సహాయం చేయడానికి మనుషులు వచ్చారు అని ఘోర పగలబడి నవ్వుతాడు. ఇదేంట్రా అందరూ పైన గాల్లో చూసి మాట్లాడుతున్నారు మనుషులతో మాట్లాడడం మానేశారా ఏంటి అని నీలా అనుకుంటుంది. అది సరే ఆత్మను బంధించి మీరు ఏం చేస్తారు అని నీలా అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights
Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

ఆత్మని బంధించితే నా మాట అప్పుడే వినదు దాన్ని చిత్రహింసలు పెడతాను తట్టుకోలేక అప్పుడు నా దారిలోకి వస్తుంది ఆత్మతో నేను ఈ ముల్లోకాలనే జయిస్తాను మనుషుల ప్రాణాలు అంటే నాకు అనువంతా అని ఘోర అంటాడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హాని చేయని అమ్మగారితో ఈ దుర్మార్గులు చెడ్డ పనులు చేయిస్తారా అని నీలా బాధపడుతుంది. కట్ చేస్తే, ఇంతలో భాగమతి మంగళ దగ్గరికి వెళ్లి నాన్న ఎక్కడ పిన్ని అని అడుగుతుంది. మీ నాన్న పనికి పోయాడు అని వాళ్ళ పిన్ని చెప్తుంది. నాన్న పనికి పోతున్నాడా అదేంటి పిన్ని ఎక్కడ చేస్తున్నాడు నేను డబ్బులు పంపిస్తున్నాను కదా అని కంగారుపడుతూ అడుగుతుంది భాగమతి. పనికి పోలేదమ్మా పని ఉండి బయటికి పోయాడు అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights
Nindu Noorella Saavasam Today Episode  January 1st 2024 Episode 121 Highlights

అవును బాగి పని ఉండి బయటికి వెళ్ళాడు అని అక్క చెప్తుంది అని వాళ్ళ మామయ్య అంటాడు. అవును బాగి నేను ఇప్పటి నుంచే పనిలో జాయిన్ అవుతున్నాను ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి చేసుకొని పోవాల్సిన పిల్లవి తర్వాత మాకు డబ్బులు పంపించ లేవు కదా అని వాళ్ళ పిన్ని అంటుంది. పిన్ని నాకు ఇప్పుడు అంతలా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని భాగమతి అంటుంది. నీకు లేకపోయినా తల్లిదండ్రులుగా మాకు బాధ్యత ఉంటుంది కదా అమ్మ అని మంగళ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella