NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vidadala Rajini: వైసీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు – మంత్రి రజిని

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు. కొత్త గా నిర్మించిన విడతల రజిని కార్యాలయాన్ని నూతన సంవత్సరం రోజున ప్రారంభోత్సవ చేయాలని భావిస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి టీడీపీ, జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేసారు. ఫ్లెక్సీలు చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, పార్టీ నేతలతో కలిసి సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు.

ఈ సందర్భంగా  మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ .. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బీసీ మహిళనైన తనను దాడులతో భయపెట్టలేరని అన్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని అన్నారు. అధికార దాహంతో ఈ దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు.  ఇటువంటి వ్యక్తులకు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో  ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.

తాను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాననీ, ప్రజల మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటానని అన్నారు రజిని. ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ లు బీసీలపై కపట ప్రేమ వలకబోస్తున్నారని విమర్శించారు. బీసీ మహిళా మంత్రిగా ఉన్న తన కార్యాలయంపైనే దాడి చేయించారన్నారు. బీసీలంటే ఎంత చిన్న చూపో దీన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతోందన్నారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ దొడి కొనసాగించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడూతూ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఒక వైపు జయహో బీసీ అంటారు. మరో వైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతున్నారని అన్నారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకూ లేదని అన్నారు. బీసీ మహిళ పోటీ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

PSLV –C58: పీఎస్ఎల్‌వీ సీ – 58 ప్రయోగం విజయవంతం

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju