New Year Stocks – Yes Bank: కొత్త సంవత్సరం ఎస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టినవారికి బాగా కలిసివొచ్చింది…జనవరి 1st 2024 రోజు ట్రేడింగ్ మొదలైన మొదటి గంటలో సుమారు 7.2% పెరిగిన ఎస్ బ్యాంకు షేర్లు 23 రూపాయలకు చేరుకొని నూతన సంవత్సరంలో కొత్త జోరు అందుకుంది.
డిసెంబర్ మొదటిలో ఎస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టినవారికి 20% శాతం వరకు లాభాలు పొందే అవకాశం దొరికింది…గత 6 నెలల్లో 38% పెరిగిన ఎస్ బ్యాంకు బుల్లిష్ ట్రెండ్ లో ఉంది…అయితే తాజాగా ఎస్ బ్యాంకు విడుదల చేసిన వార్త ఒకటి ఎస్ బ్యాంకు కు బ్రేకౌట్ ఇచ్చింది అని చెప్పాలి…
జనవరి 1st రోజు ఎస్ బ్యాంకు షేర్లు పెరగడానికి కారణం…కొత్తగా కంపెనీకి వచ్చిన 150 కోట్ల రూపాయల కాపిటల్…ఎస్ బ్యాంకుకు చెందిన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ డిసెంబర్ 17న వేలంకి పెట్టగా అవి అమ్ముడుపోయి 150 కోట్ల రూపాయలు వచ్చింది…కొత్త సంవత్సరం మంచి వార్తతో మొదలవ్వడంతో ఎస్ బ్యాంకు షేర్లు జోరు కొనసాగుతుంది.