NewsOrbit
జాతీయం న్యూస్

PSLV –C58: పీఎస్ఎల్‌వీ సీ – 58 ప్రయోగం విజయవంతం

PSLV –C58:  నూతన సంవత్సరం రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి పీఎస్ఎల్వీ – సీ 58 వాహన నౌక ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహంతో సోమవారం ఉదయం 9.10 గంటలకు అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పీఎస్ఎల్వీ రాకెట్ బయలుదేరింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్ పోశాట్ ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్ పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కళాశాల విద్యార్ధినులు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అంతరిక్ష రహస్యాల కోసం ఈ ఎక్స్ పోశాట్ ను రూపొందించారు. ఇది టెలిస్కోప్ మాదిరిగా పని చేస్తూ ఖగోళంలోబ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధన చేయనుంది. కాగా ఎక్స్ పోశాట్ జీవిత కాలం అయిదేళ్లు.

ఇస్రో ప్రయోగించిన తొలి పొలారిమెట్రీ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019 లో చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్ కే పోలారిమెట్రీ ఎక్స్ ప్లోరర్ (ఇఎక్స్ పీఈ) తర్వాత మరో దేశం చేపట్టిన పోలారిమెట్రీ మిషన్ ఇదే కావడం గమనార్హం. కాగా ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకూ 59 పీఎస్ఎల్వీ ప్రయోగాలు జరిగాయి. ఇది 60వది. పోలార్ శాటిలైట్ లాంచి వెహికల్ ప్రయోగాలు ఇప్పటి వరకు పీఎస్ఎల్వీకి బాగా కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాది పీఎస్ఎల్వీ ప్రయోగాలతోనే ప్రారంభించడం గమనార్హం.

YSRCP: తండ్రీ తనయుల మధ్య టికెట్ వార్ ..అమలాపురం వైసీపీలో ఆసక్తికరంగా మారిన రాజకీయం

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!