Nindu Noorella Saavasam november 11 episode 78: గుప్తా గారు అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది ఎందుకలా ప్రవర్తిస్తుంది అస్సలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అరుంధతి అంటుంది. మనోహరి అని తుఫాను ఎవ్వరు తట్టుకోలేరు బాలిక ఇప్పుడే ఆ బాలిక ఆట మొదలు పెట్టినది ఎలా ముగుస్తున్నదో ఆవిడకే తెలియవలెను అయినా తెలియని దాని గురించి ఆలోచించి నీవు వృధా ప్రయాస పడకు బాలిక అని గుప్తా అంటాడు.అరుంధతి గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ మనోహరి ఏం చేస్తుందని ఆలోచిస్తూ ఉండగా.ఇంతలో భాగమతి బయటికి వచ్చి అరుంధతిని చూసి ఈవిడ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళింది అని ఇంట్లో వాళ్ళందరిని పిలిచి ఇప్పుడు చూపెడతాను ఆవిడని అని లోపలికి వెళ్ళిపోతూ మళ్లీ ఆలోచించి ఇప్పుడు అందరూ బాధలో ఉన్నారు ఇప్పుడు కాదులే ఇంకెప్పుడైనా పరిచయం చేస్తాను , కానీ పొద్దున నాకు ఎందుకు కనపడలేదొ అడుగుతాను అని భాగమతి దగ్గరికి వెళ్తుంది. తన రాకను గమనించిన అరుంధతి పువ్వులు తెంపుతున్నట్టు నటిస్తుంది.

అక్క అసలు నువ్వు ఏ పక్కింటి ఆవిడవు రాథోడ్ గారు పక్కింటి వాళ్ళందరిని పిలుచుకు వచ్చాడు వాళ్లలో నువ్వు లేవు ఏంటి పొద్దున నన్ను అందరూ పిచ్చిదానిలా చూశారు ఇక్కడే ఉన్నట్టుంటావు కానీ సమయానికి మాత్రం రావు అసలు నువ్వు ఏ పక్కింటి ఆవిడవి అక్క అని భాగమతి అడుగుతుంది. భలేగా ఇరుక్కున్నది బాలిక ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుందో చూద్దాం అని గుప్తా అనుకుంటాడు. అంటే ఏంటి చెల్లి నన్ను అనుమానిస్తున్నావా పదా ఇప్పుడే వెళ్లి మాట్లాడదాం అని అరుంధతి గబగబా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా. అక్క ఇప్పుడు వద్దులే ఇప్పుడు అందరూ బాధలో ఉన్నారు ఇంకెప్పుడైనా వాళ్లను పరిచయం చేస్తాను అని భాగమతి అంటుంది. ఏమి వద్దు చెల్లి ఈరోజు మాట్లాడదాం పద అని అరుంధతి అంటుంది. అక్క ఆగు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దు అని భాగమతి అంటుంది. అయితే ఇంకెప్పుడు నన్ను అనుమానించావు కదా అని అరుంధతి అంటుంది. లేదక్కా ఇంకెప్పుడూ నేను అనుమానించను అని భాగమతి అంటుంది.

కానీ అక్క ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది మనోహరి గారు మేడం పేరు చెప్పి ఉపవాసం ఉన్నానని అబద్ధం చెప్తుంది ఇందాక మెట్ల నుంచి పడిపోవటం కూడా అంత యాక్టింగ్ అక్క అసలు ఆవిడ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు ఆవిడకి ఆ నెలవంక తోడు అని భాగమతి అంటుంది. అవునా చెల్లి అని అరుంధతి అంటూ ఉండగా రాథోడ్ వస్తాడు. రాథోడ్ రాకని గమనించిన అరుంధతి చెల్లి నాకు పని ఉంది మళ్లీ రేపు కలుద్దాం అని వెళ్ళిపోతోంది. రాథోడ్ గారు పిల్లలు స్కూల్ కి వెళ్లనని మారం చేశారా ఇప్పుడు పర్వాలేదా బాగానే ఉన్నారా మీరు అప్పుడే ఎందుకు వచ్చారు సార్ అక్కడే ఉండమన్నారు కదా వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారా అని భాగమతి అంటుంది. లేదమ్మా వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకొని నాన్న బాధపడతాడని నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఇంత చిన్న వయసులోనే వాళ్లకు ఎంత పెద్ద గుణం వచ్చింది చూడమ్మా లేని అమ్మని తలుచుకొని ఉన్న నాన్న బాధపడతాడని వాళ్లు ఆలోచిస్తున్నారు అని రాథోడ్ అంటాడు. రాథోడ్ గారు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని భాగమతి అంటుంది. అడగమ్మా చెప్తాను అని రాథోడ్ అంటాడు.

రాథోడ్ గారు మనోహరికి ఈ ఇంటికి ఏమిటండీ సంబంధం మేడం గారు కూడా చచ్చిపోయాక ఇక్కడే ఎందుకు ఉంటుంది, పరాయి వాళ్ళ ఇంట్లో పెత్తనం చెలాయించాలని ఎందుకు అనుకుంటుంది అని భాగమతి అడుగుతుంది. ఏమోనమ్మా నాకు తెలియదు మొదట్లో మేడం గారికి పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉండేది అమ్ములు పాపా పుట్టాక అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. ఆ తరువాత సడన్గా ఐదేళ్లు పాటు కనపడడం మానేసింది ఒకరోజు సడన్గా కొడైకెనాల్లో ప్రత్యక్షమైంది అప్పటినుంచి తరచుగా వస్తూ ఉంటుంది మేడం గారు వెళ్ళిపోయాక ఇక్కడే ఉంటుంది అని రాథోడ్ అంటాడు. అవునా ఐదేళ్లపాటు కనిపించని ఆవిడ ఎందుకు మళ్ళీ వచ్చింది ఏం చేయాలనుకుంటుంది అని భాగమతి అంటుంది. ఏమోనమ్మా ఎప్పుడు ఆమె నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. బాలిక ఐదేళ్లుగా అజ్ఞాతవాసంలోకి వెళ్లిన ఆ బాలిక ఏమి చేసినదో ఎవరికీ తెలియదా అని గుప్తా అంటాడు. అవును గుప్తా గారు హాస్టల్ కి వెళ్లి మా ఫ్రెండ్స్ ని అడిగాను కానీ తను ఎక్కడుందో ఏం చేసిందో ఎవరికీ తెలియదు అని అరుంధతి అంటుంది.కట్ చేస్తే, అమ్మగారు మీకు ఇంతకుముందు పెళ్లి అయ్యిందా అని నీలా అడుగుతుంది.

ఆ మాట వినగానే మనోహరి గబగబా పరిగెత్తికెళ్ళి డోర్లు కిటికీలు అన్ని మూసేస్తుంది. రాథోడ్ గారు భాగమతిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకే అలా అడిగావు అని మనోహరి అంటుంది. అంటే అమ్మ పెళ్లయిన ఆడదే మెట్టెలు పెట్టుకుంటుది నీ వేళ్ళకి మెట్టలు పెట్టుకున్న గుర్తులు ఉన్నాయమ్మా అని నీలా అంటుంది. ఆ మాటకి మనోహరి కి కోపం వచ్చి కడుపులో ఒక తన్ను తన్నుతోంది. తన్ని మెడ పట్టుకొని పిసికి బయటికి నెట్టేస్తుంది. ఏంటి రాథోడ్ గారు ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చారు అని భాగమతి అడుగుతుంది. మనోహరి గారికి నిజంగా పెళ్లయితే ఆ నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా బయటపడుతుంది లేదంటే మనిషిని దహించేస్తుంది ఆమెని ఎదురుగా ఢీకొట్టలేము పథకం ప్రకారం ఏం చేయాలో ఆలోచిద్దాం అని రాథోడ్ అంటాడు.

కట్ చేస్తే,స్కూల్లో పిల్లలందరూ అన్నం తింటూ ఉంటారు వాచ్మెన్ కూడా అన్నం తిందామని బాక్స్ మూత తీస్తే అన్నం కుళ్ళిపోయి ఉంటుంది. భాగమతి వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడికి చికెన్ కూర వండి పెడుతుంది. అక్క నువ్వు పైకి కోప్పడతావు కాని బావ మీద నీకు ఎంత ప్రేమ పని చేస్తున్నాడని చికెన్ వండి పెట్టావా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. ఇప్పుడే వండాను రా మీ బావకి రాత్రి వండిన చద్దన్నం ఉంటే పెట్టాను అని అంటుంది. అదేంటి అక్క ఈపాటికి కుళ్ళిపోయి ఉంటుంది కదా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. ఆయన చేసే జీతానికి లేచి వేడి అన్నం వండి పెడతానా అని వాళ్ళ అక్క అంటుంది. స్కూల్లో వాచ్మెన్ అన్నం తినకుండా మూత పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే. అమ్ములు పిలిచి తాత నీ బాక్స్ నేను తింటాను నా బాక్స్ నువ్వు తిను అని మూత తీసి చూస్తుంది. కుళ్లిపోయిన వాసన వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది