NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 6 2023 episode 73: మనోహరి చేతుల్లో బలైపోయిన నీలా

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

Nindu Noorella Saavasam November 6 2023 episode 73: కావాలనే నేను చదవట్లేదు నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మిస్సమ్మని డాడీ ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు కదా ఎలా ఉంది ఈ మాస్టర్ అంజు వేసిన ప్లాను అని అంజు అంటుంది. కానీ నువ్వు వేరే స్కూల్ కి వెళ్తావు కదా నీకోసం నువ్వే నా చదవవే అని అమృత అంటుంది. అమ్ములు చదవాలంటే కాస్త ఎంజాయ్మెంట్ కావాలి నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయవే అని అమ్ముని  అంజు అంటుంది. ఏంటి అని అమ్ము అంజు వంక కోపంగా చూస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో నీళ్ల దగ్గర చూపిస్తా పదండి అని అంజు వాళ్ళ ముగ్గుని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, నీలా అనుకుంటూ అంజు లోపలికి వచ్చి ఏంటి నీలా ఇలా అయిపోయావు గలగల మని ఇల్లంతా తిరిగే నీవు ఇలా మూలన పడ్డావు ఏంటి అని అంటుంది.

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights
Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

ఏం చేయను పాప ఏ జన్మలో చేసుకున్న పాపం ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను అని నీలా అంటుంది. ఏ జన్మలోనో చేసుకున్న పాపమే ఇలా అనుభవిస్తే మరి ఈ జన్మలో చేసే పాపం ఇంకెలా అనుభవిస్తావు నీలా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది అంజు. ఇంతలో మనోహరి అక్కడికి వచ్చి పిల్లలు మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. నీలా ఆంటీకి ఎలా ఉంది అని పరామర్శించడానికి వచ్చాము అని అంజు అంటుంది. దానికి ఏంటమ్మా నాతో సేవలు చేయించుకుంటూ బాగానే ఉంది మీరు వెళ్లి చదువుకోండి అని మనోహరి అంటుంది. మేము కొడైకెనాల్లో ఉన్నప్పుడు మా పనిమనిషి కూడా ఇలాగే గాయాలయి మంచాన పడి అమ్మతో సేవలు చేయించుకున్నది తను బాగాయాక కూడా అమ్మతో అలాగే పని చేయించుకునేది ఏంటి ఇన్ని రోజులైనా ఈ పనిమనిషి ఇంకా బాగవలేదా అని అమ్మ ఒకరోజు కనిపెట్టి తనని పని మాన్పించేసి ఇంటికి పంపించేసింది అని అంజు అంటుంది.

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights
Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

అమ్మగారు అప్పుడు చేసింది అక్కడ ఉన్న పనిమనిషి నేను కాదు అమ్మగారు అని నీలా అంటుంది. ఇలాగే కూర్చుంటే ఎలా నడుస్తావు బొమ్మ లే అని మనోహరి కోపంగా నీలా ని లేపి నిలబెడుతుంది. దెబ్బలు బాగా తగిలిన నీలా నిలబడలేక సోపాలో కూలబడిపోతుంది. ఇలా కూర్చుంటే ఎలా నీలాంటి రోజు నడిస్తేనే కదా ఆంటీ లేనప్పుడు కూడా నువ్వు నడవగలవు అని అంజు అంటుంది. అవును కదా లే నీలా నడువు అని అటు ఇటు నడిపిస్తుంది మనోహరి.నడవలేని నీలాను చూసి పిల్లలు నలుగురు నవ్వుతూ ఉంటారు. కట్ చేస్తే భాగమతి అమరేంద్ర రూంలోకి వెళ్లి అరుంధతి ఫోటో వెతుకుతుంది. ఇంతలో అమరేంద్ర ఫోన్ మాట్లాడుకుంటూ తన రూమ్ లోకి వస్తాడు. తన రాకను గమనించిన భాగమతి మంచం చాటుకు వెళ్లి దాక్కుంటుంది. గుప్తా గారు ఏదో ఒకటి చేయండి ఇప్పుడు ఆయన రూమ్ లోకి వచ్చారు ఎలా అని అరుంధతి టెన్షన్ పడుతుంది.

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights
Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

బాలిక ఇప్పుడు మనం ఏమి చేయలేము మీవారు లోపలికి వెళ్లి డోర్ పెట్టుకున్నారు నన్ను ఏమి చేయమందువు అని గుప్తా అంటాడు. అమరేంద్ర ఫ్రెష్ అప్ అవుదామని బట్టలు విప్పుతూ ఉంటాడు. అమరేంద్ర ఏం చేస్తున్నాడని తొంగి చూసిన భాగమతి బాగి ఈరోజు నీ దరిద్రం డాన్స్ కాదే దాండియా ఆడుతుంది అని తల కొట్టుకుంటుంది. ఫ్రెష్ అప్ అవుదామని అమరేంద్ర బాత్రూం లోకి వెళ్తూ ఉండగా సార్ అంటూ రాథోడ్ వస్తాడు. సార్ కారు తుడిచాను మీరు వస్తే బయలుదేరుదాము అని రాథోడ్ అంటాడు. 10 నిమిషాల్లో వస్తాను వెయిట్ చేయి అని అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఫోన్ మోగుతుంది. నేను మాట్లాడుతాను సార్ మీరు వెళ్లి స్నానం చేయండి అని రాథోడ్ వెళ్లి ఫోన్ తీయబోయే సరికి భాగమతి కనిపిస్తుంది. భాగమతిని చూసినా రాథోడ్ గట్టిగా అరుస్తాడు. ఏంటి రాథోడ్ అంతలా భయపడుతున్నావు అక్కడ ఏముంది అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదు సార్ బొద్దింక కనిపించింది అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights
Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

బొద్దింకను చూసి అంతలా భయపడతావా అని రాథోడ్ అని అమరేంద్ర వెళ్ళిపోతూ ఉంటాడు.ఇప్పుడు మీరు ఈ రూమ్ లో బట్టలు విప్పరా సార్ అని రాథోడ్ అంటాడు. అవును ఇక్కడే బట్టలు విప్పాను ఎందుకు అలా అడిగావు అని అమరేంద్ర అంటాడు. అంటే సార్ బొద్దింక ఉన్నట్టే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు కదా అని రాథోడ్ అంటాడు. నా రూమ్ లో ఎవరు ఉంటారు రాథోడ్ మీ పిచ్చి గాని మీరు వెళ్ళండి నేను వస్తాను అని అమరేంద్ర బాత్రూం లోకి వెళ్ళిపోతాడు. అమరేంద్ర బాత్రూం లోకి వెళ్ళగానే రాథోడ్ గబగబా పరిగెత్తుకొచ్చి భాగమతిని ఏంటమ్మా నేను ప్రశాంతంగా ఉండడం నికు ఇష్టం లేదా నిన్ను ఇక్కడ ఆయన చూస్తే నన్ను షూట్ చేసి పారిస్తారు అయినా ఈ గదిలోకి ఎందుకు వచ్చావు అని రాథోడ్ కోపంగా అంటాడు. అంటే ఫోటో వెతుకుదామని వచ్చాను సార్ ఈ లోపు ఆయన వచ్చేసరికి ఇక్కడ దాక్కున్నాను క్షమించండి అని భాగమతి వినయంగా అంటుంది. సార్ రాకముందే నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights
Nindu Noorella Saavasam today episode November 6 2023 episode 73 highlights

కిటికీలో నుంచి అంతా చూస్తున్న అరుంధతి హమ్మయ్య అని అనుకుంటుంది. ఏంటి బాలిక బట్టలు విప్పినది ఆ బాలిక చూచినదని నీవు అనుకున్నావా లేక నీవు చూచితివా అని గుప్తా అంటాడు. గుప్తా గారు అని కోపంగా అరుంధతి తన వంక చూస్తుంది. కట్ చేస్తే, నీలా వంట ఎలా చేయాలో నేను అడుగుతాను నువ్వు ఈ ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని నాకు చెబుతూ ఉండు అని మనోహరి అంటుంది. నాకే కొంచెం కొంచెం వస్తుందమ్మ గారు ఇక మీకేం చెప్పను అని నీలా అంటుంది. నోరు మూసుకొని చెప్పవే అని మనోహరి వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి లైటర్ తో వెలిగిస్తు ఏంటే నీలా గ్యాస్ వెలగట్లేదు ఇకా వంట ఎలా చేస్తాను ఆన్లైన్లో బుక్ చేస్తానులే అంటూ మనోహరి వెళ్ళిపోతుంది. మనోహరి గ్యాస్ బంద్ చేయకుండా వెళ్లిందని అరుంధతి కంగారుపడుతూ వెళ్లి భాగమతిని పిలుస్తుంది. ఇంతలో నిర్మల వాళ్ళ ఆయనకి కాఫీ పెడదామని కిచెన్ లోకి వెళుతుంది. విషయం తెలిసిన భాగమతి గబగబా పరిగెత్తుకొచ్చి ఆంటీ మీరు ఇందులోకెందుకు వచ్చారు బయటికి రండి అని ఆవిడని తీసుకువచ్చి భాగమతి మళ్లీ లోపలికి వెళ్లి కిటికీలు తీసి గ్యాస్ బంద్ చేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu