Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి, అను ఇతని అరవింద కు అప్పచెప్పి పార్వతి ఇంటికి వెళుతుంది. అరవింద విక్కీ ఆర్య ఎలాగో పద్మావతి అను కూడా నాకు అలానే అని పార్వతికి మాట ఇస్తుంది. అరవింద విక్కీ తో నువ్వు పద్మావతి తో బాగుంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్తుంది.

ఈరోజు 412 ఎపిసోడ్ లో అరవింద కు ఇచ్చిన మాట కోసం విక్కీ పద్మావతికి అన్నం తీసుకుని వస్తాడు. పద్మావతి అన్నం తినడానికి ఇష్టపడదు విక్కీ బలవంతంగా అన్నం పెడతాడు. శాడిజన్లో కూడా వేరియేషన్స్ ఉంటాయా అని అంటుంది పద్మావతి. మీరు తిడితే పడ్డానికే కదా నేనున్నాను అని అంటుంది పద్మావతి. నేనేం కావాలనే తిట్టలేదు పద్మావతి నువ్వు చేసిన పనికి నిన్ను అలా అనాల్సి వచ్చింది. వెనకా ముందు చూసుకోకుండా అందమైన మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా అని అంటుంది పద్మావతి. అప్పుడు నేను మీ అమ్మగారు ఉన్న విషయం మర్చిపోయాను ఆవేశం లో అలా అనాల్సి వచ్చింది.
Nuvvu nenu Prema: కూతుళ్ళని అరవిందాకు అప్పచెప్పిన పార్వతి..అరవింద ని చంపడానికి కృష్ణ ప్లాన్.

విక్కీస్వార్థం..
పద్మావతి వికీ భోజనం తీసుకురావడానికి చాలా సంతోషించి, నాకు మీరు భోజనం తీసుకురావడానికి నేనంటే మీకు అభిమానమా గౌరవమా లేక ప్రేమా అని అడుగుతుంది. అవేమీ కాదు స్వార్థం అని చెప్తాడు విక్కి.మా అక్కకి నేను ఇచ్చిన మాట కోసం నీకు భోజనం తీసుకొచ్చాను ఒక ఆరు నెలలు మాత్రమే మనం కలిసి ఉండేది ఆరు నెలల తర్వాత నువ్వు ఎవరో నేనెవరో, ఈ ఆరు నెలల్లో నేను చేసే పనులకి నువ్వు ఎక్కువ ఊహించుకోకు, అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్కి. పద్మావతి ఆ మాటలకి చాలా బాధపడుతుంది శ్రీనివాస్ బండరాయినా కరుగుతుంది కానీ ఈ మనిషి మనసు మాత్రం కరిగేలా లేదు, ఈ ఆరు నెలలు తొందరగా అయిపోవాలి అని అనుకుంటుంది.
Brahmamudi 197 ఎపిసోడ్: కావ్యకి నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన రాజ్.. రాహుల్ ఆచూకిని కనిపెట్టేసిన కనకం!

రాఖీ పండగ ఏర్పాట్లు..
అరవింద చాలా సంతోషంగా ఉంటుంది. కృష్ణ వచ్చి ఏంటి ఈరోజు రాణమ్మ ముఖం విరిగిపోతుంది అని అంటాడు. ఈరోజు రాఖీ కదండి నేను ఈ పండగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. నా తమ్ముళ్ళకి నా చేత్తో రాఖీ కట్టడం అంటే, నాకు చాలా సంతోషం కదా అందుకోసమే అని అంటుంది. వెంటనే కృష్ణ మనసులో అంటే మీరంతా సంతోషంగా ఉంటారు అన్నమాట, ఈ సంతోషానికి ఎక్కువ సేపు ఉండదు లే రానమ్మ అని అనుకుంటాడు మనసులో,ఏంటండీ మాట్లాడకుండా అలానే ఉన్నారు అని అంటుంది అరవింద్ ఏం లేదు మీ తమ్ముళ్ళ గోలలో పడి నన్ను మర్చిపోవు కదా అని అంటాడు అలాంటిదేమీ లేదు లేండి అంటుంది అరవింద. మీరు నా ఊపిరి అండి మీరు లేకపోతే నేను లేను. ఈరోజు నేను గుడికి వెళుతున్నానండి అని అంటుంది. మీరు కూడా నాతో పట్టే రండి అని అంటుంది సరే అంటాడు కృష్ణ. అప్పుడే పద్మావతి వస్తుంది. అరవిందతో పద్మావతి ఏంటా మీరు ఇంతసేపైనా కిందకి రాలేదనుకున్నాను. మీకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం కదా ఈ పండక్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారా అని అంటుంది. అవును పద్మావతి నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం అని అంటుంది. మీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది లేండి అని అంటుంది పద్మావతి. పద్మావతి అరవింద్ తో మీ ఈ పండక్కి మీ తమ్ముళ్లు మీకు భారీగా బహుమతులు ఇస్తారు కదా అందులో సగభాగం నాకు ఇవ్వండి అని అంటుంది దాందేముంది పద్మావతి మొత్తం తీసుకోండి అని అంటుంది. మొత్తం వద్దులేండి ఎట్లైనా అర్ధ భాగం కదా ఆడపడుచు అంటే అందుకని నాకు సగం ఇవ్వండి చాలు అని అంటుంది. దానికి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.
Krishna Mukunda Murari: అటు మోడ్రన్ డ్రెస్ లోను ఇటు లంగా వోని లోను అదరగొడుతున్న యశ్మీ గౌడ(ముకుంద )

అరవింద కోసం విక్కీ బహుమతి..
విక్కీ అరవింద కోసం ఒక బంగారు నగరం తీసుకొని వచ్చి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ రూమ్ లోకి పద్మావతి వస్తుంది. పద్మావతి పద్మావతి రాగానే విక్కీ ఆ బహుమతిని వెనకాల దాచేస్తాడు. ఏంటి సారు మీ ఇంట్లో మీరు దొంగతనం చేశారా ఏంటి దాచి పెడుతున్నారు అని అంటుంది కాస్త నోరు మూస్తావా అని అంటాడు విక్కీ వెంటనే పద్మావతి విక్కీ నోరు మూస్తుంది నా నోరు కాదు విజయముంది నీ నోరు అని అంటాడు విక్కీ. నన్ను చూడగానే ఏదో దాచి పెడుతున్నారు కదా అదేంటని అని అంటుంది. ఏదో దాచి పెడుతున్నారు కదా అదేంటో చూపిస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని అంటుంది. ఓ నాకు అర్థమైంది ఈరోజు రాఖీ పండగ కాబట్టి అరవింద్ గారి కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు కదా అని అంటుంది. అది నీకు అనవసరం అని అంటాడు విక్కీ. తాళి కట్టిన భార్యవని నీలో సగం నేను నాలో సగం నువ్వు అని సెంటిమెంట్ డైలాగులు కడతావా ఏంటి? నీకు అంత సీన్ లేదు అని అంటాడు విక్కి. మీకు అంత సీన్ లేదు సార్ ఎందుకంటే మీ గుండె కాదు గుండ్రాయి. అయినా మీరు ఆ గిఫ్ట్ చూపించక పోయినా పర్లేదు కానీ దాంట్లో సగం నాదే, నిజం చెప్తున్నా ఆ గిఫ్ట్ లో సగం నాదే, ఇందాక అరవింద గారితో డీల్ మాట్లాడుకున్న వచ్చిన గిఫ్టులలో సగం నాది సగం నీకు అని, మా అక్క కోసం నేను ఎంతో ప్రేమతో కన్నా గిఫ్ట్ ఇది, ప్రాణం పోయినా నీకు చేరనివ్వను. మీరు ప్రేమతో అరవింద్ గారికి ఇవ్వండి అరవింద్ గారు నాకు ప్రేమతో ఇస్తారు. దానికోసం ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.అప్పుడే అక్కడికి ఆర్య కూడా వస్తాడు. ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అంటాడు. త్వరగా రా అక్క రెడీ అయ్యే లోపు మనం దానికి సప్రైజ్ ఇద్దామనుకున్నాం కదా, ఈ పండుగని అక్కెప్పటికి మర్చిపోకూడదు వెళ్దాం పద అని అంటాడు.

అరవింద్ కు సప్రైజ్ ఇచ్చిన విక్కీ ఆర్య..
అరవిందగుడికి వెళ్లడానికి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది.అరవింద మెట్ల మధ్యలో ఉండగా విక్కీ ఆర్య ఇద్దరు ఆమె మీద పూలవర్షం కురిపిస్తారు. అక్కడే ఉండు అక్క అని ఇద్దరు వెళ్లి అరవిందని ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటారు. అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అరవింద్ అలా ఎత్తుకొని తీసుకొస్తుంటే అను పద్మావతి ఇద్దరు పూల వర్షం కురిపిస్తూ ఉంటారు వాళ్ళ మీద, అది చూసి ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు కృష్ణ మాత్రం మనసులో చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. అక్కంటే ప్రాణం ఇచ్చే ఇద్దరు తమ్ముళ్లు ఉండంగా అరవింద్ కి ఏమీ కాదు అని అంటాడు నారాయణ. అందుకే మామయ్య మా రాణమ్మ నాకన్నా ఎక్కువ తమ్ముళ్లనే చూసుకుంటుందిఅని అంటాడు కృష్ణ.మిమ్మల్ని ఇంత బాగా చూసుకునే తమ్ముళ్ళు దొరకడం నిజంగా మీ అదృష్టం అంటుంది పద్మావతి. నా సంతోషం కోసం వీళ్ళిద్దరూ ఎంత కష్టాన్నయినా భరిస్తారు అని అంటుంది అరవింద. నాకే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు, నాకోసం ప్రాణం పెట్టి వీళ్ళు ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నాకు తమ్ముళ్లగానే రావాలిఅని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది అరవింద. మీ మంచి మనసుతో ఏది కోరుకున్న అది జరిగి తీరుతుంది అని అంటుంది అను. మీ బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అంటుంది పద్మావతి. వీళ్ళ బంధాన్ని నేను విడదీసి తీరుతాను అని అనుకుంటాడు కృష్ణ మనసులులో, రాఖీ కట్టమంటుంది కుచల ఇప్పుడే కాదు పిన్ని గుడికి వెళ్లి వచ్చి కడతాను అని అంటుంది.
అరవింద కి తోడుగా పద్మావతి..
అందరూ కలిసి గుడికి వెళ్దాం అనుకుంటారు అప్పుడే నారాయణ మీరిద్దరూ బయటికి వెళ్లడానికి వీల్లేదు రాఖీ కట్టిన తర్వాతే, మీరు బయటికి వెళ్ళాలి అని అంటాడు నారాయణ. అరవింద్ ఒక్కదాని గుడికి పంపించడం ఇష్టం లేదంటాడు విక్కీ. అరవింద్ తో పాటు నేను వెళ్తాను గుడికి అని అంటుంది పద్మావతి. కుచల అందుకు ఒప్పుకోదు. నారాయణ వాళ్ళు వెళ్తామంటే నువ్వు ఒప్పుకోవు ఎందుకని వెళ్ళనివ్వు అని అంటాడు దానికి కుచేలా సరే అంటుంది పద్మావతి డ్రైవర్ ని పిలుస్తాను ఉండండి అరవింద్ గారు అని అంటుంది ఎందుకు నేనున్నాను కదా నేనే తీసుకెళ్తాను అంటాడు కృష్ణ.పద్మావతికి ఇష్టం లేకపోయినా కృష్ణ అరవింద తో కలిసి గుడికి బయలుదేరుతుంది. కృష్ణ మనసులో మీ ఆనందాన్ని ఈరోజు తో సమాధి చేస్తాను అని అనుకొని బయలుదేరుతాడు.
అరవింద కు అపాయం..
కృష్ణ కారులో డ్రైవింగ్ చేస్తూ పద్మావతిని చూస్తూ ఉంటాడు. పద్మావతి వీడు మాత్రం ఎప్పటికీ మారడు అని అనుకుంటుంది మనసులో,కృష్ణ గారు మీ చూపు ఎటో ఉంది కాస్త ముందు చూసి నడపండి అని అంటుంది పద్మావతి వెంటనే అరవిందా ఏమైందండీ ఎక్కడ చూస్తున్నారు అని అంటుంది ఏం లేదురా ఒక కేసు గురించి ఆలోచిస్తున్నాను అని కవర్ చేస్తాడు కృష్ణ. అరవింద పద్మావతి మీకు రాఖీ కట్టడానికి బ్రదర్స్ ఎవరు లేరు కదా అని అంటుంది.మీకు తెలుసు కదా అండి ఎవరూ లేరు దానికే నా బాధ,ప్రతి రాఖీ పండక్కి మీరేమో రాఖీ కడుతూ ఉంటే నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని ఎప్పుడూ అనిపిస్తుంది అరవింద్ గారు అంటుంది పద్మావతి.అదేము నన్ను అనాధలా పుట్టించారు. అని బాధపడుతుంది పద్మావతి వెంటనే అరవిందా ఎందుకు బాధ పడుతున్నారు మీకు దేవుడిచ్చిన అన్నయ్య మీ ముందే ఉన్నారు కదా అని అంటుంది. దేవుడిచ్చిన అన్నయ్య ఎవరండీ అని అంటుంది. ఇంకెవరు మా ఆయనే అని అంటుంది అరవింద. వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యే కృష్ణ కారాపుతాడు. అరవింద పద్మావతి తో ఈ రాఖీ పండక్కి మీరు రాఖీ కట్టడానికి మా ఆయన ఉన్నాడు. మీరు హ్యాపీగా ఈ పండగని మా ఆయనకి రాఖీ కట్టి సెలబ్రేషన్ చేసుకోండి అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో అరవింద చేతికి గాయాన్ని చూసి విక్కీ పద్మావతి మీద అరుస్తాడు. మీ అక్క చేతికి గాయం చూసి నన్ను అరుచ్చారు కదా, అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను ఇక నేను ఎప్పటికీ ఇంట్లో ఉండను అని అంటుంది.మీ ఇంటి దగ్గర టెంపుల్ చేసుకొని రేపు ఉదయాన్నే మా ఇంటికి వెళ్తాను అని అంటుంది. దానికి విక్కీ షాక్ అవుతాడు.