Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి తన అక్కను ఇబ్బంది పెడుతున్న కుచల లకు బుద్ధి చెప్పడం, అనుకి నిన్ను ఏడిపిస్తే ఎవరికైనా నేను ఇలానే బుద్ధి చెప్తాను అని చెప్తుంది పద్మావతి. పద్మావతి అను లకి విక్కీ ఆర్య గాజులు తొడగడం, ఇష్టం లేకపోయినా తన అక్క కోసం పద్మావతికి విక్కీ గాజులు తొడగడానికి సరే అంటాడు.

ఈరోజు 439 వ ఎపిసోడ్ లో, పద్మావతికి గాజులు తొడుగుతూ విక్కీ మా అక్క కోసం ఇదంతా చేస్తున్నాను నిజంగా నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ గాజులు వేస్తూ ఉంటాడు పద్మావతి ఎప్పటికైనా మీ ప్రేమని దక్కించుకుంటాను మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలిసిపోతుంది అని అనుకుంటుంది. ఆర్య కన్నా విక్కీ పద్మావతికి ఎక్కువ గాజుల తొడిగి పందెంలో గెలుస్తాడు. మీరందరూ చూశారు కదా మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ ఉన్నదో అని అంటుంది పద్మావతి.
Nuvvu Nenu Prema: కుచలని భయపెట్టిన పద్మావతి.. కుచల మీద నారాయణ కోపం..

విక్కీ కోసం డాన్స్ చేసిన పద్మావతి..
విక్కీ మాత్రం మనసులో నీ మీద నాకస్సలు ప్రేమ లేదు అని అనుకుంటాడు ఇదంతా అక్కడే ఉన్న కృష్ణ మీ ఇద్దరినీ కలపడానికి వీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విడగొట్టడానికి నేనున్నాను కదా అని అనుకుంటాడు.ఎలాగైనా మిమ్మల్ని విడగొట్టి తీరుతాను అని అనుకుంటాడు కృష్ణ మనసు లో ఇక విక్కీ కోసం పద్మావతిని డాన్స్ చేయమని అడుగుతుంది అరవింద. పద్మావతి ‘మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది’ అనే పాటకు డాన్స్ చేస్తుంది. డాన్స్ అయిపోగానే అందరూ వారి వారి రూమ్స్ కి వెళ్ళిపోతారు. విక్కీ మాత్రం కోపంగా పద్మావతిని ఇదంతా ఎందుకు అన్నట్టుగా చూసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

కృష్ణ డెవిల్ ప్లాన్..
కృష్ణ మనసులో పద్మావతి వాళ్లు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నా కళ్ళ ముందే మీరు అలా ఉంటే నేను చూసి తట్టుకోలేను. ఎలాగైనా మీ ఇద్దరినీ దూరం చేసి తీరుతాను.ముందు నీ గురించి కాకుండా అరవింద్ గురించి ఆలోచించాలి అరవింద్ కు అపాయం జరిగితే ఆటోమేటిక్గా నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకనే ఇప్పుడు అరవింద్ అని కింద పడేటట్టు చేసి కడుపు పోవడానికి కారణం ఈ ఇంటి కోడలు అడుగుపెట్టిన వేలా విశేషం అని మీ మీద ఏసి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తాను పద్మావతి అని అరవింద ను పడేయడానికి మెట్ల మీద నూనె పోసి, ఏమీ తెలియనట్టు పక్కకి వచ్చి అరవింద్ కి ఫోన్ చేస్తాడు. అరవింద ఏంటండీ ఫోన్ చేశారు అని అంటుంది ఏం లేదురానమ్మ నాకు అర్జెంటు పని ఉన్నది బయటికి వెళ్లాలి నువ్వు ఒకసారి కిందకి వస్తావా అని అంటాడు. మేడ మీద నుంచి అరవింద సరే వస్తున్నాను అని కిందకి దిగుతూ ఉంటుంది. ఇప్పుడు కచ్చితంగా కాలుజారి కింద పడుతుంది కడుపు పోతుంది నేను అనుకున్నది సాధిస్తాను అని కృష్ణ అక్కడే ఒక పక్కన నుంచుని అరవింద రావడని గమనిస్తూ ఉంటాడు.
Nuvvu Nenu Prema: కుచలని భయపెట్టిన పద్మావతి.. కుచల మీద నారాయణ కోపం..

అరవింద్ ను కాపాడిన పద్మావతి.
ఇక అరవింద మెట్లు దిగి వస్తూ ఉండగా సగంలోనే పద్మావతి ఆపుతుంది. ఏంటి పద్మావతి అని అంటుంది అరవింద ఏం లేదు ఎక్కడికి కంగారుగా వెళ్తున్నారు అని అంటుంది. ఏం లేదు మా ఆయన కింద నుంచి ఫోన్ చేశారు అర్జెంటుగా పని ఉన్నది అని అందుకే వెళ్తున్నాను అని అంటుంది అప్పుడే అరవింద కు కాలు జారీ పడబోతూ ఉండగా పద్మావతి గమనించి కింద నూనె ఉన్నట్టున్నది మీరు చూసుకోలేదు పక్కనుంచి రండి అని జాగ్రత్తగా అరవింద్ అను మెట్ల నుంచి కిందకు దించుతుంది. మీరు ఉండబట్టే సరిపోయింది పద్మావతి లేదంటే నాకు నా బిడ్డకు ఏమై ఉండేదో అని అంటుంది అరవింద. పర్వాలేదు వదిన నేనున్నాను కదా మీకేం కాకుండా చూసుకుంటాను అని అంటుంది పద్మావతి. అయినా మెట్ల మీదకి నూనె ఎలా వచ్చింది పద్మావతి అని అంటుంది అరవింద అవన్నీ ఎందుకులే వదినా అని అంటుంది. ఏది ఏమైనా మీరు నా ప్రాణాలు నా బిడ్డ ప్రాణాలు కాపాడారు అని పద్మావతి తో అంటుంది అరవింద. ఇక కృష్ణ కోసం బయటికి వెళ్తుంది అరవింద.
Krishna Mukunda Murari: ముకుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా భవానీ దేవి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

కృష్ణ ని అన్నయ్య అన్న పద్మావతి..
ఇక కృష్ణ తన ప్లాను పద్మావతి తిప్పి కొట్టినందుకు చాలా కోపంగా, మెట్ల మీద ఉన్న నూనె ఇంకెవరైనా చూస్తారేమోనని హడావిడిగా తుడుస్తూ ఉంటాడు. ఎవరు చేసిన కర్మ వార అనుభవించాల్సిందే అని నారాయణ గొంతుతో పద్మావతి అంటుంది. వెంటనే వెనుక నుంచి మామగారు గాని నేను చేసింది చూసేసాడా అని కృష్ణ కంగారుగా వెనక్కి తిరుగుతాడు.అక్కడ నారాయణ బదులు పద్మావతి ఉంటుంది. ఏంటి నువ్వు చేసిన పని నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా అని అంటుంది పద్మావతి. నువ్వు ఇక్కడ నూనె పోయడం నేను పైనుంచి చూసాను అందుకే అరవింద గారిని కాపాడను. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా అని అంటుంది. నువ్వేం అయినా అనుకో పద్మావతి నేను మాత్రం చేయాలనుకున్నది చేస్తాను అని అంటాడు. నీ గురించి అరవింద్ గారికి చెప్పడం నాకు క్షణాల్లో పని, కానీ నేను ఎందుకు చెప్పట్లేదు తెలుసా ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ కోసం, నువ్వు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉండగా అరవింద అక్కడికి వస్తుంది ఏంటి మా ఆయనతో జాగ్రత్తగా ఉండమంటున్నారు అని అంటుంది. వెంటనే కృష్ణ మొత్తం వినేసిందేమోనని కంగారు పడతాడు. పద్మావతి వెంటనే ఏం లేదు వదిన నువ్వు ఇందక కాలిజారి పడబోయారు కదా కడుపుతో ఉన్న భార్యని పెట్టుకొని మీరు ఈ పనులన్నీ ఎందుకు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను అన్నయ్యతో అని అంటుంది. కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అన్నయ్య అని పిలిచినందుకు,అవును వదిన అన్నయ్యతోనే చెప్తున్నాను వదినని జాగ్రత్తగా చూసుకోమని ఏమంటావ్ అన్నయ్య అని ఒకటికి నాలుగు సార్లు కృష్ణుని అన్నయ్య అని పిలుస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత కాదని అనలేరులే పద్మావతి అని అంటుంది అరవింద.

ఆర్య కు నిజం తెలియడం..
ఇక ఆర్య ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తాడు అప్పుడే అక్కడ ఉన్న పనిమనిషి ని చూసి ఆర్య అను అనుకొని వెనక నుండి వెళ్లి పట్టుకుంటాడు. ఇదంతా దూరం నుంచి అను చూస్తూ ఉంటుంది. తను నేను కాదు పనిమనిషి అని చెప్తున్నా ఆర్య వినిపించుకోకుండా పని మనిషిని పట్టుకుంటాడు పనిమనిషి ఒక్కసారిగా అయ్యగారు నేను అని అంటుంది. అప్పుడే అక్కడికి అనుకూడా వస్తుంది. అయ్యో నాకేం తెలీదు నేను అనుకొని పట్టుకున్నాను సారీ అని అంటాడు ఆర్య. అయినా నువ్వెందుకు అను చీర కట్టుకున్నావు అని అంటాడు నేనే ఇచ్చానండి చీర పాతదైపోయిందని, ఎందుకు అలా ఇచ్చావు ఏదైనా ఇస్తే నాకు చెప్పాలి కదా ఇప్పుడు చూడు ఏమైందో, నిజంగా నేను మాత్రం నువ్వు అనుకోని తనని పట్టుకున్నాను అని అంటాడు. పనిమనిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను ఆర్య సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకొకసారి ఇలా జరగదు లే డియర్ అని అంటాడు ఆర్య. ఇక ఆర్య రూమ్ లోకి వెళుతూ ఉండగా, కృష్ణా పద్మావతి తో మాట్లాడటం చూస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అని దగ్గరికి వెళ్ళగా, కృష్ణ పద్మావతి తో నన్ను అన్నయ్య అని పిలుస్తావా అని చేయి పట్టుకుంటాడు. పద్మావతి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా, నా చేయి వదిలిపెట్టు అని అంటుంది. ఇదంతా ఆర్య చూసి షాక్ అవుతాడు. నేను పెళ్లి చేసుకుంది అరవింద మీద ప్రేమతో కాదు, ఈ ఆస్తి కోసం, నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు పద్మావతి నేను అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వేమో విక్కీని పెళ్లి చేసుకున్నావు నాకు అది నచ్చటం లేదు ఎప్పటికైనా నేను నిన్ను దక్కించుకుంటాను అని అంటాడు.దానికోసం కావాలంటే అరవింద్ అని చంపడానికైనా నేను రెడీ అని అంటాడు. ఇదంతా ఆర్య విని,బావా అని ఒక్కసారిగా అరుస్తాడు. పద్మావతి కృష్ణ ఇద్దరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ బావ, మా అక్క నిన్ను ఎంతో ప్రేమగా చూస్తే నువ్వు చేసే పని ఇదా అని అంటూ ఉంటాడు. అని కృష్ణ మీద చేయి చేసుకుంటాడు ఆర్యా. అప్పుడే అక్కడికి అందరూ వస్తారు.

రేపు సూపర్ ట్విస్ట్..
రేపటి ఎపిసోడ్ లో, అరవింద ఏం మాట్లాడుతున్నావ్ బావ గురించి, తనకి నేనంటే చాలా ప్రేమ తనని నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆర్యా అని అంటుంది.ఈ దుర్మార్గుడు గురించి నీకు తెలియదు అక్క అని అంటాడు.నిన్ను పెళ్లి చేసుకుంది నీ మీద ప్రేమతో కాదు, నీ వెనక ఉన్న ఆస్తికోసం, వీడు పద్మావతిని హెరాస్ చేస్తున్నాడు. నువ్వుండగా తనని కావాలని కోరుకుంటున్నాడు అని అంటాడు ఆర్యా, వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవింద. ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. అరవింద నా కడుపులో ఉన్న మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు పద్మావతి ఆర్య చెప్పిందంతా నిజమా అని అంటుంది. చేసేదేం లేక పద్మావతి అవును అని అంటుంది. వెంటనే కృష్ణ ని మెడ పట్టుకొని బయటికి నేడుతుంది అరవింద. ఇది కల, నిజమో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..