రచయిత: Venkata SG, ప్రచురణ: Deepak Rajula
న్యూస్ ఆర్బిట్, అక్టోబర్ 12th 2023.
మనం కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్ , పాలెస్తీనా ల మధ్య గొడవల గురించి వింటూనే ఉన్నాం. యాసిర్ అరాఫత్ కి ఇందిరా గాంధీ కి మధ్య స్నేహం గురించి కూడా గుర్తు ఉండే ఉంటుంది. అసలు ఈ గొడవలు ఏమిటి. కొన్ని శతాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయిల్‌ల మధ్య వైరం కొనసాగుతోంది ఇదేమీ ఈమధ్య మొదలైనది కాదు. కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిందీ కాదు వీరి మధ్య వైరం . అసలు 1875లో అప్పటి బుక్టోమన్ సామ్రాజ్యంలోని భాగమైన జెరుసలేంను ఆనుకొని షేక్ జర్రాహ్ అనే ప్రాంతం ఉంది . దానిలో కొంత భూమిని అక్కడే ఉంటున్న యూదు సముదాయం జూసోసైటి అక్కడి అరబ్బుల నుంచి కోనుగోలు చేసింది. యూదులు అక్కడి భూమితో పాటు అక్కడి ఇళ్లను కూడా కొనుగోలు చేసినట్లు బుక్టోమన్ ల్యాండ్ రిజస్టర్‌లో రిజిస్టర్ అయింది. ఈ షేక్ జర్రాహ్ అనే ప్రాంతంలోనే క్రీస్తు పూర్వం 300 లో యూదుల మత గురవు ‘సైమన్ ది జస్ట్’ సమాధి ఉంది. దాంతో యూదులు ఈ ప్రదేశాన్ని కోనుగోలు చేశారు.

1875 నుంచి 1948 వరకు వీరిద్దరు కలిసిమెలసి ఉన్నారు. కానీరెండో ప్రపంచ యుద్దం ముగిశాక జోర్డాన్ దేశం జెరూసలేంను ఆక్రమించుకుంది. అంతేకాకుండా అక్కడ నివాసం ఉన్న యూదులను వెళ్ళగొట్టింది. అక్కడ నివసించేందుకు అరబ్బులకు అనుమతినిచ్చింది. అయినా ఆ భూమి యాజమాన్య హక్కులు మాత్రం ఇజ్రాయిల్ పేరుపైనే ఉంది. ఆ తరువాత 1948లో ఇజ్రాయిల్ ఓ దేశంగా ఆవిర్భవించి నపుడు కేవలం పశ్చిమ జెరూసలేం మాత్రమే ఇజ్రాయిల్ ఆధీనంలోకి వచ్చింది. కానీ తూర్పు జెరూసలేం మాత్రం జోర్డాన్ ఆధీనంలో ఉంది. అయితే 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధం లో ఇజ్రాయిల్ విజయం సాధించడంతో ఓడిన ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలు సంధి కుదుర్చుకున్నాయి.

అప్పుడు జరూసలేం పూర్తిగా ఇజ్రాయిల్ స్వాధీనంలోకి వచ్చింది. అప్పటికే ఇజ్రాయిల్ ఓ కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అంతకు ముందు యూదుల నుంచి లాక్కున్న భూమి, లేదా ఇళ్లు ఇంకా శత్రువుల ఆధీనంలో గనక ఉంటే. ఆయా భూములు తమవేనని నిరూపించుకోగల రుజువు పత్రాలు బాధితుల వద్ద ఉంటే భూములను వారు తిరిగి పొందే హక్కును కల్పించింది. ఈ చట్టం ప్రకారం జెరూసలేంలోని భూములు తనవని ఇజ్రాయిల్ కోర్టులో కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా తన భూములను తనకు ఇప్పించమని, అరబ్బుల చేత వాటిని ఖాళీ చేయించాల్సిగా ఇజ్రాయిల్ కోరింది. కానీ అంతమందిని ఖాళీ చేయించడం కష్టమని, కావాలంటే అరబ్బులు అక్కడ నివాసం ఉంటూ ఇజ్రాయిల్‌కు అద్దె కడతారని కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు అంగీకరిస్తూ అరబ్బులు ఇజ్రాయిల్‌తో అద్దె ఒప్పందం చేసుకున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా యుద్ధం లో 3600 పైన మరణాలు సంభవించాయి, ఈ సంఖ్య చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అని నిపుణల అంచనా.
1993లో యూదు ట్రస్ట్ మళ్లీ కోర్టును ఆశ్రయిచింది. అద్దెలు సరిగా చెల్లించడంలేదని, అనధికారిక కట్టడాలు నిర్మిస్తున్నారని కోర్టులో కేసును నమోదు చేసింది. ఇదే విధంగా మరెన్నో కేసులు నమోదు అయ్యాయి. కోర్టులో ఈ విషయంపై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో ఇటీవల 2021 ఫిబ్రవరిలో జెరూసలేం కోర్టు అద్దె చెల్లించకుండా అక్కడ నివసిస్తున్నవారు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో అరబ్బు కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. సుప్రీంలోనూ ఇదే తరహా తీర్పు వచ్చింది.
అయితే కోర్టు తీర్పును పట్టించుకోకుండా అరబ్బులు అక్కడే నివాసం ఉన్నారు. దాంతో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై అక్కడ ఉన్న అరబ్బులు ఘర్షణకు దిగారు. అయితే అరబ్బులను వెల్లగొట్టడం అన్యాయమని కొందరు సెలబ్రటీలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. దాంతో హమాజ్ తీవ్రవాదులకు దాడులు చేసేందుకు మంచి అవకాశం దొరికింది. దాంతో వరుస దాడులను చేసింది. రెండు రాజ్యాల మధ్య ఉన్న భూముల గోడవను రెండు దేశాల మధ్య వైరంగా మార్చారు. ఇదండీ టూకీగా ఈ గొడవ. రెండు దేశాల మధ్య వైరం రావడానికి కారణం.

ఏసుక్రీస్తును శిలువేశారన్న కారణంగా వందల సంవత్సరాలు క్రైస్తవుల అత్యాచారాలనుండి తట్టుకొని నిలబడ్డ యూదులకు 12వ శతాబ్దం తర్వాత క్రైస్తవ ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యం పెరగడంతో కొంతలోకొంతైనా ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషించారు యూదులు … కానీ…, పాపం… వాళ్ళ పరిస్థితి పెనంమీదనుండి పొయ్యిలో పడ్డట్లైంది … కనీస మానవ హక్కులు అటుంచి మతం మారుమంటూ నరకయాతనలు పెట్టడం. అధిక పన్నులు విధించడం, మతం ఆధారంగానే శిక్షలు ఖరారు చేయడం, … లాంటివెన్నో… వీటిని తట్టుకోలేక లక్షలాదిమంది ఫ్రాన్స్ , పోలాండ్, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్ . లకు పారిపోవాల్సివచ్చింది … కానీ…, ఎక్కడికెళ్లినా చెప్పలేనంత మతవివక్షను ఎదుర్కోవలసి వచ్చింది … ఒక్క భారతదేశం, అమెరికాల్లోనే ఏ వివక్షాలేకుండా ఉండగలిగామని …, భారతదేశంలో పొందగలిగినంత గౌరవం మరెక్కడా పొందలేదనీ ఇప్పటికీ గుర్తుచేస్తుండడం ఈ మధ్య పత్రికల్లో కూడా చూసాము కూడా … అందుకే…,జర్మనీ లోనైతే హిట్లర్ ఏకంగా గ్యాస్ ఛాంబర్ లో బంధించి విషవాయువు వదలడం ద్వారా, ఇంకా అనేక రకరకాలుగా హింసించి సుమారు 60 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాడు … యూదుడైన గొప్ప శాస్త్రవేత్త ఇన్స్టైన్ ఐనస్టీన్ కూడా వీళ్ళ ఆగడాలు భరించలేక అమెరికా కు పారిపోవాల్సివచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు …
ఇన్ని అత్యాచారాలు అరాచకాలు అవమానాలు భరిస్తూ కూడా యూదులు వారి ఆత్మవిశ్వాసాన్నిగానీ …, దేశభక్తినిగానీ కోల్పోలేదు…, మతంపై వారికిగల విశ్వాసం చెక్కుచెదరలేదు …ఏ ఇద్దరు ఇజ్రాయిలీలు ఎక్కడ కలుసుకున్నా ..వచ్చేసారి మన పవిత్ర ప్రదేశంలో కలుద్దాం ” అంటూ దృఢ సంకల్పంతో వీడ్కోలు తీసుకునేవారు.
రెండవ ప్రపంచయుద్దానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్ అమెరికాల అవసరార్థం స్వతంత్ర ISRAEL ఏర్పాటుకు అంగీకారంతో 1948 లో ఇజ్రాయిల్ ఆవిర్భావం జరిగింది … కానీ…, అనుకున్నంత భూభాగం గానీ,… అనుకున్న వనరులేవీ లభించకున్నా …, ఎలాగోలా మాతృభూమికి చేరుకోగలిగామనే ఆత్మతృప్తితో అంగీకరించాల్సివచ్చింది … ఈ కొండలు గుట్టలూ నీటివసతిలేని భూమి ఉంటేనేమి లేకుంటేనేమి అంటూ అనేకమంది వెటకారంగా మాట్లాడారు కూడా … జాతి పునర్నిర్మాణం కోసం యూదులంతా మాతృభూమికి తరలిరావల్సిందిగా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాదిమంది ఇజ్రాయెల్ కు తరలిరావడం జరిగింది …
గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతర ప్రణాళికలతో ఎందుకూ పనికిరాదనుకున్న భూమిని అతితక్కువ కాలంలోనే దేశమంతా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పర్చుకొని సస్యశ్యామలం చేసుకున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్-అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్‌మౌంట్ అత్యంత పవిత్రస్థలం.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్-అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్‌మౌంట్ అత్యంత పవిత్రస్థలం

గొడవలకు కారణం అదే!
ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మెుదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాలమన్ నిర్మించినది. తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లున్న తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో.. తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయోల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించటానికి 1990లో కొంత మంది యూదు అతివాదులు ప్రయత్నించగా, గొడవలు తీవ్రమయ్యాయి.
1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య.. ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్-అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా.. యూదులు, క్రైస్తవులకు అనుమతించరు. వారు కేవలం.. ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతుంది. అల్-అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ.. చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక యూదు మతసంస్థలు.. తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్-అఖ్సా ప్రాంగణంలో.. ఇజ్రాయోల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి.
కొద్దిరోజులు కిందట ఇజ్రాయెల్ భద్రతాదళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో.. అల్-అఖ్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది
ఏమిటీ హమాస్?
ఆధునాతన ఆయుధాలు, గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢచారులు ఉన్నప్పటికీ.. జ్రాయెల్‌కు ఒక చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాళ్లు రువ్వుతోంది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి.
1987లో స్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలెంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రాంతాల్లో మెుదటి ఇంతిఫదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే మాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు.. రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో తన చార్టర్‌ను ప్రకటించిన హమాస్.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. అందులో ప్రకటించింది.
1993లో పాలస్తీనా నేత యాసర్ ఆరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్జాక్ రాబిన్ మధ్య.. ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్‌బ్యాంక్.., గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయంపాలిత ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని.. హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్‌లో.. తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మెుదలు.. అనేక దాడులకు దిగింది. ఆ దాడుల కారణంగా ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్‌ను హమాస్ అపహరించింది. ఐదేళ్ల తర్వాత.. వెయ్యి మందికిపైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే కానీ.. హమాస్ అతడిని అప్పగించలేదు.

హమాస్‌కు ఇరాన్ అండ.. ఏటా కోట్ల డాలర్లు?
పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్‌లోని ప్రైవేటు దాతలు.. ఎక్కువగా హమాస్‌కు నిధులు అందిస్తుంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచీ.. సాయం అందుతుంటుంది. ఇరాన్ ప్రస్తుతం ఏటా 10 కోట్ల డాలర్లను.. హమాస్‌కు అందిస్తోంది. ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను.. హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్టు సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి. తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనాయ్ ద్వీప కల్పం చేరుకుంటాయి. అక్కడి నుంచి వాటిని సొరంగాల నుంచి గాజా చేరుస్తుంటారు. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాల్లో తయారవుతుంటాయి. వీటికి ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతోంది. అరబ్ దేశాల సహాయం హమాస్ కి ఉంది.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం తెల్లవారుజామున గాజా నుంచి ఇజ్రాయెల్‌పై భారీ దాడులు చేసింది.
ఇజ్రాయెల్ లక్ష్యంగా వందల కొద్దీ రాకెట్లను హమాస్ ప్రయోగించింది. మునుపెన్నడూలేని రీతిలో ఆ దాడి జరిగింది. గాజా నుంచి రాకెట్ల దాడి మొదలైన కొద్దిసేపటికే ఈ ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చాలావాటిపై మళ్లీ పట్టు సాధించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
గాజాపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ దాడులకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ప్రపంచ దేశాల నాయకులు ఖండించారు.

అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులపై ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కానీ, ఈ దాడిని ‘టెర్రరిస్టు’ దాడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటామని ఆయన అన్నారు.
మరోవైపు దాడులు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న ఓ వీడియోను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘‘నేడు ఇజ్రాయెల్ పరిస్థితి ఇదీ. 2004-2014 (యూపీఏ ప్రభుత్వ హయాంలో) భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది’’ అని వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ట్వీట్ చేసిన వీడియోలో భారత్‌లో దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్-పాలస్తీనా వివాద విషయంలో భారత్ విధానం మారిందా? అనే చర్చ మరోసారి మొదలైంది.
పాలస్తీనాపై భారత్ విధానం మోదీ ప్రభుత్వ హయాంలో మారిందా?
దశాబ్దాలనాటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ఇజ్రాయెల్, పాలస్తీనా పేరుతో రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని (టూ స్టేట్) చాలా మంది ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు తరచూ చెబుతుంటారు. భారత్ కూడా ఇదే అభిప్రాయాన్ని చాలాసార్లు వెల్లడించింది.
టూ-స్టేట్ పరిష్కారంలో భాగంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. 1967 తర్వాత వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలేంలను కలిపి పాలస్తీనాగా కొన్ని దేశాలు గుర్తించాయి కూడా.
అయితే, ఈ ఏడాది ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో భారత్ వైఖరిపై పెద్దయెత్తున చర్చ జరిగింది.
ఈస్ట్ జెరూసలేంతోపాటు కొన్ని పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ‘ఆక్రమణ’లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
పాలస్తీనా భూభాగాలను చాలా కాలం నుంచీ ఇజ్రాయెల్ ‘ఆక్రమించడం’పై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) విచారణ కూడా చేపట్టాలని ఈ తీర్మానం ముసాయిదాలో కోరారు.
ఈ తీర్మానానికి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. కానీ, భారత్‌తోపాటు బ్రెజిల్, జపాన్, మియన్మార్, ఫ్రాన్స్ ఓటింగ్‌కు దూరం జరిగాయి.
అప్పుడు కూడా పాలస్తీనాకు భారత్ దూరం జరిగి, ఇజ్రాయెల్‌కు దగ్గర అవుతోందనే వార్తలు వచ్చాయి.
కానీ, అంతర్జాతీయ నిపుణులు మాత్రం పాలస్తీనా విషయంలో భారత్ విధానం మారలేదని అంటున్నారు. కానీ, ‘డీహైఫెనేషన్’ దిశగా భారత్ అడుగులు వేస్తోందని విశ్లేషిస్తున్నారు.
అంటే ఇప్పటికీ పాలస్తీనాకు భారత్ గట్టి మద్దతు ఇస్తోంది. అదే సమయంలో దీనికి సమాంతరంగా తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్‌తోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తోంది.
అయితే, నానాటికీ పాలస్తీనా ప్రయోజనాల అంశం మరుగున పడుతోందని నిపుణులంతా ఏకీభవిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో రీసెర్చర్, పశ్చిమాసియా వ్యవహారాల నిపుణుడు ఫజ్జుర్ రహమాన్ సిద్దిఖీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత్ మాత్రమే కాదు, దాదాపు అన్నీ దేశాలు ఇజ్రాయెల్‌కు దగ్గర అవుతున్నాయి. ఫలితంగా ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన అన్నారు.