Malli Nindu Jabili: నీ మొహం లో సంతోషం చూస్తుంటే ఆ చీర చాలా బాగా నచ్చినట్టుందే అని గౌతమ్ అంటాడు. అవునండి చాలా చాలా బాగా నచ్చింది నా పుట్టిన రోజు గుడికి కట్టుకొని వెళ్తాను అని మల్లి అంటుంది.ఒరేయ్ నందు ఈ చీర వేరే మేడం సెలెక్ట్ చేసుకున్నారా వేరే దగ్గర ఇంకొకసారి చూద్దామని వెళ్లారు అని సేల్స్ బాయ్ అంటాడు. నా భార్యకు అది నచ్చింది ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని పిలవండి నేను వాళ్లతో మాట్లాడుతాను అని గౌతమ్ అంటాడు. సార్, ఈ మేడమే సారీ సెలెక్ట్ చేసుకున్నారు ఈ సారే మీతో మాట్లాడాలి అనుకున్నారు సార్ అని సేల్స్ బాయ్ అంటాడు. నేను సెలెక్ట్ చేసుకున్న చీర మల్లికి నచ్చిందా అని మాలిని అంటుంది. ఎంతోసేపు తిరిగితే గాని మల్లి కి ఈ చీర నచ్చింది అని గౌతమ్ అంటాడు.

ఎన్నో రోజుల తర్వాత మాలిని షాపింగ్ కి తీసుకెళ్లమని అడిగింది తనకు నచ్చింది కొన్ని ఇవ్వకపోతే బాధపడుతుంది అని అరవింద్ అంటాడు. నేను ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను నాకు నచ్చింది ఇంకెవరికి ఇవ్వను అని మాలిన అంటుంది. వద్దులే అక్క నీకు నచ్చింది కదా నువ్వే తీసుకో అని మల్లి అంటుంది. నేను సెలెక్ట్ చేసిన చిరా నాకే తిరిగి ఇస్తుంటే భిక్ష వేసినట్టుంది నాకేం అక్కర్లేదు నువ్వే తీసుకో అని మాలిని అంటుంది. కట్ చేస్తే అల్లుడు మీరా నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది అని జగదాంబ అంటుంది. ఎల్లుండి మల్లి పుట్టినరోజు తన పుట్టినరోజు కూడా మనమే జరిపిద్దామని అనుకుంటున్నాను అని మీరా అంటుంది. దానికి ఇంతలా అడగాలా అలాగే జరిపిద్దాం అని శరత్ అంటాడు. అలాగే వసుంధర గారికి కూడా చెబుదాము అని మీరా అంటుంది.వసుంధర ఎల్లుండి మల్లి పుట్టినరోజు మన ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను అని శరత్ అంటాడు.

ముందే నాకు చెప్పారు కాబట్టి నేను మీకు ఒకటి చెప్తున్నాను వినండి నన్ను కాదని పుట్టినరోజు వేడుకలు మన ఇంట్లో చేస్తే పుట్టిన రోజుని రచ్చ రచ్చ చేసి దాన్ని ఏడిపిస్తాను చూడండి అని వసుంధర అంటుంది. కూతురు పుట్టిన రోజు జరిపించే స్వేచ్ఛ ఒక తండ్రికి లేదా అని శరత్ అంటాడు.అది పుట్టడమే ఒక దరిద్రం అనుకుంటే దానికి ఇంకా పుట్టినరోజు కూడా నా ఇలాంటివి ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి నా ఇంట్లో కాదు అని వసుంధర అంటుంది. ఇల్లే మన అరిగిపోయిద్దా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా వద్దంటావేంటమ్మా అని జగదాంబ అంటుంది. ఇంతలో మల్లి ఫోన్ చేసి నాన్న రేపు నా పుట్టినరోజు అని మల్లి అంటుంది. దాని గురించే మాట్లాడుకుంటున్నాం అమ్మ అని శరత్ అంటాడు. నాన్న నా గురించి మీరు గొడవ పడొద్దు మీ అల్లుడుగారు మాట్లాడుతాడు అని మల్లి అంటుంది.హలో అంకుల్ రేపు మల్లి బర్త్డే చాలా గ్రాండ్ గా జరిపిస్తున్నాను మీరు తొందరగా వచ్చేయండి అని గౌతమ్ అంటాడు.

అలాగే అని శరత్ అంటాడు. ఒక్కర్ని అనగదొక్కాలని చూస్తే భగవంతుడు వారిని ఇంకా ఎదిగేలాగా చేస్తాడు వసుంధర అని శరత్ అంటాడు. బాబు గారు నా మల్లికి మంచి భర్త దొరికాడు మీరు దగ్గర ఉండి పెళ్లి జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మీరా మురిసిపోతుంది. కట్ చేస్తే మాలిని నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుస్తుంది నా వంక చూడు నువ్వు అలా ఉంటే నాకు చాలా బాధేస్తుంది అని అరవింద్ అంటాడు. ఇది ట్రయల్ వేసుకుని రా అని మాలిని అంటుంది. అంటే నా మీద నీకు కోపం పోయిందా అని అరవింద్ అంటాడు. నేను సెలెక్ట్ చేసుకున్న చీరని దానధర్మం చేశావు కనీసం నేను సెలెక్ట్ చేసిన షర్ట్ అయినా వేసుకొని నన్ను సంతోష పెట్టు అని మాలిని అంటుంది.

మల్లి గుడికి వెళ్ళేటప్పుడు సారీ పార్టీలో మాత్రం ఈ డ్రెస్సు ఏసుకోవలి ఒక సారి వెళ్లి ట్రైల్ వేసిరా నేను ఇంకో డ్రెస్ చూస్తాను అని గౌతమ్ అంటాడు. అరవిOద్ ట్రయల్ వేసుకుందామని రూంలోకి వెళ్తాడు మల్లి చూసుకోకుండా అదే రూమ్ లోకి వెళ్లి లాకెస్తుంది. మల్లి ఇది జెన్స్ రూమ్ నువ్వు దీంట్లోకి వచ్చావ్ ఏంటి అని అరవింద్ అంటాడు. అయ్యో చూసుకోకుండా వచ్చాను సార్ ఇప్పుడు ఎలా లాక్ అయిపోయింది అని మల్లి టెన్షన్ పడుతుంది. మల్లి నువ్వు జరుగు నేను ట్రై చేస్తాను అని అరవింద్ ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ కాదు హలో బయట ఎవరైనా ఉన్నారా బయట లాక్ అయింది ఓపెన్ చేయండి అని అరవింద్ గట్టిగా అరుస్తాడు. సేల్స్ బాయ్స్ సార్ బయట నుంచి కూడా లాక్ రావట్లేదు ఉండండి తాళం తీసుకొస్తాను అని వెళ్లి తాళం తీసుకొచ్చి తాళం తీస్తే అప్పుడు మల్లి బయటికి వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది