Anchor Suma: కొంతమంది ఏ రంగంలో రాణించినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. వారిని చూసి మరి కొందరు ఇన్స్పైర్ అవుతారు కూడా. అలా కొందరిని ఇన్స్పైర్ చేసి ప్రస్తుత కాలంలో కూడా తనదే హవా అంటూ యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్న వారిలో సుమా కనకాల ఒకరు. తన అందం ముందు మరే హీరోయిన్ కూడా సరిపోదు. అంత అందం కలిగి ఉంటుంది మరి సుమ. ఇక ఈమె అందం గురించి పక్కన పెడితే వయసును మరిచిపోయి యాంకరింగ్ చేస్తుంది. తాను తీసుకునే రెమ్యూనరేషన్ కి కన్నా ఎక్కువ న్యాయం చేస్తుంది. ఇతర షోస్ కి సుమ పెద్దగా అవసరం లేదేమో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం సుమా కంపల్సరీ ఉండాలి.
ఈమె కి ఖాళీ లేక కొందరు తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని కూడా షెడ్యూల్ చేసుకున్న వారు ఉన్నారు. అంత ప్రసిద్ధి చెందింది మరి సుమ. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తన కొడుకును కూడా హీరో చేసింది. ఇటీవలే బబుల్గం అనే సినిమాతో తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసింది సుమ. ఇక కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ మొట్టమొదటి సినిమాతో మంచి పాపులారిటీ రాలేదు. దీంతో రెండవ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టించేందుకు డైరెక్టర్ని వెతుకుతుంది. ఎంత కష్టమైనా పర్లేదు అనుకుని తన కొడుకు కెరీర్ బాగుంటే చాలు అనుకుంటుంది సుమ. ఇక స్టార్ హీరోయిన్లు కూడా ఈమె చేసినంత ఫోటోషూట్స్ చేయరేమో.
నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ తన అందంతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ లో అయితే వారానికి ఒక ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. కానీ సుమా మాత్రం నిత్యం ఫోటోషూట్స్ లో మునిగి తేలుతూనే ఉంటుంది. అలా తన యాంకరింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో అప్డేట్స్ ను పంచుకుంటుంది. ఇక ఇదే క్రమంలో తాజాగా బ్లూ కలర్ చున్నీ ధరించి వైట్ కలర్ డ్రెస్ లో అందాలను అరబోతుంది. అంతేకాదండోయ్.. ఎవరికో కీస్ కూడా పెడుతూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్త ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు..” ఈమధ్య ఆంటీ ఎవరో అమ్మాయి ఎవరో తెలియడం లేదు. అలా తయారయ్యారు మరి. ఎంత ఏజ్ వచ్చినప్పటికీ యంగ్ గా ఉంటూ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక అలాంటివారిలో సుమా గారు ముందుంటారు. తమకి ఏజ్ మీద పడినప్పటికీ పట్టించుకోకుండా దూసుకెళ్తున్నారుగా. కొంచెం మీరు ఇండస్ట్రీకి గ్యాప్ ఇస్తే కొత్తోళ్ళు వస్తారండి. మీరే అన్న షోస్ మేనేజ్ చేసేస్తుంటే కొత్తొళ్ళు ఏమొస్తారు. అయినా మిమ్మల్ని అని ఏం ప్రయోజనం డైరెక్టర్స్ ని అనాలి. మీకు డేట్స్ ఖాళీ లేకపోతే వేరే యాంకర్ ని పెట్టుకోకుండా మీకోసం వారు తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని కూడా వాయిదా వేస్తున్నారు. మీ డిమాండ్ అలా ఉంది మరి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.