The Goat Life first Day Collection: ప్రస్తుత కాలంలో తెలుగు ఇండస్ట్రీలో మలయాళ సినిమాలు భారీ రికార్డులు నెలకొల్పుతున్నాయి. మన తెలుగు సినిమాలు మలయాళం లో పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా మలయాళం సినిమాలు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. అలా ఇప్పటికే ఎన్నో హర్రర్ మరియు యాక్షన్ మూవీస్ మన తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళం ఇండస్ట్రీ అంటేనే హర్రర్ మూవీస్ కి ప్రసిద్ధి చెందిన ఇండస్ట్రీ. వారు అందించే హర్రర్ కాన్సెప్ట్లు వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మలయాళం హీరోలు సైతం మన తెలుగులో అరంగేట్రం చేయడం ప్రస్తుత కాలంలో కామన్ గా మారాయి.
ఇక మలయాళం సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సర్వైవల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ది గోట్ లైఫ్ “. మొదటి నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో మంచి అంచనాలు కలిగించిన ఈ మూవీ నేడు పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ డే నే పాజిటివ్ టాక్ సైతం దక్కించుకుంది. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక యు ఎస్ ఏ లో ఈ మూవీ మలయాళం మూవీస్ లోనే హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచి 114కె డాలర్స్ ని రాబట్టింది. అదేవిధంగా అటు కేరళ, తమిళనాడు మరియు యూఏఈ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంది ఈ మూవీ.
ఇక రేపటి నుంచి మలయాళం లో ఈ మూవీ మరింతగా అదరగొట్టే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2024లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు పృధ్విరాజ్. రానున్న రోజుల్లో ఇంకెన్ని బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడో తెలీదు. ఇప్పటికే తన నటనతో ఎంతోమందిని ఆకర్షించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం ఈ మూవీతో మరోసారి తన నటనను నిరూపించుకున్నాడు. ఏదేమైనా 2024లో ఈయన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడిందనే చెప్పుకోవచ్చు. ఇటీవలే సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన ఈయన ప్రస్తుతం ది గోట్ లైఫ్ తో వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.
సలార్ మూవీలో పృథ్వీరాజ్ పాత్ర వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పృధ్విరాజ్ నటనకు గాను ఎందరో ఫాన్స్ కూడా ఏర్పడ్డారు. ఇక ప్రస్తుతం సలార్ పార్ట్ 2 కూడా తెరకెక్కనుంది. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుని ఉన్న పృధ్వీరాజ్ మరో బ్లాక్ బస్టర్ వేసుకుంటాడనే చెప్పొచ్చు. మరి పృధ్విరాజ్ తాజాగా నటించిన ది గోట్ లైఫ్ మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ఏదేమైనా 2024లో పృధ్విరాజ్ కి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో సలార్ ఇప్పుడేమో ది గోట్ లైఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.