Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పరాజయాలతో ఉన్న సమయంలో గత ఏడాది “సలార్” తో హిట్ అందుకోవటం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2023వ సంవత్సరంలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 800 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ప్రభాస్ నీ చూపించారు. సినిమాలో హీరోయిజం ఎలివేషన్స్… చాలా ఆకట్టుకోవడం జరిగింది. “బాహుబలి 2” తర్వాత దాదాపు 5 సంవత్సరాలు విజయం కోసం తాపత్రయపడి చివరాఖరికి “సలార్” తో ప్రభాస్ విజయం అందుకోవడం జరిగింది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ రెండిటిలో వేసవి కానుకగా కల్కి సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందంట. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా చేస్తున్నారట. సో అన్ని అనుకున్నట్లు కుదిరితే “స్పిరిట్” డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించబోతున్నారు. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ వరుసగా మూడు సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. గత ఏడాది “యానిమల్” సినిమా విజయంతో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ “స్పిరిట్” మరింత రేంజ్ లో తీయబోతున్నట్లు సమాచారం.