NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Rashmi Gautam: అమెరికా అబ్బాయితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ యాంక‌ర్ ర‌ష్మీ.. పెళ్లి తేదీ లాక్‌..?!

Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై ఉన్న అందమైన ఫీమెయిల్ స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకటి. అయితే ర‌ష్మీకి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. విష‌యం ఏంటంటే.. ర‌ష్మీ పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. అది కూడా అమెరికా అబ్బాయితో ఆమె ఏడ‌డుగులు వేయ‌బోతోంద‌ని ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వైజాగ్ లో పుట్టి పెరిగిన రష్మీ.‌. హీరోయిన్ కావాలన్న ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 2022లో సవ్వడి అనే సినిమాతో ర‌ష్మీ ఫిల్మ్ కెరీర్ ప్రారంభమైంది. కానీ ఈ సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. అదే ఏడాది ఉదయ్ కిరణ్, రిచా పల్లాడ్ జంట‌గా న‌టించిన హోలీ మూవీతో ర‌ష్మి తొలిసారి వెండితెర‌పై మెరిసింది. ఎస్వీఎన్ వరప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షాలు అనే చిన్న క్యారెక్ట‌ర్ ను ప్లే చేసింది. అయితే హోలీ మూవీ ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ కు ఎలాంటి గుర్తింపు ద‌క్క‌లేదు.

ఆ త‌ర్వాత థాంక్స్, క‌రెంట్‌, బిందాస్, చ‌లాకీ, ప్రస్థానం వంటి ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించింది. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ వెండితెర‌పై క్లిక్ కాలేక‌పోయింది. 2007లో యువ అనే సీరియ‌ల్ లో మెరిసిన ర‌ష్మీ గౌత‌మ్‌.. 2013లో జబర్దస్త్ కతర్నాక్ కామెడీ షో ద్వారా యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ఆమె కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవ‌చ్చు. అప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మీ సొంతం చేసుకుంది. త‌న‌దైన యాంక‌రింగ్ మ‌రియు అంద‌చందాల‌తో తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపుల‌ర్ అయింది.

బుల్లితెర‌పై ర‌ష్మీ గౌత‌మ్ సూప‌ర్ స‌క్సెస్ కావ‌డానికి సుడిగాలి సుధీర్ తో చేసిన రొమాన్స్ కూడా ఒక కార‌ణం. ఆన్ స్క్రీన్ పై వీరిద్ద‌రూ రియ‌ల్ ల‌వ‌ర్స్ మాదిరి ఓ రేంజ్ లో కెమిస్ట్రీని పండించారు. సుధీర్‌, ర‌ష్మీ జంట‌గా ఏ షోలో క‌నిపించినా టీఆర్పీలు ఓ రేంజ్ లో దూసుకుపోతాయి. వీరి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈటీవీ వారు ఒక‌ట్రెండు సార్లు సుధీర్‌, ర‌ష్మీల‌కు ఉత్తుత్తి పెళ్లి కూడా చేసేవారు. అయితే స్క్రీన్ పై సుధీర్‌, ర‌ష్మీ కెమిస్ట్రీ చూసి నిజంగా వారు ల‌వ్ లో ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసుకుంటార‌ని అనేక సార్లు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ ఆ వార్త‌ల‌ను అటు సుధీర్, ఇటు ర‌ష్మీ ఖండిస్తూనే వ‌చ్చారు. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి మాత్ర‌మే తాము స్క్రీన్ పై ల‌వ‌ర్స్ మాద‌రి యాక్ట్ చేస్తామ‌ని.. రియ‌ల్ లైఫ్ లో తాము మంచి ఫ్రెండ్స్ అని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. ఇక‌పోతే స్క్రీన్ పై ర‌ష్మీ, సుధీర్ క‌లిసి క‌నిపించి చాలా కాల‌మే అయింది. సుధీర్ హీరోగా వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. మ‌రోవైపు ర‌ష్మీ బుల్లితెర‌పై యాంక‌ర్ గా టీవీ షోస్ లో స‌త్తా చాటుతోంది. ఇలాంటి త‌రుణంలో ర‌ష్మీ పెళ్లికి సంబంధించి ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది.

అమెరికాకు చెందిన అబ్బాయితో ర‌ష్మీ గౌత‌మ్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని.. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయింది ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం జ‌ర‌గ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో స్కిట్ చేయ‌డానికి వ‌చ్చిన బుల్లెట్ భాస్కర్ ను మ‌రొక కమెడియన్ `నాకు ఒక విషయంలో క్లారిటీ రావాలి, రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటారా?` అని ప్ర‌శ్నించాడు. అందుకు బుల్లెట్ భాస్కర్… క‌చ్చితంగా చేసుకుంటారు. జాతకాలు కూడా చూపించాను. అయితే రష్మీ అమెరికా అబ్బాయిని చేసుకుంటుంది. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడు` అని స‌మాధానం ఇచ్చి అందరినీ న‌వ్వించాడు. అయితే స్కిట్ భాగంగానే బుల్లెట్ భాస్కర్ ఆ కామెంట్స్ చేసిన‌ప్ప‌టికీ.. ప‌లువురు నెటిజ‌న్లు మాత్రం అవే నిజమ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అమెరికా అబ్బాయితో ర‌ష్మీ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్త వైర‌ల్ చేస్తున్నారు.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri