Shoban Babu: మన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేకమంది హీరోలు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక కొంతమంది స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత కృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక అలా తమ సత్తా చాటుకున్న వారిలో చిరంజీవి, రవితేజ, నాచురల్ స్టార్ నాని ఇలా అనేకమంది ఉన్నారు. ఒకానొక సమయంలో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సాధారణ మనుషులు కూడా హీరోగా ఎదగవచ్చు అని ప్రూవ్ చేశాడు. ఇక అనంతరం రవితేజ ఎంట్రీ ఇచ్చి మరోసారి ఆ మాటకి అర్థం చెప్పాడు.
ఇక ఒకానొక సమయంలో అలా ఎదిగిన వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. ఫ్యామిలీ సినిమాస్ చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు శోభన్ బాబు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని ఎంతో ఎంటర్టైన్ చేసేది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నాడు శోభన్ బాబు. ఇక ఈ క్రమంలోనే కృష్ణ వంటి స్టార్ హీరోతో మల్టీస్టారర్ సినిమా చేస్తూనే సోలో హీరోగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. సోగ్గాడు సినిమాతో తనేంటో ప్రతి ఒక్కరికి చాటి చెప్పాడు శోభన్ బాబు. ఇక సినిమాల ద్వారా శోభన్ బాబు కి వచ్చే డబ్బుల్ని భూములు మీద ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోగా గుర్తింపును సైతం సంపాదించుకున్నాడు.
ఇక అలనాటి కాలంలో శోభన్ బాబు చేసిన సినిమాలు వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక శోభన్ బాబు నట వారసుడిగా కొడుకు కరుణ శేషు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలి కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ఇండస్ట్రీకి రాలేదు. ఇద్దరు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న కూడా శోభన్ బాబు ఇంట్రెస్ట్ ని మార్చేసేలా ఈ బిజినెస్ లో మీద ఆసక్తి పెట్టే విధంగా మార్చారు. శోభన్ బాబు వలన ఆయన కొడుకు ఇండస్ట్రీ లోకి రాలేకపోయాడు. నిజానికి శోభన్ బాబుకి తన కొడుకును ఇండస్ట్రీలోకి పంపించడం అస్సలు ఇష్టం లేదు.
తనకి వచ్చిన పేరు కలకాలం అలానే ఉండి పోవాలని ఆశించిన శోభన్ బాబు తన వయసు మల్లుతున్న సమయంలో ఇండస్ట్రీకి దూరమై అనంతరం ఎవరికీ కనిపించలేదు. ఇక ఆఖరి సారిగా కన్నుమూసి తన సీని ప్రస్తావాన్ని అక్కడితో ముగించేశారు. ప్రస్తుత కాలంలో స్టార్ హీరోల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా ఎదుగుతున్నారు. అటువంటి క్రమంలో శోభన్ బాబు మాత్రం తన కొడుకును ఇండస్ట్రీలోకి రానివ్వలేదు. ఏదేమైనప్పటికి శోభన్ బాబు ఈ విషయంలో పెద్ద తప్పు చేశాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో శోభన్ బాబు కొడుకు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే బాలకృష్ణ, నాగార్జున వంటి వారితో సమానంగా పోటీ పడేవాడు. కానీ ఆయనకి సినీ కెరీర్ లేదని చెప్పుకోవచ్చు.