Tollywood Actors: సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫుల్ రన్ లో వచ్చే కలెక్షన్స్ షేర్లతో కొత్త రికార్డు సృష్టించాలి. మునుపటి ఇండస్ట్రీ హిట్ యొక్క క్లోజింగ్ కలెక్షన్స్ ను క్రాస్ చేయాలి. అప్పుడే ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా భావిస్తారు. 90 ఏళ్ల తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు దాదాపు 40 చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. మరి వీటిలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న టాప్ 5 హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ ఇట్స్ ను ఖాతాలో వేసుకున్న హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల నుంచి హీరోగా సత్తా చాటుతున్న చిరంజీవి.. ఇప్పటివరకు 150కి పైగా సినిమాలు చేశారు. అందులో ఎనిమిది చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. చిరంజీవికి భారీ స్టార్డమ్ ను అందించింది. ఆ తర్వాత చిరంజీవి కెరీర్ లో పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
చిరంజీవి తర్వాత ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. ఏఎన్ఆర్ గారి సినీ ప్రయాణంలో 6 చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఈ లిస్టులో బాలరాజు, దేవదాసు, రోజులు మారాయి, మాయాబజార్, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం సినిమాలు ఉన్నాయి. టాప్ 3 లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. పాతాళభైరవి, లవ కుశ, అడవి రాముడు, మాయాబజార్ లాంటి సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.
ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ మూడు ఇండస్ట్రీ హిట్స్ ను ఖాతాలో వేసుకుని నాలుగు స్థానంలో నిలిచారు. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, ముద్దుల మావయ్య, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాశాయి. వసూళ్ల వర్షం కురిపించి. ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. టాప్ 5 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయన ఖాతాలో రెండు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. అందులో ఖుషి ఒకటి కాగా.. మరొకటి అత్తారింటికి దారేది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే సగం ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. అయినా కూడా ఈ చిత్రం థియేటర్స్ ను ఆ రేంజ్ లో షేక్ చేసింది. సంచలన విజయాన్ని నమోదు చేసి నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోల జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 15 ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.