Trinayani October 12th ఎపిసోడ్ 1056: విశాల్ నువ్వు సైలెంట్ గా ఉంటే మాకు ఏమీ అర్థం కావట్లేదు అని దురంధర అంటుంది. ఏం మాట్లాడను అత్తయ్య అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్టో కాదు వాళ్లకే తెలియాలి అని విశాల్ అంటాడు.మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని గాయత్రీ ని గాయత్రి అత్తయ్య అని అంటున్నారు చూపించండి అని హాసిని అంటుంది. చూపించడం కాదు గాయత్రి చేతిలో నా చేయి వేస్తాను అప్పుడు తెలుస్తుంది అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య వాళ్ళు చెప్పింది నిజమే బాబు గారు గాయత్రి అత్తయ్య కుడి చేయి తిలోత్తమార్తయ్య కుడి చేయి రెండు కలుసుకుంటే మంటలు వస్తాయని మన స్వామీజీ చెప్పాడు అని నైని అంటుంది. మత చూసుకొని చేయండి పరీక్ష జరిగేది గోర ప్రమాదం దాన్ని తట్టుకోలేవు అని ఎద్దులయ్య అంటాడు.

మమ్మీ వద్దులే మమ్మీ ఇంత రిస్క్ చేయడం అవసరమంటావా అమ్మ చేయి పట్టుకోగానే మంటలు వస్తే నా మీద నీళ్లు పోయండి అని వల్లభ అంటాడు. మరి ఇంత పిరికితనం పనికిరాదు వల్లభా పక్కనే బాటిల్ లో నీళ్లు ఉన్నాయి అంతగా మంటలు వస్తే గుమ్మరిస్తాంలే అని దురంధర అంటుంది. అమ్మో మంటలు వస్తాయా అందరు జాగ్రత్తగా ఉండండి దూరం జరగండి అని పావన మూర్తి అంటాడు. విశాల్ అటు చూడు అని హాసిని సైగ చేస్తుంది. పరిస్థితి చేయి జారిపోయింది వదిన ఇప్పుడు ఏమి చేయలేము అని విశాల్ అంటాడు. తనేమైనా గ్యాస్ సిలిండర్ ఆ మంటలు రావడానికి మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు అత్తయ్య మీరు ముట్టుకోండి ఏమి జరగదు అని సుమన అంటుంది. తిలోత్తమ గాయత్రి చేయి పట్టుకోపోతుండగా అందరూ ఏం జరుగుతుందని కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటారు.

అప్పుడు ఒక పెద్ద గాలి వీచి గాయత్రి ఫోటో అటూ ఇటూ గాలికి కొట్టుకుంటుంది. తిలోత్తమ గాయత్రి చేయి పట్టుకున్న సరే ఏమి అవదు. మమ్మీ పట్టుకున్నావా మంటలు వచ్చాయా అని వల్లభ అంటాడు.ముట్టుకోవడమే కాదురా రెండు చేతులు పట్టుకున్నాను కానీ ఏమీ జరగలేదు ఆని త్తిలోత్తమ అంటుంది.అదేంటి మమ్మీ అఖండ స్వామి చెప్పాడు కదా మంటలు వస్తాయని వల్లభ అంటాడు. ఏది ఆరోజు మన ఇంటికి వచ్చి గానవి గాయత్రి కవల పిల్లలు అని చెప్పిన స్వామి జా ఆయనకు దండం పెట్టండి రా బాబు గాయత్రి పాపే గాయత్రి పెద్దమ్మ అని కొద్దిసేపు సంబరపడిపోయాము అంత పాడు చేశారు అని విక్రాంత్ అంటాడు. నువ్వు నేను కన్నా బిడ్డవే అని అనుకున్నాను కాకపోయినా పర్వాలేదు అమ్మ నువ్వు నా బిడ్డ వే అని నైని అంటుంది.నైనీ పాపను ఇలా ఇవ్వు అని విశాల్ గాయత్రిని తీసుకొని వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే ఇలా ఎందుకు జరిగిందా అని తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వల్లభ అక్కడికి వచ్చి అమ్మ నువ్వు అఖండ స్వామికి ఏమైనా బాకీ ఉన్నావా అని అంటాడు. లేదు ఎందుకురా అలా అన్నావ్ అని తిలోత్తమంటుంది.నువ్వు స్వామీజీని కలిసిన ప్రతిసారి ఎమోషన్ గానూ భయపెడుతూ నిన్ను టెన్షన్ పెడుతూ నీ చావు నీ ఇంట్లోనే ఉంది అని బెదిరిస్తున్నాడు కదా అని వల్లభ అంటాడు.సాధు పుంగవులు ఏమీ ఆశించరు రా అని తిలోత్తమంటుంది. అమ్మ మరి అయితే గాయత్రి పాపే గాయత్రి పెద్దమ్మ అని అఖండ స్వామి చెప్పాడు పాప చేయి పట్టుకుంటే ఎలా ఉంది అమ్మ అని వల్లభ అంటాడు. పసిపిల్ల చెయ్యి ఎలా ఉంటుందిరా చల్లగా ఉంది అని తిలోత్తమ అంటుంది. గాయత్రి చేయి పట్టుకుంటే మంటలు వస్తాయి అది ఇది అని చెప్పాడు కదా మాఖండస్వామి అలా ఏమీ జరగలేదు కదా అని వల్లభా అంటాడు.

అందుకని పాపని ఎత్తుకొని పార్కుల వెంట తిరుగుదామంటావా అని తిలోతమ అంటుంది. నైని కన్నా బిడ్డ కాకపోయినా గాయత్రి పేరు ఉంది కాబట్టి నీకు ప్రమాదం జరుగుతుందని చెప్పాడా లేదంటే ఎలాగో నీకు పసిపిల్ల చేతిలో మరణం ఉంది కాబట్టి గాయత్రి పేరు ఉన్న ఏ పిల్ల చేతనైన నీకు ప్రమాదం ఉందా అని వల్లభ అంటాడు. అది కాదురా వల్లభ గాయత్రి పార్థివ దేహాన్ని ఇక్కడే దహనం చేసాము కాబట్టి తన శక్తి ఇక్కడే ఉండి ఉంటుంది అందుకే గాయత్రి రూపంలో నాకు ప్రమాదం ఉందని అఖండ స్వామి చెప్పి ఉంటాడు అని తిలోత్తమ అంటుంది. అమ్మ నైని బిడ్డల్ని కానీ రెండు సంవత్సరాలు అవుతుంది గాయత్రీ పెద్దమ్మ కూడా మిస్సయి రెండు సంవత్సరాలు కావస్తుంది మనం టైం వేస్ట్ చేయకుండా పెద్దమ్మని వెతికే పనిలో ఉందాం అని వల్లభ అంటాడు.

Trinayaniతెలివి తక్కువ వాడివైనా ఈరోజు భాగానే ఆలోచిస్తున్నావ్ వల్లభ అసలు నువ్వు నా కొడుకు వేనా అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే విశాల్ గాయత్రిని ముట్టుకుంటే మంటలు రాలేదేంటి హౌ ఇస్ ఇంపాజిబుల్ ఎలా జరిగింది అది నాకు తెలియాలి లేదంటే నా బుర్ర బద్దలు కొట్టుకోక ఉందే చెప్పు విశాల్ అని హాసిని అంటుంది.ఈ గాయత్రి నన్ను కన్నా అమ్మే అని విశాల్ అంటాడు. అయితే మంటలు ఎందుకు రాలేదు ఏం చేశావు చెప్పు అని హాసిని అంటుంది. పక్కనే ఉండి ఎవరో వాళ్ళుకు కనపడకుండా వీడియో తీస్తూ ఉంటారు. అది చూసుకోకుండా విశాల్ మంటలు రాకుండా చేశాను కదా అని అంటాడు. అవునా ఎలా జరిగింది అని హాసిని అంటుంది. అమ్మ వాళ్లు అఖండస్వామి దగ్గరికి వెళ్లితె గాయత్రి మా అమ్మని పిన్ని వాళ్ళకు చెప్పాడు. అది విన్న నేను వెంటనే వచ్చాను అని విశాల్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది