సీజనల్ ఫ్రూట్స్ ను ఎప్పటికీ దూరం పెట్టొద్దు ఎక్కడినుంచైనా తెప్పిచ్చుకుని తినాలి. దాంతో మన ఆరోగ్యం మంచిగా ఉండటమే కాకుండా దృఢంగా తయారవుతాము. దాంతో ఏ రోగాలు మన దగ్గరకు చేరవు. ఈ సమయంలో ఎక్కువగా లభించేవి ఉసిరికాయలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎక్కువగా దొరుకుతాయి కదా అని వీటిని మరిచిపోయే పని మాత్రం చేయొద్దు. కచ్చితంగా తినాల్సినవి ఈ ఉసిరి కాయలు. ఈ సీజన్ లో వచ్చే పలు అనారోగ్య సమస్యలకు ఉసిరి కాయలు చెక్ పెడతాయని మీకు తెలుసా..? అవును ఉసిరి కాయలు చలికాలంలో రోజూ తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలేంటో తెలుసుకోండి.
ఉసిరిలో విటమిన్ సి మనకు సమృద్ధిగా దొరుకుతుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్ సి మనకు ఈ ఉసిరిలో ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో దొరికే ఉసిరిని ఎక్కువగా తీసుకుంటే విటమిన్ సి లోపం రాదు.ఈ విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం మన చెంతకు చేరవు.
ఈ చలికాలంలో మాములుగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.ఈ సమయంలో రోజూ ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్నదంతా సరిగ్గా అరుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయలను తినడం వలన కావల్సినంత క్రోమియం వారికి లభిస్తుంది. దీంతో ఇన్సులిన్ చురుగ్గా పనిచేస్తుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని రోజూ వాడాలి. దీంతో వెంట్రుకలు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే మీరు కూడా రోజూ ఉసిరికాయల రసాన్ని తాగుతూ.. మీ ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి. సి విటవిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.