Eggs: కోడిగుడ్లు సంపూర్ణ పోషకాహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు ఒక గుడ్డు తినమని చెబుతుంటారు..! పైగా గుడ్డు వెజిటేరియన్.. దీనిని అందరూ తినవచ్చు.. కోడిగుడ్లు తింటే సహజంగా శరీరంలో వేడిని పెంచుతుంది. అటువంటి ఎగ్ ను వేసవి కాలంలో తినవచ్చా లేదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి..! గుడ్డు సమ్మర్ లో తినొచ్చొ..!? తినకూడదో ఇప్పుడు చూద్దాం..!
కోడుగుడ్డు ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలో మన శరీరానికి అవసరమైన సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నయి. ఇంకా పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సి, డి వంటి కీలకమైన పోషకాలు ఇందులో ఉంటాయి. అటువంటి ఎగ్ ను వేసవి కాలంలో మాత్రం ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ తినకూడదని డైటీషియన్ చెప్తున్నారు. గుడ్లు సహజంగానే శరీరంలో వేడిని పెంచుతాయి. అందువలన వేసవి ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని అసౌకర్యానికి గురి చేస్తాయి.
ఎండాకాలంలో గుడ్లు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఉడకబెట్టి తింటే పోషకాలు ఎక్కువ లభిస్తాయి. రోజు ఉడకబెట్టిన గుడ్డు తిని బోర్ కొడితే అంబ్లెట్, స్నాక్స్ ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే అతిగా తింటే మాత్రం ఇబ్బందులు తేడా తప్ప మితంగా తినడమే బెస్ట్ అంటున్నారు డైటీషియన్లు. గుడ్డును ఏ సీజన్ లోనైనా తినొచ్చు కానీ తక్కువగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఒక్కటి తిన్నా కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.