మెట్‌ఫార్మిన్‌లో మరో కోణం

Share

మెట్‌ఫార్మిన్…ఈ మందు పేరు చాలామందికి తెలుసు. మధుమేహం బాధితులలో ఎక్కువమందికి వైద్యులు రాసేది ఈ మందునే. ఈ మందు వల్ల అనేక ఇతర ఉపయోగాలు కూడా ఇటీవలి ఉన్నట్లు పరిశోధనలలో తేలింది.

మెట్‌ఫార్మిన్‌కు మహిళలో ఫెర్టిలిటీ పెంచే గుణం ఉన్నట్లు పరిశోధనలలో బయటపడింది. నెలసరిని క్రమం తప్పకుండా ఉంచే గుణం కూడా ఈ మందుకు ఉంది. మెట్‌ఫార్మిన్‌ వల్ల ఆయుష్షు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇటీవల తెలిసింది. వయస్సు పెరుగుదల క్రమంలో వచ్చే మార్పులను నియంత్రించే గుణం దీనికి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మెట్‌పార్మిన్‌ వల్ల మరో ఉపయోగం ఉండవచ్చని తాజా పరిశోధనల వల్ల తెలుస్తోంది. రక్తపోటుకు వాడే సైరోసింగోపైన్ అనే మందుతో కలిపి మెట్‌ఫార్మిన్‌ను వాడితే కాన్సర్ కణాల పెరుగదలను అరికట్టవచ్చని పరిశోధనలలో తెలిసింది. స్విట్జర్లాండ్ లోని బాసిల్ యూనివర్సిటీ, బాసిలియా ఫార్మస్యూటికల్స్ కలిసి ఈ పరిశోధన నిర్వహించాయి.

ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు దారి తీస్తున్న ప్రధాన కారణాల్లో కాన్సర్ ఒకటి. 2018లో ఒక్క అమెరికాలోనే 17 లక్షల మంది కాన్సర్‌కు గురవుతారని నేషనల్ కాన్సర్ ఇన్సిస్టిట్యూట్ అంచనా వేసింది.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.


Share

Related posts

సపోటా తో ఎన్ని బెనిఫిట్ లో .. చక్కగా తినండి !  

Kumar

menstrual: మీ రుతుస్రావం  ఈ రంగు  ల్లో ఉంటే    పెద్ద సమస్య ఉన్నట్టే… వెంటనే డాక్టర్ ని సంప్రదించండి!!(పార్ట్ -2)

siddhu

పిల్లల సంతోషం కోసం తండ్రి ఇలా చేస్తే చాలు!!

Kumar

Leave a Comment