Nails: గోళ్లు మీ ఆరోగ్యానికి సూచికలు.. మీ గోర్లు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి.. అటువంటి గోళ్లపై ఏ చిన్న మార్పు కనిపించినా.. ఏ చిన్న గీత కనిపించినా కూడా కచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!
మీరు మీ గోర్లలో మార్పుల ద్వారా థైరాయిడ్ హార్మోన్ స్రావం సులభంగా గుర్తించొచ్చు. థైరాయిడ్ హార్మోన్లు శరీరం పనితీరును తగ్గిస్తాయి. ఫలితంగా గోర్లు విరిగిపోతాయి. వాటి పెరుగుదల మందగిస్తుంది. అదేవిధంగా గోర్లు వంకరగా అయ్యి రెండుగా విడిపోతాయి. రెండుగా చీలి పోయి బలహీనంగా ఉంటాయి. కొంత మందిలో ఈ సమస్య గోళ్ల మూలాల వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్లు వీటి పైనే కాకుండా కాలి వేళ్ళ పై కూడా తీవ్రంగా ఉంటాయి.
హైపోథైరాయిడిజం సమస్యను గోర్లు త్వరగా బయటపడతాయి. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. గొర్ల లో మార్పులతోపాటు అలసట, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, మహిళల్లో రుతుక్రమం లోపాలు, కీళ్లలో నొప్పి, వాపులు ఈ సమస్యకు కారణం.