Toilet: టాయిలెట్ నిలబడి వస్తున్నారా ? అలా చేయడం అసలు కరెక్ట్ కాదు. టాయిలెట్ కూర్చుని మాత్రమే వేసుకోవాలి .. కూర్చుని టాయిలెట్ పోసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం… యూరిన్ మన శరీరంలో,రక్తంలో ఉండే కొన్ని వ్యర్థ పదార్థాల మిశ్రమం గా చెప్పబడింది. వ్యర్ధా లన్నిటిని మూత్రం రూపంలో కిడ్నీ ఫిల్టర్ చేస్తాయి. అలా రిలీజ్ అయిన మూత్రం మూత్రాశయంలోకివెళ్తుంది. అక్కడ యూరిన్ నిండేటప్పటికే మెదడు మూత్రానికి వెళ్లాలని తెలియచేస్తుంది.
అప్పుడే మనం మూత్రానికి వెళ్తాం. అయితే ఈ యూరికి వెళ్లే విషయానికి వస్తే మగవారు,ఆడవారు భిన్న రకాలుగా మూత్రం పోస్తుంటారు. ఆడవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మగవారు మాత్రం నిలబడి చేస్తారు. కొందరు మగవారు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే మగవారు నిలబడి కాక, కూర్చుని యూరిన్ కి వెళ్తే ఎంతో ఉపయోగం. ఇది వినడానికి బాగా అనిపించక పోయిన ఇది మాత్రం నిజం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నమగవారిలో మూడింట ఒక వంతు మంది కూర్చునేయూరిన్ కి వెళ్తున్నారు.ఈ పద్దతిలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు అని తెలియవచ్చింది.ఇలా చేసే చాలా మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు లేవు. మూత్ర విసర్జన కూర్చుని చేయడం వల్ల శరీరానికి ఎంతో శుభ్రతను ఇచ్చినట్టు అవుతుంది.
మూత్రాశయ లేదా శృంగార సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తేఆ సమస్యలు తగ్గేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
కూర్చుని యూరికి వెళ్లడం వలన మూత్రాశయం నుంచి మూత్రం పూర్తిగా బయటకువచ్చేస్తుంది . ఇది మూత్రాశయ సమస్యలు,కిడ్నీ స్టోన్స్, ఉన్న వారికి చాలా మంచిది .కాబట్టి ఇకనుండి మీ అలవాటు మార్చుకుని ఆరోగ్యవంతులు గా ఉండండి.