న్యూస్ హెల్త్

BP: మీకు ఈ అలవాట్లు ఉంటే బీపీ పెరుగుతుంది..! జాగ్రత్త..!

Share

BP: గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి అధిక రక్తపోటు.. సాధారణంగా అధిక రక్తపోటు సమస్యకు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం.. ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి.. మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు వలన బిపి పెరుగుతూ ఉంటుంది.. ఆ పొరపాటు ఏంటో తెలుసుకుని సరిచేసుకుంటే బ్లడ్ ప్రెజర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు..

These Habits Raise BP: Levels
These Habits Raise BP: Levels

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరానికి పనిచేసే శక్తిని ఇవ్వటానికి కొంత మొత్తంలో ఉప్పు అవసరమైనా.. ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. ఒక రోజు మొత్తంలో ఒకటి చెంచా కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని గుర్తుంచుకోండి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే బిపి పెరుగుతుందని గుర్తుంచుకుని జాగ్రత్త వహించండి. రక్తపోటును నియంత్రించడానికి కొవ్వులు ఎక్కువగా ఉండే  జోలికి వెళ్ళకూడదు. క్రీం, మీగడ, వెన్న, మాంసం వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. మద్యపానం కూడా బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వలన హైబీపీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

These Habits Raise BP: Levels
These Habits Raise BP: Levels

కంటి నిండా నిద్రపోకపోతే బిపి పెరిగే ప్రమాదం ఉంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు హైపర్ టెన్షన్ కు గురయ్యే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత త్వరగా నిద్ర పోయే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే బీపీకి చెక్ పెడతాయి. బచ్చలి, బ్రక్కోలి, అవకాడో, ఆకుకూరలు, టమోటా, నారింజ, అరటి పండ్లు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.


Share

Related posts

Big Breaking: ఏబీఎన్ రాధాకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..! మరో కేసు నమోదు..!!

Special Bureau

Trikatu Choornam: మీకు కలిగే ఆ సమస్యలను త్రికటు చూర్ణం సులువుగా తగ్గిస్తుంది..

bharani jella

ఈ టెర్మ్ లోనే ‘అధ్యక్షా’ ఆనాలన్న కమలనాథుల కల సాకారమయ్యేనా?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar