న్యూస్

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట టీమ్ నుంచి అలా చేయొద్దని ప్రేక్షకులకు రిక్వెస్ట్..!

Share

Sarkaru Vaari Paata: ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న “సర్కారు వారి పాట” ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, యాక్టింగ్, డైలాగులు అదిరిపోయాయని ఇప్పటికే ప్రేక్షకులు రివ్యూస్ కూడా చెప్పేస్తున్నారు. మరికొందరైతే సినిమాకి సంబంధించిన చిన్న క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారట. ఫాన్స్ తమ ఫేవరేట్ హీరో మూవీ నుంచి క్లిప్స్ సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేయడం ఎప్పుడూ జరిగేదే. అయితే దీనిపై సర్కారు వారి పాట టీమ్ మాత్రం అభ్యంతరం తెలిపింది.

Sarkaru Vaari Paata: ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయొద్దు

సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేయకూడదని ఆ మూవీ మేకర్స్ తాజాగా అభిమానులను కోరారు. సినిమా పైరసీ విషయంపై తాము చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. సినిమా పైరసీ వెర్షన్ ఎక్కడైనా కనిపిస్తే యాంటీ పైరసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని నెంబర్ల ఇచ్చి మరీ సహా విజ్ఞప్తి చేశారు. [email protected] అనే ఈమెయిల్ ఐడీకి పైరసీ సంబంధిత ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. 8978650014, 9912425159, 8881108888 ఈ మూడు వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేసినా సరిపోతుందన్నారు.

సగటు ఫ్యాన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిన సర్కారు వారి పాట

గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం మహేష్ బాబుని కొత్త అవతారంలో చూపించి ప్రేక్షకులను మనసు దోచేశారు. మహేశ్ బాబు, కీర్తి సురేష్ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సముద్ర ఖని, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్,  సుబ్బరాజు సన్నివేశాలు కూడా బాగున్నాయని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. ఇక ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం వేరే లెవల్లో ఉందంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి ఉందని టాక్. ఈ సినిమా ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద వసూలు చేసే కలెక్షన్లను బట్టి ఇది హిట్టా లేక యావరేజ్ మూవీనా అనేది తెలుస్తుంది.


Share

Related posts

భారత్ లో 74 వేలకు చేరిన కరోనా కేసులు

somaraju sharma

Nandhi Movie Trailer : అల్లరి నరేష్ కొత్తగా..! నాంది ట్రైలర్ థ్రిల్లర్..!!

bharani jella

CM YS Jagan: సామాజిక సమతుల్యం .. జగన్ మైండ్ వర్క్ సూపర్..!!

Srinivas Manem