NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: మే 26 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu మే 26 – శుక్రవారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu May 26
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో ఇస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu May 26th 2023

వృషభం : Taurus Horoscope in Telugu May 26
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.
మిధునం : Gemini Horoscope in Telugu May 26
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం : Cancer Horoscope in Telugu May 26
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
సింహం : Leo Horoscope in Telugu May 26
చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
కన్య : Virgo Horoscope in Telugu May 26
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu May 26th 2023 Rasi Phalalu

తుల : Libra Horoscope in Telugu May 26
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
వృశ్చికం : Scorpion Horoscope in Telugu May 26
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొన్ని అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు : Sagittarius Horoscope in Telugu May 26
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
మకరం : Capricorn Horoscope in Telugu May 26
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.
కుంభం : Aquarius Horoscope in Telugu May 26
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
మీనం : Pisces Horoscope in Telugu May 26
ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

Today Horoscope: జూన్ 22 – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Ganesh Jayanti 2023: నేడు గణేశ్ తిల్కుండ్ చతుర్ధి..ఆ ప్రాంతంలో విశేషంగా పూజలు అందుకోనున్న గణనాధుడు

somaraju sharma

Today Horoscope: మే 3 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma