Today Horoscope: జూలై 12 – ఆషాడ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope:
Share

Today Horoscope:  జూలై 12 – సోమవారం – ఆషాడ మాసం

మేషం

ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి.  చేపట్టిన పనులలో శ్రమతో గాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మిధునం

ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి.  నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. దూరప్రయాణాలలో  వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

కర్కాటకం

గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు అమలు చేస్తారు.  చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో  అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

తుల

ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల  కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా  వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలలో  ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా  సాగుతాయి.

ధనస్సు

రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.

మకరం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలోనూతనప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి.

కుంభం

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.

మీనం

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో  ఆలోచనలు మార్చుకుంటారు. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున  చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

నంది నోటి నుంచి నిరంతరం జలం వచ్చే ఏడువేల ఏండ్ల నాటి శివాలయం !

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 29th మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

ఈ వీధిపోట్లు మంచివే !

Sree matha