NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ రెడ్డిని బచ్చా అనేసిన కోమటిరెడ్డి!ఇంకా ఆ మాజీ మంత్రి కోపం తగ్గలేదా?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి టిపిసిసి రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడని.. అతడి గురించి తన వద్ద మాట్లాడవద్దని అనేశారు.అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థవంతమైన నేత పార్టీలో లేరని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలను విశ్లేషిస్తే తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై ఆయన ఇంకా కోపంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Komatireddy Comments on Revanth Reddy
Komatireddy Comments on Revanth Reddy

రేసులో ఉన్నా ఆఖర్లో చేజారిన పదవి!

ఉత్తమ్ కుమార్ రాజీనామా తర్వాత తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకానికి సుదీర్ఘ కసరత్తు సాగింది.ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ ప్రధానపోటీ రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యే నెలకొంది.నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కా కాంగ్రెస్ వాది.సుదీర్ఘకాలం మంత్రిగా చేసిన అనుభవం ఉన్న నేత.సీనియర్ మోస్ట్ నాయకుడు.నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా మార్చిన ఘనుడు.రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి మూడేళ్ల క్రితమే కాంగ్రెస్ లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి లోకసభ ఎన్నికల్లో గెలిచారు.తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జూనియర్ మోస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డే.అయినా కాంగ్రెస్ యువరాజు రాజీవ్ గాంధీ మోజు పడడంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కింది.ఇది సహజంగానే కోమటిరెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.దీంతో ఆయన బరస్ట్ అయ్యారు.

గట్టిగానే నిరసన తెలిపిన వెంకటరెడ్డి!

ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని .. తన రాజకీయ భవిష్యత్తు అంతా తన కార్యకర్తలే నిర్ణయిస్తారని అన్నారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిందని ఘాటైన విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. టీపీసీసీ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని.. ఓటుకు నోటు మాదిరిగానే, నోటుకు పీసీసీని అమ్మేశారని ఆరోపించారు.అయితే తర్వాత ఆయన సర్దుకున్నట్లు కనిపించినప్పటికీ మళ్లీ రేవంత్ రెడ్డి మీద చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మీ మీ ఊర్లలో గెలిచి రమ్మన్న వెంకట రెడ్డి!

ఏకంగా పిసిసి అధ్యక్షుడిని బచ్చాగాడు అన్నట్లు కోమటిరెడ్డి మాట్లాడటం ఇక్కడ గమనార్హం.అంతేగాక కొత్తగా పీసీసీ పదవులు చేపట్టిన వారందరూ వారి వారి నియోజకవర్గాల్లో గెలిచి రావాలని కూడా కోమటిరెడ్డి సూచించటం కూడా రేవంత్రెడ్డిని ఉద్దేశించే అంటున్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓడిపోవడం ఇక్కడ గమనార్హం.మొత్తం మీద కోమటిరెడ్డి ఇంకా చల్లబడ లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N