NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.ధనయోగం కలుగుతుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 2 – ఫాల్గుణమాసం- శుక్రవారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రారంభించిన ప్రతి పని ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల మీకు సహాయం చేసే వారిని దూరం చేసుకుంటారు. ఎదుటి వారి మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. రుణబాధలు తగ్గిపోతాయి. అవసరానికి ధనలాభం కలుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. పెద్ద వారి మాటలను గౌరవించడం వల్ల అంతా శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్త్రీలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మి కుబేర స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.ప్రమాదాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. చెప్పుకోలేని ఇబ్బందులు ఏర్పడతాయి. మనోవేదనకు గురవుతారు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. మీ మొండి పట్టుదల వల్ల చికాకు వల్ల సోదరుల మధ్య విభేదాలు కలుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. వ్యాపారాల్లో విస్తరణ లోపించి స్వల్ప నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.ధనయోగం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనయోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆయన వారితో స్నేహితులతో కలిసిమెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. వస్తువు క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. తెలియని క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి శ్రద్ధ చూపుతారు.
రెమిడీః ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

today horoscope in telugu april 2
today horoscope in telugu april 2

సింహరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలను పట్టించుకోకుండా చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల మీకు సహాయం చేసే వారు దూరమవుతారు. మీరు తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలు పని ఒత్తిడికి లోనై ప్రశాంతంగా కోల్పోతారు.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.విహార యాత్రలు చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఎదుటివారి బాధను మీ బాధగా గుర్తిస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ మీరు ఆకట్టుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదివి కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపార వృద్ధి పెరుగుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు నీతి నిజాయితీకి ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.స్నేహితులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు సంతోషకరంగా లేదు. మీలో ఉన్న సోమరితనం వల్ల అనుకున్న పనులు వాయిదా పడతాయి. దీనివల్ల మీరు నష్టపోతారు. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల, చికాకు వల్ల స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీరు మంచి చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. తొందరపడి ఎదుటివారి మాటలు నమ్మడం వల్ల మోసపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు స్నేహితులతో కలసి కాలాన్ని వృధా చేస్తారు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ అవుతుంది. స్వల్ప నష్టం కలుగుతుంది. స్త్రీలు పెద్ద వారి మాటలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేస్తారు. ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి కష్టపడి సంతోషంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాలు తొందరపడకుండా ఆలోచించి మీకు మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును వస్తువులను తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి ఆ పనిని పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.ఋణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటారు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి లోపించి ఎంత చదివినా గుర్తు ఉంచుకోలేరు. ఋణ బాధలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులతో సఖ్యత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి. సాయంత్రం సమయంలో స్వామివారికి చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించి బీదవారికి ప్రసాదంగా పెట్టండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.స్త్రీలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నతమైన హోదాలను పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో మార్కులు పొందుతారు. మీలో ఉన్న తెలివితేటల వల్ల సమయస్ఫూర్తి వహించి ఎదుటి వారితో పనులు చేయించుకుంటారు. గతంలో పూర్తి కాని పనులను తిరిగి సమయానికి పూర్తిచేస్తారు. స్త్రీలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఆనందకరంగా లేదు. మీలో జ్ఞాపక శక్తి లోపిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. స్థిరాస్తులు అనుకూలించవు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకున్న జ్ఞాపక శక్తి కోల్పోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడి స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్-2- పాల్గుణ మాసం –శుక్రవారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు మీకు సంతోషకరంగా ఉంటుంది. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. పెట్టుబడులు పెడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. తెలియని విషయాలను తెలుసుకుంటారు. క్రొత్త క్రొత్త పుస్తకాలు చదవడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. అర్థం కాని విషయాలను తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju